అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today August 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కల్యాణం చీర దక్కించుకున్న కనకం.. పద్మజ సీరియస్!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి తనకు కాబోయే భర్త అనుకొని హారతి ఇచ్చి తాను నచ్చానా అని అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తన మరదలు సహస్రని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అందరూ గుడి దగ్గర కలుసుకుంటారు. విహారి మేనత్త పద్మజ విహారి తల్లి మనసులో ఏముందో అని అంటుంది. దానికి విహారి తల్లి నా తప్పు సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశం అని తన కొడుకు ఇష్ట ప్రకారం సహస్రతో పెళ్లి జరగడం అదృష్టంగా భావిస్తానని అంటుంది. 

విహారి: చెప్పాను కదా అత్తయ్య మా పెళ్లితో మన కుటుంబాలు కలవాలి.
కదాంబరి: మీ అత్తయ్య చేతిలో చేయి వేసి ఆ మాట చెప్పు విహారి. 
విహారి: పద్మజ చేతిలో చేయి వేసి.. అత్తయ్య నీకు మేనల్లుడిగా ఈ ఇంటి వారసుడిగా నీకు నేను మాటిస్తున్న నేను నీ కూతురు సహస్రని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. తనని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అత్తయ్య. నువ్వు మా పెళ్లి చేసి మా గుమ్మంలోకి అడుగుపెడితే చాలు.
ప్రకాశ్: ఓ మై గాడ్ ఇంత పెద్ద బండరాయి వేశావేంట్రా.
పద్మజ: సహస్ర.
సహస్ర: నీ ఇష్టమే నా ఇష్టం అమ్మ.
పద్మజ: నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కూతుర్ని అడ్డుపెట్టుకొని నా మనసు మార్చాలని చూస్తున్నారు రేపు ఏదైనా తేడా జరిగిందో ఏడుస్తూ కూర్చొడాలు దూరంగా వెళ్లిపోవడాలు ఉండవు గుర్తు పెట్టుకోండి. ఇది హెచ్చరిక అనుకుంటారో మరేమైనా అనుకుంటారో మీ ఇష్టం.
విహారి: అత్తయ్య రెప్పపాటులో కూడా ఏ పొరపాటు జరగనివ్వం.
పద్మజ: సరే నేను ఒప్పుకుంటున్నా.

అందరూ సంతోషంతో గుడిలోనే తాంబూలాలు మార్చుకుంటారు. విహారి, సహస్ర కూడా సంతోషంగా ఉంటారు. విహారి మాటలు తలచుకొని ప్రకాశ్ షాక్ అయిపోతాడు. విహారి మేనకోడలి పెళ్లి జరిగేలోపు విహారి కనకం పెళ్లి చేసేయాలి అని లేదంటే అమెరికా వెళ్లలేను అనుకొని ఇద్దరికి కాల్ వాళ్లని విహారి తల్లిదండ్రులుగా  కనకం ఫ్యామిలీతో మాట్లాడిస్తాడు. వారం రోజుల్లో విహారి అమెరికా వెళ్లిపోవాలి అనుకుంటున్నాడని ఈలోపే పెళ్లి చేసి అమెరికా కనకాన్ని తీసుకెళ్లి పోవాలని అనుకుంటున్నాడని అంటారు. ప్రకాశ్ ఆదికేశవ్‌ని ఒప్పించేస్తాడు. వారంలో పెళ్లి చేయడానికి ఆదికేశవ్ సిద్ధమైపోతాడు. 

మరోవైపు సీతా రాముల కల్యాణంలో విహారి ఫ్యామిలీ అంతా పాల్గొంటారు. ఇక సహస్ర తనకి పెళ్లి ఫిక్స్ అయిందని తన ఫ్రెండ్‌తో చెప్పి సంబర పడిపోతుంది. ఇక విహారి తన తల్లి సరదాగా మాట్లాడుతూ ఉంటే సహస్ర అక్కడికి వెళ్తుంది. ఇద్దరితో ప్రేమగా మాట్లాడుతుంది. ఇద్దరినీ చూస్తుంటే ఝలసీగా ఉందని  ఉందని ఇద్దరూ ఒకరంటే ఒకర్ని ప్రాణంగా చూసుకుంటున్నాడని అంటుంది. మీలాంటి తల్లీకొడుకుల్ని చూస్తే ఎవరికైనా ఝలసీగానే ఉంటుందని అంటుంది. ఇక విహారి తల్లి సహస్రకు నీకు ఈ పెళ్లి అంటే ఇష్టమేనా అని అడిగితే చాలా ఇష్టమని సహస్ర చెప్తుంది. ఇక విహారి కూడా తనకు ఇష్టం లేకుండా ఏ పని చేయడని అంటుంది. ఇక సహస్ర అత్తా బావలతో సెల్ఫీ తీసుకుంటుంది. తల్లీ కూతుళ్లకి అసలు పోలికే లేదని విహారి అంటుంది. ఇక కనకం ఫ్యామిలీ సీతారాముల కల్యాణం కోసం వచ్చాం అంటే కల్యాణం అయిపోయిందని పూజారి అంటాడు. ఇక కనకం అందరికీ హారతి ఇస్తుంది. అక్కడే ఉన్న విహారిని చూసి హారతి తీసుకెళ్తుంది. తాను పెళ్లి చేసుకోబోయే భర్త అనుకొని విహారిని ఏవండీ హారతి తీసుకోండని అంటుంది. ఇక విహారిని నేను మీకు నచ్చానా అని అడుగుతుంది. విహారి ఏంటి ఇలా అడిగిందని అనుకుంటాడు. విహారి ప్రకాశ్, కనకాలకు పెళ్లి అని అనుకుంటాడు. కనకాన్ని పొగుడుతాడు. అమెరికా గురించి టెన్షన్ పడొద్దని చెప్తాడు. 

ప్రకాశ్ తనలో తాను తనకు వేరే దారి లేదని అమెరికా వెళ్లడానికి నిన్ను అడ్డుపెట్టుకుంటున్నానని సారీ అని మనసులో విహారిని చూసి అనుకుంటాడు. మరోవైపు రాముల వారి కల్యాణం పెట్టిన చీరని తీసుకుందామని సహస్రని తీసుకొని పద్మజ వెళ్తే ఆ చీరని కనకం తీసుకుంటుంది. పద్మజ కోపంతో ఆ చీరని తన కూతురికి ఇవ్వకుండా ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చావని అంటుంది. పంతులు మీద కనకం మీద సీరియస్ అవుతుంది. కనకం ఆ చీరని ఇచ్చేస్తే పంతులు వద్దని అంటాడు. కనకం తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి సీతమ్మ చీర పంతులు ఇచ్చారని చెప్పి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక ప్రకాశ్ వచ్చి పెళ్లి ఏర్పాట్లు చూసుకోమని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్న కిడ్నాప్ విషయం తెలుసుకున్న మనీషా, దేవయాని.. మిత్రలా తల్లీకూతుళ్లతో మాట్లాడిన అర్జున్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Crime News: ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఏపీలో దారుణాలు - సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్య, శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget