అన్వేషించండి

Dindi - Chinchinada Bridge: ఈ 25, 26 తేదీల్లో దిండి - చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.. అధికారుల ప్రకటన

దిండి - చించినాడ వంతెన మరమ్మత్తుల నిమిత్తం ఈ నెల 25, 26 తేదీల్లో వంతెనపై ఎటువంటి రాక‌పోక‌లు చేయ‌కుండా రెండు రోజులుపాటు నిషేదం విధించారు..

West Godavari Latest News: దిండి చించినాడ వంతెన‌పై మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల నిమిత్తం వాహ‌నాల రాక‌పోక‌లు నిషేదం అమ‌లు విష‌యంలో వ‌ర‌ద‌లు ఆటంకంగా మారాయి.. వంతెన‌కు కొంత వ‌ర‌కు ప్ర‌త్యామ్నాయంగా ఉన్న స‌ఖినేటిప‌ల్లి - న‌ర్సాపురం రేవుపై పంటు దాటింపులు వ‌ర‌ద‌ల ఉద్ధృతి వ‌ల్ల నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు వాయిదా వేశారు.. అయితే వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మ‌ర‌ళా వంతెన మ‌ర‌మ్మ‌త్తులు పున‌ప్రారంభించేందుకు ప‌చ్చ‌జెండా ఊపారు.. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 25, 26 తేదీల్లో మొత్తం వంతెనపై ఎటువంటి రాక‌పోక‌లు చేయ‌కుండా రెండు రోజులుపాటు నిషేదం విధించారు.. ఈమేర‌కు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..

జిల్లా క‌లెక్ట‌ర్ ఏం చెప్పారంటే...

వశిష్ట నదిపాయ పై 216 జాతీయ రహదారిని కలుపుతూ నిర్మించిన దిండి - చించినాడ వంతెన  మరమ్మత్తు పనులు నిర్దేశిత గడువులో పూర్తికాని దృష్ట్యా  మరో రెండు రోజులపాటు వంతెన పై పూర్తిగా రాకపోకలను నిలుపుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చించినాడ వంతెన  వద్ద మరమ్మతు పనులు బేరింగ్ రీప్లేస్‌మెంట్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ నియంత్రణ కొరకు  ఈనెల 25, 26 వ తేదీలలో వరుసగా రెండు  రోజులు ఉదయం 10 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు పూర్తిగా రాకపోకలు నిలుపుదల సమయం పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపధ్యంలో దిండి చించినాడ 216 జాతీయ రహదారి వెంబడి పర్య టించే వాహనదారులు  ఈ విషయాన్ని గమనించి పూర్తిగా సహకరిస్తూ ఈ రెండు రోజులపాటు ఈ వంతెన పై రాకపోకలు పూర్తిగా నిషేధించినందున ప్రత్యా మ్నాయమార్గాల ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

కీల‌క మార్గంలో ఆటంకాలు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు రావాల‌న్నా పోవాల‌న్నా వ‌శిష్ట న‌దిపై ఉన్న దిండి చించినాడ వంత‌న అత్యంత కీల‌కం.. ఈ వంతెన మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురికావ‌డంతో ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు అయితే ప‌డుతున్నారు. గోదావ‌రికి వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో ఈ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మారింది. స‌ఖినేటిప‌ల్లి, న‌ర్సాపురం రేవు ద్వారా చాలా మంది అటు ఇటూ రాక‌పోక‌లు సాగించే ప‌రిస్థితి ఉండ‌గా వ‌ర‌ద‌ల వ‌ల్ల  ఈరేవు మూసివేశారు అధికారులు. దీంతో రావుల‌పాలె నుంచి చుట్టు తిరిగి వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో గంట ప్ర‌యాణం కాస్త రెండు నుంచి మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. అంతే కాదు ప్ర‌యాణ ఖ‌ర్చుల భారం కూడా తడిసి మోపెడ‌వుతోంది.
 
అధికారులు ప్ర‌క‌టించిన రెండు రోజుల వ్య‌వ‌ధిలో అయినా వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు వేగంగా పూర్తిచేసి క‌నీసం లైట్ మోటార్ వెహికల్స్‌, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను వెళ్ల‌నిచ్చేలా అవ‌కాశం క‌ల్పించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ముఖ్యంగా రోజూ ఈ వంతెన‌పై ప్ర‌యాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు..

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget