Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ, విహారిల బంధం గురించి తెలుసుకున్న మదన్.. ఇంట్లో చెప్పేస్తాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి లక్ష్మీలకు పెళ్లి అయిందని మదన్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode మదన్ లక్ష్మీ చేతులు పట్టుకొని బతిమాలడం విహారి చూస్తాడు. విహారి వచ్చి మదన్ చేతులు విడిపించి ఏంట్రా చేస్తున్నావ్ రోడ్డు మీద ఇలాగే ప్రవర్తిస్తావా అని అడుగుతాడు. మదన్ సారీ చెప్తాడు. ఏం మాట్లాడకురా అని చెప్పి ఒక అమ్మాయిని ప్రేమించే వాడు ఇలా ప్రవర్తించడు అని చెప్పి లక్ష్మీని విహారి తీసుకెళ్లిపోతాడు. విహారి లక్ష్మీల మధ్య ఏదో జరుగుతుంది అని విహారి అనుకొని ఇద్దరినీ ఫాలో అవుతాడు..
విహారి: కనకం బాధ పడకు మదన్‌ని మన గురించి తెలీదు కదా.
లక్ష్మీ: మన సమస్యకి మదన్ ఒక్కరే కారణం కాదండీ నేను కారణమే. జరిగిపోయిన సమస్య నుంచి కాకుండా మనం ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచించాలి.
విహారి: మనం ఒడ్డున పడలేం కనకం. ఇది తీరని సమస్య ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటే ఎవరో ఒకరి అన్యాయం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉండాలి ఎందుకు అంటే ఈ సమస్యలో ఉన్నది నా వాళ్లే కదా.
లక్ష్మీ: ఈ సమస్యలో అందరూ బాగుండాలి అంటే నేను మీ నుంచి దూరంగా ఉండాలి. ఎక్కడో ఏదో పని చేసుకొని నేను బతికేస్తాను.
విహారి: కష్టమో నష్టమో ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నా మరి మధ్యలో నువ్వు ఇలా అంటే ఎలా.
లక్ష్మీ: మీరు ఈ బంధం వల్ల ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఇది నచ్చడం లేదు మీరు సంతోషంగా ఉండాలి అంటే నేను దూరంగా ఉండాలి.
విహారి: అయితే నీ మెడలో తాళికి అర్థం ఏంటి. ఇప్పుడే కదా నేను నిన్ను భార్యగా స్వీకరించాను నువ్వు వదిలేస్తే నేను ఏమైపోవాలి. నువ్వు వెళ్లిపోతే ఒక భర్తగా నేను చేతగాని వాడిని అయిపోతా. నువ్వు ఎప్పటికీ నా పక్కనే ఉండాలి.
లక్ష్మీ, విహారి మాట్లాడుకోవడం మదన్ చూడటం ఇద్దరూ చూసి షాక్ అయిపోతారు. మదన్ ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోతాడు. విహారి, లక్ష్మీలు వెనకాలే వెళ్తారు. మరోవైపు అంబిక ఆఫీస్‌కి కాల్ చేసి డబ్బు ఇవ్వమంటే లక్ష్మీ మేడం ఇవ్వొద్దని చెప్తారని అంటాడు. అంబిక తిట్టుకుంటుంది.. ఈరోజు తాడో పేడో తేల్చేస్తా అనుకుంటుంది. మదన్ సీరియస్‌గా ఇంటికి వస్తాడు. మీదకు వెళ్లి బ్యాగ్ తెచ్చుకుంటాడు.
సహస్రని మదన్ పిలుస్తాడు. అందరూ వస్తారు. మదన్ బ్యాగ్‌తో రావడం చూసి షాక్ అవుతారు. విహారి మాట్లాడబోతే మదన్ అపుతాడు. నేను యూఎస్ వెళ్లిపోతున్నానని చెప్తాడు. ఇప్పడేంటి సడెన్‌గా అని పద్మాక్షి అడుగుతుంది. యూఎస్‌లో తన బిజినెస్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని వెళ్లిపోతున్నా అని అంటాడు. విహారితో మాట్లాడాలి అని చెప్పడంతో విహారి మదన్‌ని చాటుగా తీసుకెళ్లి హగ్ చేసుకుంటాడు. థ్యాంక్స్ చెప్తాడు. అసలు ఏం చేస్తున్నావ్రా ఈ నిజం ఎన్ని రోజులు దాయగలవు అసలు లక్ష్మీని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని అడుగుతాడు. విహారి జరిగింది అంతా మదన్‌తో చెప్తాడు. మదన్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఒకరికి న్యాయం చేస్తే మరొకరు అన్యాయం అయిపోతారని అంటాడు.
సహస్ర మదన్‌తో నా పెళ్లి వరకు ఉండు అంటే రాలేనేమో అంటాడు. ఇక టైం అయిందని మదన్ బయల్దేరుతాడు. లక్ష్మీ వెళ్లి మదన్‌కి చేతులు జోడించి దండం పెడుతుంది. ప్రేమ ప్రేమ అని చాలా బాధ పెట్టాను కదా అని లక్ష్మీతో అంటాడు. నాకు చాలా కంగారుగా ఉందని అని మదన్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మాధవి కొడుకుని కిడ్నాప్ చేసిన రాజు.. సీఎం మీద మాధవి అత్యాచార నింద వేస్తుందా!





















