Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 24th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: మరీ ఇంత దారుణమా.. ఆ పరిస్థితిలో కూడా లక్ష్మీతో గొడ్డు చాకిరీ చేయించిన సహస్ర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: లక్ష్మీ పద్మాక్షి స్నేహితులకు కాఫీ ఇస్తు కళ్లు తిరిగిపడిపోవడంతో సహస్ర లక్ష్మీతో ఇంటి చాకిరీ మొత్తం చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పద్మాక్షి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటుంది. అంబిక, సహస్ర అటుగా వెళ్తుంటే వాళ్లు సహస్రని పిలిచి మాట్లాడుతారు. పెళ్లి కల వచ్చేసిందని సహస్రని ఆటపట్టిస్తారు. ఇక వసుధ, యమున మాట్లాడటం చూసి మీ చెల్లి కదా అని వసుధని అంటారు. పద్మాక్షి వసుధని పిలుస్తుంది. యమున కూడా వెనకాలే వెళ్తుంది. పద్మాక్షి వసుధని పరిచయం చేస్తుంది. ఇక యమున గురించి అడిగితే ఎవరో చెప్పే అంత గొప్ప చరిత్ర లేదని అంటుంది.
వసుధ వాళ్లతో ఈవిడ మా వదిన సహస్రకు కాబోయే అత్తయ్య అని అంటుంది. ఇక పద్మాక్షి లక్ష్మీకి చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. వసుధ చెప్పడంతో లక్ష్మీ కాఫీ చేస్తుంది. అయితే కాఫీ కలుపుతున్నప్పుడు నుంచే లక్ష్మీకి కళ్లు తిరుగుతుంటాయి. అయినా కాఫీ కలిపి తీసుకొస్తుంది. గెస్ట్‌లు ఇచ్చే టైంకి కళ్లు తిరిగి కాఫీ ట్రే పడేస్తుంది. చీర మీద పడిందని వాళ్లు తిడతారు. లక్ష్మీ తల పట్టుకొని ఇబ్బంది పడుతుంది. పద్మాక్షి లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. దాంతో లక్ష్మీ కింద పడిపోతుంది. యమున లక్ష్మీని దగ్గరకు తీసుకుంటుంది.
పద్మాక్షి: కాఫీ కూడా ఇవ్వడం చేతకాదా.. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసేశావే.
లక్ష్మీ: అనుకోకుండా కళ్లు తిరగడంతో అలా అయిందమ్మా
అంబిక: అంత కళ్లు తిరిగే పని ఏం చేస్తున్నావే ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నట్లు కవరింగ్ ఇస్తున్నావ్.
లక్ష్మీ: ఏం లేదమ్మా ఒక చిన్న పూజ చేసుకుంటున్నాను. దాని కోసం ఉపవాసం ఉండటం వల్ల ఇలా కళ్లు తిరగాయి.
సహస్ర: నీకు పెళ్లి పెటాకులు లేవు నీకు ఎందుకే పూజలు ఉపవాసాలు.
వసుధ: సహస్ర దేవుడిని మొక్కుకోవడానికి పెళ్లే అవసరం లేదు.
పద్మాక్షి: ఏయ్ ఇదంతా క్లీన్ చేయ్.
యమున: అమ్మా లక్ష్మీ నువ్వు వెళ్లి పండుని పంపించు.
లక్ష్మీ: పండు లేడమ్మా నేనే క్లీన్ చేస్తా.
కళ్లు తిరుగుతూ ఉన్నా సరే లక్ష్మీ క్లీన్ చేస్తుంది. సహస్ర వాళ్లు చూస్తూ ఉంటారు. త్వరగా చేయమని కోప్పడతారు. ఇక లక్ష్మీ గెస్ట్‌లకు సారీ చెప్పి వెళ్లిపోతుంది. ఇక పద్మాక్షి ఫ్రెండ్స్ వెళ్లిపోయిన తర్వాత కిచెన్‌లో ఉన్న లక్ష్మీని సహస్ర బయటకు తీసుకొచ్చి చాలా బట్టలు విసిరేసి ఉతకమని చెప్తుంది. పండు వచ్చాక వాషింగ్ మెషిన్‌లో వేయిస్తా అని లక్ష్మీ అంటే కుదరదని ఇప్పుడే చేతితో ఉతుకు అని చెప్తుంది. సరే అని లక్ష్మీ ఉతుకుతుంది. ఓపిక లేక పోయినా లక్ష్మీ ఉతుకుతుంది. సహస్ర త్వరగా చేయమని లక్ష్మీని ఇబ్బంది పెడుతుంది. తర్వాత చాలా అంట్లు ఇంటి నుంచి తీసుకొచ్చి విసిరేసి తోమమని చెప్తుంది. లక్ష్మీకాదు అనకుండా చేస్తుంది. సహస్ర అక్కడే కుర్చీలో కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుకుంటుంది. తర్వాత ఇంటి బయట మొత్తం చీపురుతో తుడిపిస్తుంది. లక్ష్మీ చేస్తూనే చాలా ఇబ్బంది పడుతుంది. ఇక రాత్రి ఇంటికి విహారి వస్తాడు.
సహస్ర విహారిని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. అంబిక మాత్రం అనుమానంగా చూస్తుంది. అందరూ విహారి దగ్గరకు వెళ్తారు. పెళ్లిని సంతోషంగా జరుపుకోవాలని ఆఫీస్ పనులు తగ్గించుకో అని యమున చెప్తుంది. ఇక అంబిక విహారితో విజయవాడ ఎందుకు వెళ్లావో నాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అని అంటుంది. దానికి విహారి టైం తీసుకొని క్లారిటీ ఇస్తానని అంటాడు. ఇక విహారిని ఫ్రెష్ అప్ అవ్వమని యమున పంపుతుంది. విహారి వెళ్తూ కిచెన్లో ఉన్న లక్ష్మీని చూస్తాడు. పండు లక్ష్మీ దగ్గరకు వచ్చి విహారి బాబు ఆఫీస్ నుంచి వచ్చారు నువ్వు వెళ్లి పూజ పనులు చూసుకో అంటాడు. లక్ష్మీ వెళ్లి పూజ చేస్తుంది. విహారి చేతితో అక్షింతలు వేయించుకోవాలని కొంగుకి కట్టుకుంటుంది. విహారి దగ్గరకు వెళ్లడానికి కాఫీ కలుపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.