Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ మీద అటాక్.. సుభాష్‌ని చితక్కొట్టిన విహారి.. అంబిక దొరికిపోతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సుభాష్ లక్ష్మీని చంపాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక చెప్పినా వినకుండా సుభాస్ లక్ష్మీని చంపాలి అనుకుంటాడు. ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్తాడు. యమున హాల్‌లో ఉండటం చూసి దాక్కొని యమున గదిలోకి వెళ్లిన తర్వాత మేడ మీద ఉన్న లక్ష్మీ గదిలోకి వెళ్తాడు. లక్ష్మీ నోరు నొక్కేసి చాకుతో పొడవడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు విహారి లక్ష్మీ గురించి ఆలోచించి లక్ష్మీ గది వరకు వస్తాడు.
లక్ష్మీని ఇబ్బంది పెట్టొద్దులే అని వెళ్లిపోబోతాడు. ఇంతలో లక్ష్మీ కాళ్ల పట్టీల సౌండ్ చేస్తుంది. అది విన్న విహారి గదిలోకి వెళ్తాడు. విహారి రావడం చూసిన సుభాస్ లైట్ ఆపేస్తాడు. దాంతో లక్ష్మీ పూల కుండీ తన్నేస్తుంది. అనుమానం వచ్చి విహారి లోపలికి వెళ్తే ముసుగులో ఉన్న సుభాష్ లక్ష్మీని చంపడానికి ప్రయత్నించడం చూసి షాక్ అవుతాడు. సుభాష్ పారిపోతే పట్టుకొని కొడతాడు. హాల్‌లోకి అందరూ చేరుకుంటారు. సుభాష్‌ని లక్ష్మీ, విహారి, అంబికలతో పాటు అంతా షాక్ అవుతారు. నువ్వా అని విహారి ఇంకో నాలుగు తగిలిస్తాడు. వీడు మన లక్ష్మీని చంపబోయాడని చెప్తాడు.
అంబిక కూడా సుభాష్‌ని తిడుతుంది. జైలు నుంచి బయటకు ఎలా వచ్చావ్‌రా అని విహారి అడుగుతాడు. పద్మాక్షి పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది. విహారి వెళ్లి పోలీసులకు ఫోన్ చేస్తాడు. తర్వాత సుభాష్‌ని కొడతాడు. సుభాష్ విహారిని తోసేసి పారిపోతాడు. అంబిక చాలా టెన్షన్ పడుతుంది. విహారి అంబిక దగ్గరకు వెళ్లి సుభాష్ ఎలా బయటకు వచ్చాడని అడుగుతాడు. నాకు ఎలా తెలుస్తుందని అంబిక అంటుంది. మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. వాడు అలా చేసే సరికి కోపంలో మిమల్ని అడిగేశాను అని అంటాడు. ఇక అంబిక లక్ష్మీకి అలెర్ట్‌గా ఉండమని చెప్పు అంటుంది. సుభాష్‌కి యావజ్జీవ శిక్ష వేయించమని చెప్తుంది.
లక్ష్మీ తన మీద జరిగిన దాడిని తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. విహారి కూడా లక్ష్మీ గురించి ఆలోచిస్తాడు. లక్ష్మీ భయపడి ఉంటుందని లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. సహస్ర వెనకాలే ఫాలో అయ చూస్తుంది. లక్ష్మీ ఏడుస్తుంటే విహారి పిలవగానే లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. విహారి లక్ష్మీని కూర్చొపెట్టి నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తాడు. లక్ష్మీకి గోరు ముద్దలు తినిపిస్తాడు. అది చూసిన సహస్ర కోపంతో ఊగిపోతుంది. నీ భయం కంటిన్యూ చేసేలా చేస్తాను అనుకుంటుంది. విహారి లక్ష్మీకి తినిపించి బెడ్ మీదకు తీసుకెళ్లి పడుకోపెడతాడు. నిన్ను నేను కాపాడుకుంటాను లక్ష్మీ అని అంటాడు. విహారి లక్ష్మీ గది నుంచి బయటకు వస్తే సహస్ర వెళ్లి నువ్వేంటి బావ లక్ష్మీ గది నుంచి వస్తున్నావ్ అని అడుగుతుంది. లక్ష్మీ చాలా భయపడుతుందని అంటాడు.
లక్ష్మీ వేకువజామున నాలుగుకి లేచి చల్లని నీటితో స్నానం చేసి విహారి కోసం పూజ ప్రారంభిస్తుంది. తులసి కోట దగ్గర దీపం పెట్టి సుమంగళి వ్రతం నిష్టగా చేసి రేపు తెల్లారి ఇదే టైంకి పూర్తి చేసుకుంటానని అనుకుంటుంది. ఉదయం పసుపు రంగు చీర కట్టుకొని తులసి కోటకి పూజ చేస్తుంది. అది విహారి చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర




















