Jayammu Nischayammura Nani: నాని ఎంతమందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా? - జగ్గూ భాయ్ ఫన్ విత్ నేచరల్ స్టార్
Jagapathi Babu Talk Show: జగపతి బాబు 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో తాజాగా నేచరల్ స్టార్ నాని సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ కాగా తాజాగా వైరల్ అవుతోంది.

Nani Fun With Jagapathi Babu In Jayammu Nishcyammura Talk Show: సీనియర్ హీరో జగపతి బాబు ఓవైపు మూవీస్, మరోవైపు టాక్ షోస్‌తో అదరగొడుతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్లతో ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే కింగ్ నాగార్జున, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ షోలో పాల్గొని తమ కెరీర్, పర్సనల్ లైఫ్, బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో నేచరల్ స్టార్ నాని సందడి చేశారు.
నాని ఫన్ విత్ జగ్గూభాయ్
కాలర్ ఎగరేస్తూ ఎంట్రీతోనే నాని గూస్ బంప్స్ తెప్పించారు. 'మనం ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ కలిశాం గుర్తుందా నీకు?' అంటూ జగపతి బాబు ప్రశ్నించగా... 'మీకు గుర్తుందా?' అంటూ నాని ఎదురు ప్రశ్నించారు. 'దెబ్బతింది నేను కదా... నాకు గుర్తుంటుంది. నీకు గుర్తుండదు'... అంటూ జగ్గూ భాయ్ ఆన్సరిచ్చారు. దీంతో 'దెబ్బా...' అంటూ నాని షాక్ అవుతూనే నవ్వులు పూయించారు.
జగపతి బాబు సర్ ప్రైజ్
'నీ ఉద్దేశం ఏంటి నాని' అంటూ జగపతి బాబు ప్రశ్నించగా... 'నాకు ఈ ఐడియా లేదు మీరే పెట్టారు ఆ ఐడియా' అంటూ నాని ఫన్ చేశారు. ఇదే టైంలో జగ్గూభాయ్ నానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'నాని క్రష్, ఎంతమందికి ఐలవ్యూ చెప్పారు' అంటూ జగపతిబాబు ప్రశ్నించగా నవ్వులు పూశాయి. తన కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాలను నాని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో (Jayammu Nischayammura Nani Promo) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Unmatchable vibe. All gossip and drama from the most Natural HIT machine, the one and only @NameisNani
— ZEE5 Telugu (@ZEE5Telugu) August 25, 2025
Premieres Aug 29th @ 9 PM on ZEE5 Telugu
Also catch it on TV, Aug 31st @ 9 PM on Zee Telugu#JayammuNischayammuRaaWithJagapathi #ZEE5Telugu #ZEE5 #Nani pic.twitter.com/FmdbH7uAXB
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆద్యంతం ఆసక్తికరంగా ఫుల్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ ఎపిసోడ్ ఈ నెల 29 నుంచి ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 31న రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానల్లో ప్రీమియర్ కానుంది. ఇప్పటికే నాగార్జున, శ్రీలీల ఎపిసోడ్స్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఇక, సినిమాల విషయానికొస్తే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో మాస్ వారియర్‌గా నేచరల్ స్టార్ కనిపించబోతున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఈ మూవీని ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా... వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: సూపర్ హిట్ కాంబో - తలైవాతో 'కల్కి 2898 AD' డైరెక్టర్ మూవీ!... థియేటర్స్ దద్దరిల్లుతాయంతే
ట్రెండింగ్ వార్తలు























