Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ విహారిని ప్రేమిస్తుందని అందరితో చెప్పిన సహస్ర.. విహారి షాకింగ్ నిర్ణయం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి వచ్చి లక్ష్మీ నిశ్చితార్థం ఆపేయడంతో పాటు సహస్ర వాళ్లకి వార్నింగ్ ఇవ్వమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఎంత చెప్పినా వినకుండా పద్మాక్షి, సహస్రలు లక్ష్మీకి నిశ్చితార్థం చేయాలని చూస్తారు. రింగులు తీసుకొచ్చి మార్చుకోమని అంటారు. సహస్ర లక్ష్మీకి రింగు తీసుకోమని అతను నీకు కాబోయే భర్త అని అతనితోనే నీకు బతుకు అని ఉంగరం పెట్టమని చెప్తుంది. లక్ష్మీ ఏడుస్తు కాళ్లు పట్టుకుంటా పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టొదని అంటుంది. సహస్ర ఎంత చెప్పినా లక్ష్మీ వినకపోవడంతో సహస్ర గన్ తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఉంగరం తొడగకపోతే తనని తాను కాల్చుకొని చనిపోతానని హడావుడి చేస్తుంది.
లక్ష్మీ: అసలు ఈ లక్ష్మీ ఇంత బలుపుగా ఉండటానికి పొగరుగా ఉండటానికి కారణం మీరే అత్తయ్య లక్ష్మీ ఈ ఉంగరం తొడుగు.
పెళ్లికొడుకు: మేడం ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేనట్లుంది ఇంత భయపెట్టి పెళ్లి చేయడం అవసరమా చెప్పండి.
సహస్ర: రేయ్ నీ మొహానికి ఇంత మంచి అమ్మాయి దొరుకుతుందా కళ్లకుం అత్తుకొని పెళ్లి చేసుకో. ఎక్కువ చేయకు లక్ష్మీ ఉంగరం తొడుగుతావా తొడగవా.
లక్ష్మీ: సహస్రమ్మా నా వల్ల కావడం లేదు నాకు ఇష్టం లేని పని చేయలేను.
సహస్ర: నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావో తెలీదు కానీ నీ వల్ల ఈ ఇంట్లో రోజు ప్రాబ్లమ్సే. అందరి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. ఇకపై అవి జరగడానికి వీళ్లేదు నువ్వు వీడిని పెళ్లి చేసుకోవాలి వీడితోనే కాపురం చేయాలి.
పద్మాక్షి: దీన్ని బతిమాలడం ఏంటి సహస్ర బలవంతంగా ఉంగరం తొడిగించాలి బలవంతంగా పెళ్లి చేసి పంపాలి.
సహస్ర: నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా రేయ్ రా. అని లక్ష్మీ చేతితో బలవంతంగా ఉంగరం అబ్బాయికి తొగడాలని ప్రయత్నిస్తుంది. వద్దని లక్ష్మీ చేతులు లాగేస్తుంది.
విహారి: ఆపండి.
సహస్ర: బావ సడెన్‌గా ఇంటికి వచ్చేశాడు ఇప్పుడెలా. ఛా.
విహారి: ఏం జరుగుతుంది ఇక్కడ
పద్మాక్షి: లక్ష్మీకి నిశ్చితార్థం జరుగుతుంది విహారి.
విహారి: ఈ నిశ్చితార్థం జరగడానికి వీళ్లేదు. పెళ్లి కొడుకుని ఒక్కటి ఒక్క ఇంకొక్క నిమిషం మీరు ఇక్కడ ఉంటే వాడి మీద పడిన దెబ్బ మీకు తగులుతుంది అని చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు. హఠాత్తుగా లక్ష్మీకి నిశ్చితార్థం ఏంటి.
పద్మాక్షి: తనకు నిశ్చితార్థం చేస్తే తప్పు ఏంటి ఒంటరి ఆడపిల్ల ఎన్నాళ్లు ఇలా మన ఇంట్లో ఉంటుంది. ఎన్నాళ్లు ఇలా పోషిస్తారు. ఏ దాన్ని బయటకు పంపే ఉద్దేశం నీకు లేదా. దానికి ఒక దారి చూపించాలి అనే ఆలోచన నీకు లేదా.
విహారి: దాని కంటూ ఒక సమయం సందర్భం ఉంటుంది ముఖ్యంగా చేసుకునేవాడు లక్ష్మీకి నచ్చాలి.
సహస్ర: అసలు లక్ష్మీ కోసం నువ్వు ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నావ్ బావ. తను ఏమైనా నీకు అత్త కూతురా లేక మామ కూతురా. ఆఫ్ట్రాల్ ఈ ఇంటి పని మనిషి.
విహారి: చూడు సహస్ర లక్ష్మీనే కాదు ఎవరు ఆ స్థానంలో ఉన్నా నేను ఇలాగే మాట్లాడుతా తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు.
సహస్ర: అలా అని అది పెళ్లీ పెటాకులు లేకుండా ఈ ఇంట్లో తిరగడం నాకు ఇష్టం లేదు.
విహారి: సహస్ర అసలు లక్ష్మీని నువ్వు ఎందుకు ఇంత కోపగిస్తున్నావ్. ఎందుకు వదిలించుకోవాలని ఇంతలా ప్రయత్నిస్తున్నావ్ తన వల్ల మీకు ఏమైనా ఇబ్బంది పెడుతుందా. మీకు అన్నీ పనులు చేసి పెడుతుంది కదా.
సహస్ర: నువ్వు పగ అనుకో మరేమైనా అనుకో తను ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ముందు తనని మెడ పట్టుకొని బయటకు గెంటేయాలి లేదంటే పెళ్లి చేసి పంపేయాలి అంతే.
విహారి: నువ్వు ఏదో మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నావ్ అసలు నీ ఉద్దేశం ఏంటి.
అంబిక: ఇందులో ఉద్దేశం ఏంటి విహారి తోడు లేని ఒంటరి దాన్ని పెళ్లి చేయాలని ఒక తోడు ఇవ్వాలని అనుకంటుంది.
విహారి: లేదు అత్తయ్యా సహస్ర మనసులో ఇంకెదో ఉంది గొప్ప మనసుతో చేశాను అని కళ్ల బొల్లి కబుర్లు చెప్తే నేను వినను. ఎందుకు ఇలా చేస్తున్నావ్ చెప్పు సహస్ర.
సహస్ర: ఎందుకంటే లక్ష్మీ నీ మీద మనసు పడుతుంది కాబట్టి.
విహారి: ఏం మాట్లాడుతున్నావ్ సహస్ర.
సహస్ర: అవును బావ ఈ ఇంటి పని మనిషి యజమాని మీద మనసు పడుతుంది కాబట్టి. నేను పెళ్లి చేసుకోబోయే మనిషి మీద మనసు పడుతుంది కాబట్టి. నేను కలిసి జీవించాలి అనుకున్న మనిషి మీద తను మనసు పడుతుంది కాబట్టి.
లక్ష్మీ: సహస్రమ్మా నేను నా మీద ఒట్టేసి చెప్తున్నా విహారి గారి మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు ఎప్పటికీ ఉండదు. అనాథగా ఉన్న నాకు యమునమ్మగారు ఈ ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు. అలాంటి ఇంటికి నేను ఎలా ద్రోహం చేస్తాను. మీకు విహారి గారికి పెళ్లి అవుతుంది అని తెలిసి కూడా అలా ఎలా చేస్తాను.
సహస్ర: నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడే అధికారం లేదు.
విహారి: ముందు నీకు లక్ష్మీ మీద ఇలాంటి నిందలేసే అధికారం ఎవరు ఇచ్చారో చెప్పు. సాటి ఆడదాని కోసం ఇలాంటి నిందలు వేస్తావా.
సహస్ర: లేదు బావ నీకు అర్థం కావడం లేదు ఈ లక్ష్మీ నీ మీద మనసు పడుతుంది. అసలు ఈ లక్ష్మీ వల్ల మన పెళ్లి అవుతుందా లేదా అని నాకు కొత్త అనుమానం పుడుతుంది.
విహారి: నీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందో తెలీదు కానీ లక్ష్మీ ఏరోజు తప్పుగా నాతో ప్రవర్తించలేదు.
లక్ష్మీ: అవును సహస్రమ్మా రెండు కుటుంబాలు కలపడానికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు. తెలిసి తెలిసి నేను అలాంటి చిచ్చు ఎలా పెడతాను.
విహారి: సహస్ర లక్ష్మీని నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లక్ష్మీ వీళ్లందరి తరుఫున నేను నీకు చేతులెత్తి క్షమాపణ చెప్తున్నా అందరిని క్షమించు. సహస్ర నువ్వు నా మీద ప్రేమ తోనే ఇలా చేస్తున్నావు అని నాకు తెలుసు కానీ అది ఇలా ఇబ్బంది పెడితే నాకు నచ్చదు. లక్ష్మీని ఎప్పుడు ఇక్కడి నుంచి పంపాలి ఎప్పుడు తనకి మంచి జీవితం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ విషయం నాకు వదిలేయ్. తర్వలోనే మన పెళ్లి జరుగుతుంది కదా దాని గురించే ఆలోచించు. మన పెళ్లి ఎంత సంతోషంగా జరగాలో అది మాత్రమే ఆలోచించు అర్థమైందా.
సహస్ర: బావ సారీ బావ నీ మీద ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నా నాకు నీ ప్రేమ కావాలి కానీ నీ కోపం వద్దు బావ. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!