Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ చేస్తున్న క్షుద్రపూజలేంటి? విహారి, లక్ష్మీల రొమాన్స్ చూసేసిన సహస్ర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ, విహారిలు అమ్మవారి గుడికి వెళ్లి క్లోజ్‌గా ఉండటం సహస్ర చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర విహారి, లక్ష్మీల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర దగ్గరకు వచ్చి నువ్వు షాపింగ్‌కి వెళ్లు అని అంబిక తోడు వస్తుందని అంటుంది. దాంతో సహస్ర బావని తీసుకొని వెళ్తానని అంటుంది. ఇక లక్ష్మీ బయటకు బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే విహారి ఎక్కడికి అని అడుగుతాడు. గుడికి వెళ్తున్నానని లక్ష్మీ చెప్పడంతో నేను వస్తానని విహారి అంటాడు. అది సహస్ర చూసి షాక్ అవుతుంది.
సుభాష్‌కి బెయిల్..
విహారి లక్ష్మీని తీసుకొని కారులో వెళ్తాడు. సహస్ర కంగారుగా బయటకు వచ్చి బావ వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి సమయానికి కారు కూడా లేదు అని ఏం చేయాలా అని అనుకుంటుంది. మరోవైపు సుభాష్‌కి బెయిల్ వస్తుంది. సుభాష్ అంబికకు కాల్ చేసి తనకు ఈ గతి తీసుకొచ్చిన లక్ష్మీని వదలను అని అంటాడు. దానికి అంబిక వాడి సంగతి తర్వాత చూద్దాం అని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్తుంది. ఫొటో సుభాష్‌కి పంపిస్తుంది. నేను చూసుకుంటా అని సుభాస్ చెప్తాడు.
ఇక నీతో ఆడుకుంటా అంబిక..
సుభాష్ తనతో తాను అంబిక ఎవరికీ తెలీని రహస్యం నాకు చెప్పావ్ ఇక నీతో ఎలా ఆడుకుంటానో ఎలా దెబ్బ తీస్తానో చూసుకో అని అనుకుంటాడు. మరోవైపు విహారి, లక్ష్మీలు పొలంలో ఉన్న గుడికి వెళ్తారు. వెనకాలే సహస్ర ఫాలో అవుతుంది. దారిలో బురద ఉంటుంది. విహారి లక్ష్మీని తాను తీసుకెళ్తా అంటాడు.
సహస్ర ముందే విహారి, లక్ష్మీల రొమాన్స్..
విహారి లక్ష్మీని తన కాల మీద నిల్చొపెట్టుకొని అడుగులో అడుగు వేస్తూ లక్ష్మీని తీసుకెళ్తాడు. అది చూసి సహస్ర చాలా ఫీలవుతుంది. తర్వాత అక్కడే నీరు చూసిన లక్ష్మీ విహారి కాలు కడుగుతుంది. బావ నిన్ను ఎంత కాలు కదపకుండా చూసుకున్నా చివరకు బావ నా మెడలో తాళి కట్టాల్సిందే అని అనుకుంటుంది. ఇద్దరినీ ఫాలో అవుతుంది.
ఏడు వారాల నగలు నీ కూతురికి..
ఇంట్లో అందరూ షాపింగ్ చేస్తుంటారు. అందరూ చీరలు తీసుకుంటారు. వసుధ తీసుకోకపోవడంతో ఏమైందని అక్క, చెల్లి అడుగుతారు. ఇక కాదాంబరి ఏడు వారాల నగలు తీసుకొచ్చి పద్మాక్షి దగ్గర పెడుతుంది. నీకు ఇవ్వాల్సినవి కొందరి వల్ల ఇవ్వలేకపోయాను. రెండో దానికి ఇవ్వాల్సింది ఇచ్చాను. ఇక అంబికకు చేయించాను అది మాత్రం కుటుంబం, వ్యాపారం అని తిరుగుతుంది. ఇక నీకు ఇవ్వలేకపోయా నీ కూతురికి ఇవ్వాలని తీసుకొచ్చా అంటుంది.
సోదమ్మ ఏం చెప్పింది..
లక్ష్మీ, విహారి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తారు. విహారి లక్ష్మీ నుదిటి కుంకుమ పెడతాడు. చేతికి గాజులు వేస్తాడు. జడలో పూలు పెడతాడు. అదంతా చూసి సహస్ర ఏడుస్తుంది. ఇద్దరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు. సహస్ర హర్ట్ అయివెళ్లిపోతుంది. ఇక ఇద్దరికీ సోదమ్మ ఎదురవుతుంది. మీ సమస్యకి సోది చెప్తానని మీ సమస్యలు తీరి నీ భర్త సంతోషంగా ఉండాలి అంటే ఐదుగురు ముత్తయిదువులు దగ్గరకు వెళ్లి జోల పట్టి ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టు ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వు నీకు నీ భర్తకి మంచి జరుగుతుందని అంటుంది.
ఆ లక్ష్మీ పెళ్లి ఆపేస్తుంది..
సహస్ర చిరాకుగా స్కూటీపై ఇంటికి రావడం అంబిక చూస్తుంది. చిరాకుగా లోపలకి వెళ్లి తాళం విసిరేస్తుంది. ఏమైందని పద్మాక్షి అడుగుతుంది. అంబిక ఏమైందని అడుగుతుంది. లక్ష్మీ గుడి దగ్గర పూజలు చేస్తుంది అని అంటుంది. లక్ష్మీ సహస్ర, విహారిల పెళ్లి జరగకూడదు అని క్షుద్రపూజలు చేయిస్తుందని అంబిక చెప్తుంది. లక్ష్మీకి సహస్ర, విహారిల పెళ్లి జరగడం ఇష్టం లేదని ఆపేస్తుందని అంటుంది. ఎవరూ ఆ మాట అనొద్దు అని పద్మాక్షి అంటుంది. లక్ష్మీ సంగతి నేను చూసుకుంటానని పద్మాక్షి చెప్తుంది. బావతో నా పెళ్లి జరిగితీరుతుందని సహస్ర అంటుంది. దీంతోఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















