Karthika Deepam 2 Serial Today December 24th: కార్తీకదీపం 2 సీరియల్: ఏమైందమ్మా ఈనాడు.. చినబోయాడే కార్తీక్ సూరీడు.. శ్రీధర్, కావేరిల ఆఫర్‌కు కాంచన ఒప్పుకుంటుందా!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ ఇంటికి కావేరి, శ్రీధర్‌లు వచ్చి బిజినెస్‌కి డబ్బు ఇస్తామని చెప్పడం కాంచన కావేరిని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్‌కి ఇంటి ఓనర్ అడ్వాన్స్ ఇమ్మని చెప్తే కార్తీక్ డబ్బులు లేవని ఫోన్ ఇచ్చి దాన్ని ఉంచమని డబ్బు ఇచ్చి తీసుకుంటానని అంటాడు. దీప చూసి చాలా బాధ పడుతుంది. ఇక ఓనర్ డబ్బు విషయంలో నేను మంచోడిని కాదని టైంకి డబ్బు ఇవ్వమని చెప్తాడు. కార్తీక్ లోపలికి వెళ్తూ దీపని చూసి కవర్ చేయడానికి పువ్వులు అది ఇదీ అని మాట్లాడుతాడు. గార్డెన్ బాగుంది ఇళ్లు నాకు నచ్చింది అని అంటాడు. దీప ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య వచ్చి నాన్న వెళ్లిపోదాం పద నాకు ఈ ఇళ్లు నచ్చలేదు అని అంటుంది. కార్తీక్ సర్దిచెప్పి పాపని లోపలికి తీసుకెళ్తాడు.
కార్తీక్: నాన్నకి ఈ ఇళ్లు నచ్చినప్పుడు నువ్వు నచ్చలేదు అంటే నాన్న బాధ పడతాడు కదా.
శౌర్య: అవునా అయితే నాకు ఈ ఇళ్లు నచ్చింది మనం ఇక్కడే ఉంటాం నాన్న. అమ్మ నాకు ఆకలేస్తుంది ఏమైనా పెట్టు అమ్మా.
కాంచన: కార్తీక్ శౌర్యని అలా బయటకు తీసుకెళ్లురా దీపని తీసుకెళ్లు అది ఏం తినలేదు. మీరు వెళ్లండి మేం ఈ లోపు ఇళ్లంతా శుభ్రం చేస్తాం.
అనసూయ: చెల్లమ్మా కార్తీక్ బాబుని ఇలా చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదమ్మా.
కాంచన: నీకే అలా ఉంటే కన్న తల్లిని నాకు ఎలా ఉంటుందో ఆలోచించు అక్క కానీ తప్పుదు కష్టాలు వచ్చినప్పుడే కాస్త గట్టిగా ఉండాలి
కార్తీక్ శౌర్య, దీపలను తీసుకొచ్చి ఓ బండి దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ తిందామని అంటాడు. కార్తీక్ టిఫెన్ ఆర్డర్ చేస్తాడు కానీ డబ్బు లేకపోవడం చూస్తాడు. మొత్తం వెతికితే జేబులో వంద మాత్రమే ఉంటుంది. ఇక రెండు ప్లేట్ల టిఫెన్ అడిగితే బండి వ్యక్తి చూసి కార్తీక్ ఇబ్బందిని ఆ వంద తీసుకొని మూడు ప్లేట్లు ఇస్తాడు. కార్తీక్ ఆయనకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక ముగ్గురూ తింటారు. ఇక కార్తీక్ తినబోతే శౌర్య ఇంకా ఆకలి అని అంటుంది. దాంతో కార్తీక్ తన ప్లేట్ శౌర్య దగ్గర పెట్టేసి మీరు తింటూ ఉండండి నేను ఫోన్ మాట్లాడేసి వస్తానని చెప్పి వెళ్లి నీరు తాగుతాడు. దీప కార్తీక్ దగ్గర వెళ్లి అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టారా అని అంటుంది. ఇంకా తింటావా తీసుకురావాలా అని కార్తీక్ అడిగితే డబ్బు ఉందా అని దీప అంటుంది. ఉన్నాయి అని కార్తీక్ అంటే చూపించమని దీప అంటుంది. ఇక దీప ఏడుస్తుంది. డబ్బులు లేకే కదా ఆకలి లేదు అని శౌర్యకి ఇచ్చేసి మీరు పస్తు ఉన్నారని అంటుంది. మరేం చేయను దాని ఆకలి తీర్చడానికి అని అంటాడు. ఇక దీప ఇద్దరం కలిసి తిందామని అంటుంది. ఇద్దరూ కలిసి తింటారు.
ఇక అనసూయ ఇళ్లు క్లీన్ చేస్తుంటే కాంచన కూడా కొంగు కప్పుకొని బూజు దులుపుతుంది. వద్దని అనసూయ చెప్పినా వినదు. ఇక అప్పుడే శ్రీధర్ వచ్చి చప్పట్లు కొడుతూ శ్రీమతి చేతిలో బూజు కర్ర ఇలాంటి సంఘటన జీవితంలో చూస్తాను అనుకోలేదని అంటాడు. ఇక కావేరి కూడా బ్యాగ్ తీసుకొని వస్తాడు. మీరు ఎందుకు వచ్చారని కాంచన అడుగుతుంది. స్వప్న జరిగింది కావేరికి చెప్పిందని శ్రీధర్ అంటాడు. ఇంతలో కార్తీక్ దీపలు ఇంటికి వస్తారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. ఎందుకు వచ్చావ్ అని కార్తీక్ అడిగితే నా భార్య కొడుకు కష్టాల్లో ఉంటే చూడకుండా ఊరుకుంటానా అంటాడు. ఇక నా మీద అయితే అరుస్తాడు కానీ తాతని ఏం అనలేడు అని అంటాడు. ఎలా బతుకుతారు అడుక్కు తింటారా అని అంటాడు. ఇక కావేరి భర్తని ఆపి వచ్చిన పని చూద్దామా అని బ్యాగ్ కాంచన ముందు పెట్టి దీని అవసరం మీకే ఉందని తీసుకొచ్చానని అంటుంది.
కార్తీక్ బిజినెస్ పెట్టడానికి 10 లక్షలు తీసుకొచ్చానని అంటుంది. ఇంకా అవసరం అయితే ఎవరి దగ్గర అయినా తీసుకొని ఇస్తానని అంటుంది. కాంచన కావేరిని తిడుతుంది. దానికి శ్రీధర్ మీ తాత వదిలేసినట్లు నేను మిమల్ని వదులు కోలేను అని అంటాడు. మీరు ఇప్పుడు పేదవారు నేను సాయం చేస్తున్నా అని అంటాడు. కార్తీక్ బిజినెస్ చేయడానికి నాదగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేస్తానని కాకపోతే కార్తీక్ కాంచన తనకు సారీ చెప్పి వాళ్లతో పాటు ఉండటానికి ఒప్పుకోవాలని కండీషన్ పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: ఇన్నాళ్ల దూరం.. గుండెల్లో గాయం.. అయింది బంధం.. విమానంలో తల్లికి బిడ్డ వీడ్కోలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

