అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర చేసిన మోసం తెలుసుకున్న విహారి! నింద మోస్తున్న యమున!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode Dec 16th సుభాష్‌ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని లక్ష్మీ అంబికను అడగటం అంబిక లక్ష్మీ మీద దాడి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబికకు ఎలా అయినా పెళ్లి చేయాలి అని భక్తవత్సలం అంటారు. అంబిక పెళ్లి అయ్యే వరకు నా పంతం వీడను ఇంకెవరూ ఈ విషయంలో మాట్లాడొద్దు అని భక్తవత్సలం అంటారు.

అంబిక గదిలోకి వెళ్లి పెళ్లి ప్రస్తావన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతున్న అంబిక దగ్గరకు లక్ష్మీ వచ్చి ఈ వయసులో మీనాన్న గారిని ఇబ్బంది పెట్టొద్దు.. పెళ్లికి ఒప్పుకోండి ఆయన సంతోషపడతారు అని చెప్తుంది. ఏంటే ఒప్పుకునేది అసలు నీ వల్లే ఇదంతా వచ్చింది.. నిన్ను కాపాడటానికి నాకు పెళ్లి చేసి పంపాలని అనుకుంటున్నారు అని అంటుంది. మీరు అనుకున్నది నిజం కాదమ్మా.. మీరు ఒంటరి జీవితం గడపకూడదు అని పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని లక్ష్మీ చెప్తుంది. నువ్వు రావడం వల్లే నన్ను ఇలా చూస్తున్నారు.. నువ్వు రావడం వల్లే మహారాణిలా ఉన్న నేను ఇలా అయిపోయాను అంటుంది.

లక్ష్మీ అంబికను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి విషయంలో మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నా అని లక్ష్మీ అంటుంది. దానికి అంబిక నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది. అయినా లక్ష్మీ వినకుండా ఈ పెళ్లి విషయంలో నాకు ఓ డౌట్ ఉంది.. మీరు ఈ పెళ్లి వద్దు అనడానికి ఆ సుభాష్‌ కారణం కాదు కదా అని అడుగుతుంది. అంబిక షాక్ అయిపోతుంది. మీ ఇద్దరూ క్రైమ్ పార్టనర్స్ కదా.. అలాగే రియల్ పార్టనర్స్ కూడా కావాలి అని ఈ పెళ్లి వద్దు అంటున్నారా అని లక్ష్మీ అడగగానే అంబిక ఆవేశం పెరిగిపోతుంది.

లక్ష్మీని అమాతం పీక పట్టుకొని గాల్లోకి లేపేస్తుంది. లక్ష్మీ విలవిల్లాడిపోతుంది. అటుగా వెళ్తున్నా చారుకేశవ చూసి అంబికని తోసేస్తాడు. ఏం చేస్తున్నావ్ అంబిక చంపేస్తావా అని అడుగుతాడు. నా విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తా అని అంటుంది. లక్ష్మీ నా కూతురు నా కూతురి మీద చేయి వేస్తే నేను చూస్తూ ఎలా ఉంటాను అని చారుకేశవ అంటాడు. మరి ఇదే లక్ష్మీని ఇంతకు ముందు నువ్వు ఎంత వేధించావో మర్చిపోయావా అని అంబిక అడిగితే చారుకేశవ ఎప్పుడో చనిపోయాడు అని అంటాడు. లక్ష్మీని అక్కడి నుంచి పంపేస్తాడు.

అంబికతో నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు.. అని అంటాడు. నీ బుద్ధి నాకు తెలుసు అని అంబిక అంటే.. నేను నా తప్పులు ఒప్పుకుంటా నువ్వు ఒప్పుకొని మారిపోతావా అని అంటాడు. నేను తప్పులు చేయడం లేదు.. మీరు చేసిన తప్పులు సరిదిద్దాలని చూస్తున్నా.. నన్ను నమ్ము బావ అని అంటుంది. నిన్ను ఎవడు నమ్ముతాడు అని చారుకేశవ అంటాడు.

విహారి సహస్ర దగ్గర డబ్బులు తీసుకున్న డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. విహారి డాక్టర్తో సహస్ర తనని పంపినట్లు మాట్లాడుతాడు. గతసారి 10 లక్షలు తీసుకున్నారు కదా ఇప్పుడు ఎంత కావాలి అని అడుగుతాడు. డాక్టర్ సహస్రకు కాల్ చేస్తుంటే విహారి కట్ చేస్తాడు. డాక్టర్తో కోపంగా నిజం చెప్పమని అడుగుతాడు. మీరు రాత్రి సహస్రతో మాట్లాడటం డబ్బు తీసుకోవడం అంతా చూశాను అని నిజం చెప్పమని అడుగుతాడు. డాక్టర్ ఏం లేదు అని అంటే ఎస్ సంధ్యకి కాల్ చేసి డాక్టర్ డొనేషన్ పేరు మీద డబ్బు తీసుకుంటున్నారు.. కేసు పెట్టాలి అని చెప్పి డాక్టర్ని బెదిరిస్తాడు. డాక్టర్ భయంతో నిజం చెప్తానని అంటుంది.

సహస్ర యాక్సిడెంట్ పెళ్లి అన్నీ డాక్టర్ విహారితో చెప్తుంది. విహారి కోపంగా ఇంటికి బయల్దేరుతాడు. సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీ బ్లడ్ శాంపిల్స్ గురించి తెలుసుకోమని అంటుంది. పద్మాక్షి డాక్టర్ని బ్లడ్శాంపిల్స్ గురించి అడుగుతుంది. ఎలా శాంపిల్స్ తీశారని డాక్టర్ అడిగితే జలగల్ని పెట్టి స్పర్శ పోయేలా చేసి రక్తం స్వీకరించామని అంటారు. దాంతో డాక్టర్ జలగలు మన శరీరంలో చెడు రక్తం ముందు తీసుకుంటాయి,, వాటి మధ్య రక్తం తీశారంటే అది చెడు రక్తం కాబట్టి దాంతో టెస్ట్ అవ్వదు అని చెప్పి లక్ష్మీని తీసుకురమ్మని చెప్తుంది. లక్ష్మీని ఎలా హాస్పిటల్కి తీసుకెళ్తామా అని ఆలోచిస్తూ ఉంటారు.

అంబిక హాల్లో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే అంబికను తండ్రి ఆపి నీ పెళ్లి విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా అమ్మా అని అడుగుతాడు. రోజు అడిగితే నువ్వు తర్వాత అన్నావ్ తర్వాత ఇన్ని ఏళ్లు అవుతుందని అనుకోలేదు అని అంటాడు. ఇక విహారి సహస్ర చేసిన మోసం తలచుకొని రగిలిపోతాడు. అందరూ అంబిక పెళ్లి గురించి మాట్లాడుతారు. యమున అంబికతో నీ పెళ్లి విషయంలో అందరూ ఆలోచించకుపోవడం తప్పే దానికి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఎలా.. అని అడుగుతుంది. వదినా మా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం మీరే అని అంబిక అంటుంది. మీరు మా అన్నయ్య జీవితంలోకి వచ్చిన తర్వాతే మా కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది. మా అక్క మాకు దూరం అయిపోయింది. తర్వాత మా అన్నయ్య మాకు దొరకనంత దూరం అయిపోయాడు. అప్పుడే కదా నేను మగరాయుడిలా పెళ్లికి దూరం అయిపోయా అని అంటుంది. చారుకేశవ అంబికతో మా అక్క తప్పు ఒక్కటే ఉందా.. మీ అన్నయ్య తప్పు కూడా ఉంది కదా ఒక్కర్తినే వెలెత్తి చూపిస్తున్నావ్ అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget