Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 22nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: పీక్స్‌లో లక్ష్మీ, వసుధ చారుకేశవల ఎమోషన్! విహారి-సహస్రల ఫైట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode December 22nd లక్ష్మీ అంబికతో 200 ఎకరాలు ఇవ్వను అని చెప్పడం, అంబిక వేరే రాష్ట్ర అబ్బాయిని ఓకే చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ రెండు వందల ఎకరాలు, విహారి కంపెనీలో మంచి పొజిషన్ ఇస్తాను అనడంతో అంబిక పెళ్లికి ఓకే చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. తనకు నచ్చినవాడిని.. తనకు నచ్చినట్లే పెళ్లి జరగాలి అని అంబిక తండ్రికి కండీషన్ పెడుతుంది. అంబిక పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి అని సహస్ర, పద్మాక్షి అనుకుంటారు.
అంబిక లక్ష్మీ దగ్గరకు వెళ్లి రెండు వందల ఎకరాలు రాస్తాను అన్నావ్ కదా రేపు రిజస్టేషన్ ఆఫీస్కి వెళ్దామని అంటుంది. నేను రాను రాయను అమ్మా అని లక్ష్మీ అంటుంది. ఏంటే నువ్వు 200 ఎకరాలు రాస్తాను అంటే కదా నేను పెళ్లికి ఒప్పుకున్నా అని అంటుంది. నేను రాయను అమ్మా మీరు దత్తత ఆపేస్తే పెళ్లికి ఒప్పుకుంటా అని చెప్పి మాట తప్పారు. ఇప్పుడు నేను మీకు 200 ఎకరాలు ఆశ చూపి పెళ్లికి ఒప్పించా.. టిట్ ఫర్ ట్యాట్ అంటుంది. నీ దగ్గర నుంచి ఆ రెండు వందల ఎకరాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంబిక అంటే అస్సలు ఆ 200 ఎకరాలు మీకు దక్కనివ్వను అని లక్ష్మీ అంటుంది.
ఆదికేశవులు పక్కింటి వాళ్లు కూతురికి కూడా అమెరికా సంబంధం చేశామని అల్లుడు సరిగా చూసుకోవడం లేదు అని కూతురు ఏడుస్తుందని పుట్టింటికి పంపేస్తామని అంటున్నారని కూతురు ఏడుస్తుందని చెప్తారు. దాంతో ఆదికేశవులు వాళ్లకి బాధ పడొద్దని చెప్పి మీరే నచ్చచెప్పాలని అంటాడు. వాళ్లకి ధైర్యం అయితే చెప్తారు కానీ లక్ష్మీ కాపురం గురించి ఆదికేశవులు బెంగ పెట్టుకుంటారు.
భక్తవత్సలం ఇంటికి పెళ్లిళ్ల పేరయ్య వస్తారు. ఇంట్లో అందరూ సందడిగా పెళ్లి కొడుకుని సెలక్ట్ చేసే పనిలో పడతారు. పెళ్లిళ్ల పేరయ్య ఫొటోలను చూపిస్తారు. గొప్ప గొప్ప సంబంధాలు అన్నీ కాదన్న అంబిక ఓ పంజాబీ అతన్ని ఓకే చేస్తుంది. అతనిది మన రాష్ట్రం కాదు.. కులం కాదు ఎందుకు అని అందరూ అన్నా కూడా నాకు అతనే నచ్చారని చెప్తుంది. పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని భక్తవత్సలం చెప్తారు. లక్ష్మీ కిచెన్లో పనులు చేస్తుంటే పండు వచ్చి నువ్వు దత్తత ఆపేసినప్పటి నుంచి వసుధమ్మా, చారుకేశవ బాబు ఏడుస్తూనే ఉన్నారు.. కిందకి కూడా రాలేదు అని చెప్తాడు.
లక్ష్మీ, పండు ఇద్దరూ వాళ్ల గదికి వెళ్తారు. ఇద్దరూ లక్ష్మీ దత్తత ఆపేసినందుకు ఏడుస్తూ ఉంటారు. లక్ష్మీ వెళ్లి ఇద్దరి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతుంది. చారుకేశవ ఏడుస్తూ తనని అందరూ ఏడిపిస్తూనే ఉండేవాళ్లు.. ఏ శుభకార్యానికి వెళ్లినా అవమానించేవాళ్లు.. దత్తత అన్నప్పుడు నుంచి ఎంత సంతోషంగా ఉన్ను అంతే పెళ్లి తర్వాత అలా చూడటం మొదటిసారి కానీ అమ్మ అన్న పిలుపునకు అడుగు దూరంలో ఆగిపోయిందని అంటాడు. లక్ష్మీ ఏడుస్తూ సారీ పిన్ని అని చెప్తుంది. నువ్వు దత్తత వద్దు అనేసరికి ఆ మాట జీర్ణించుకోలేకపోయాం అని వసుధ ఏడుస్తుంది.
లక్ష్మీ వాళ్లతో మా అమ్మానాన్నలు బతికుండగానే ఇలా దత్తతకు వెళ్లడం మంచిది కాదని ఆపానమ్మా ఈ విషయం మీకు ముందే చెప్పాల్సింది కానీ కుదరలేదు అని ఏడుస్తుంది. చారుకేశవ వసుధతో ఎవరు ఏమన్నా లక్ష్మీ మన కూతురే.. దత్తత తీసుకుంటే కాదు అని అంటుంది. యమున వచ్చి కరెక్ట్గా చెప్పావ్ చారుకేశవ ఇక నుంచి లక్ష్మీని మీ కూతురిగా చూసుకోండి అని అంటుంది. నేను మిమల్ని అమ్మానాన్నలే అనుకుంటా అని అంటుంది. అందరూ చాలా సంతోషపడతారు. ఇక లక్ష్మీ పండుకి భోజనం తీసుకురమ్మని చెప్పి తానే దగ్గరుండి భోజనం తినిపిస్తుంది. తర్వాత వాళ్లు లక్ష్మీకి కూడా తినిపిస్తారు. లక్ష్మీ యమునకు కూడా తినిపిస్తుంది. పండుకి కూడా తినిపిస్తుంది.
సహస్ర తనని మోసం చేసి పెళ్లి చేసుకుందని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విషయం కనకమహాలక్ష్మీకి చెప్పాలి అనుకుంటాడు. ఇంతలో సహస్ర వచ్చి మాట్లాడితే విహారి కోపంగా ఉంటాడు. సహస్రని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే సహస్ర విహారిని ఆపి నీ కోసం నీ ప్రేమ కోసం మాత్రమే ఇలా చేశాను కోప్పడితే ఎలా బావ అని సారీ చెప్తుంది. సహస్ర నువ్వు నాతో మాట్లాడకు వెళ్లిపో అని అంటాడు. అంతా మర్చిపోయి కలిసి ఉందాం అంటే విహారి కుదరదు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















