Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పార్టీలో లక్ష్మీ డ్రస్ చింపేసిన సహస్ర.. లక్ష్మీ ఇంట్లో డిటెక్టివ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ విహారితో పాటు పార్టీకి వెళ్లడం మోడ్రన్ డ్రస్ లక్ష్మీ వేసుకుంటానని అనడంతో సహస్ర ఆ డ్రస్ చింపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రకు డిటెక్టివ్ కాల్ చేస్తుంది. లక్ష్మీ ఊరు అయిన రాజమండ్రి వచ్చానని అంటుంది. సహస్ర డిటెక్టివ్‌తో చేనేత వస్త్రాల ఫేమస్ అయిన ఆదికేశవ్ గురించి చెప్పి అక్కడ అడిగి తెలుసుకోమని చెప్తుంది. లక్ష్మీ గురించి కనుక్కొని కాల్ చేస్తానని డిటెక్టివ్ చెప్తుంది. సహస్ర మనసులో లక్ష్మీ నీ గతం తెలిస్తే నీ భవిష్యత్ ఏంటో నేను చెప్తా అనుకుంటుంది.
అంబిక సహస్ర దగ్గరకు వచ్చి నీకో బ్యాడ్ న్యూస్ అని చెప్తుంది. ఏంటి పిన్ని అని సహస్ర అడిగితే విహారి ప్రాజెక్ట్ ఓకే అయినందుకు ఓ పార్టీ ఇస్తున్నాడని దానికి లక్ష్మీ కూడా వస్తుందని అంటుంది. పార్టీకి లక్ష్మీ రాకూడదని సహస్ర అంటే లక్ష్మీని నువ్వు ఆపగలవా అంటుంది. బావకి నేను చెప్పి నేను బావతో వస్తాను అని సహస్ర విహారి దగ్గరకు వెళ్తుంది. విహారి బ్యాగ్ సర్దుకొని పార్టీకి బయల్దేరుతాడు. సహస్ర ఎదురెళ్లి ఎక్కడికి అని అడుగుతుంది. ఆఫీస్ పార్టీ అని చెప్తాడు. నేను వస్తాను అంటుంది. అంబిక తీసుకెళ్లమని అనడంతో విహారి సరే అంటాడు.
విహారి లక్ష్మీని పిలుస్తాడు. తను వద్దు అని సహస్ర అంటే తను ప్రాజెక్ట్ లీడ్ తను లేకుండా ఎలా అని అంటాడు. ఇంతలో యమున లక్ష్మీని తీసుకొని రావడంతో లక్ష్మీ పద వెళ్దామని అంటారు. యమున వెళ్లమని అంటుంది. మాతో రా అని విహారి పిలుస్తాడు. సహస్ర లక్ష్మీని కోపంతో బతిమాలించుకోవద్దని రమ్మని అంటుంది. అంబిక పక్కన లక్ష్మీ కూర్చొంటే పని చేసుకునేది నా పక్కన కూర్చొనే స్థాయికి వచ్చిందని అనుకుంటుంది.
సహస్ర కారులో లక్ష్మీతో నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి అని అడుగుతుంది. లక్ష్మీ దిక్కులు చూస్తుంది. విహారి సహస్రతో తను ఇబ్బంది పడుతుంది కదా ఎందుకు అడగటం అంటాడు. ఎక్కడ ఉన్నావో చెప్పడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటుంది అంబిక. ఇక లక్ష్మీ అనాథని కదా అమ్మ ఎక్కడ పడితే అక్కడ హాస్టల్‌లో ఉండేదాన్ని అని చెప్తుంది. ఏ అనాథ ఆశ్రమంలో ఉండేదానివి అని అడిగితే అది ఇప్పుడు పడగొట్టేశారు అని లక్ష్మీ చెప్తుంది. దాని పేరు చెప్పు అని అంటుంది. కస్తూరిబా అనాథాశ్రమం అంటుంది. నీ స్కూలింగ్ ఎక్కడ అయిందని అడుగుతుంది. చాలా ఊర్లు తిరిగి చదువుకున్నా అని లక్ష్మీ చెప్తుంది. విహారి సహస్రి కామ్‌గా ఉండమని అంటాడు. లక్ష్మీ చెప్పిన వివరాలు డిటెక్టివ్ సూర్యాకాంతానికి చెప్పాలి అనుకుంటుంది సహస్ర.
పద్మాక్షి డల్‌గా ఉంటే కాదాంబరి అక్కడికి వెళ్తుంది. పద్మాక్షి యమున పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించలేదని అంటుంది. ఇంతలో యమున మందులు తీసుకొని కాదాంబరికి ఇవ్వడంతో కాదాంబరి వాటిని విసిరేసి నేను ఎందుకు బతకాలి అని అంటుంది. విహారి, సహస్రల పెళ్లి చేద్దాం అత్తయ్య అని యమున అంటే మేం చచ్చిపోతే చేస్తావా అని పద్మాక్షి అడుగుతుంది. విహారి మాట ఇచ్చినట్లే పెళ్లి చేస్తానని యమున అంటుంది. వెంటనే ముహూర్తాలు పెట్టిస్తానని అంటుంది.
రాత్రి విహారి వాళ్లు పార్టీకి చేరుకుంటారు. అందరూ విహారిని విష్ చేస్తారు. అందరిని పార్టీ ఎంజాయ్ చేయమని విహారి చెప్తాడు. పార్టీకి స్పెషల్ డ్రస్ తీసుకొచ్చి ఇస్తారు. విహారి లక్ష్మీతో నీకు కంఫర్ట్ ఉంటేనే ఇలాంటి డ్రస్ వేసుకో లేకపోతే లేదు అంటాడు. వేసుకుంటానని లక్ష్మీ చెప్తుంది. లక్ష్మీ బట్టలు తీసుకొని వెళ్తే సహస్ర వెనకాలే వెళ్లి ఈ డ్రస్ వేసుకొని అక్కడికి వచ్చి వేసుకుంటావా అందరి ముందు ఫోజులు కొడతావా. బావ వద్దన్నా వేసుకుంటా అని ఓవర్ చేస్తావా అని తిట్టి ఆ డ్రస్ సహస్ర చింపేస్తుంది. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. డిటెక్టివ్ లక్ష్మీ ఫొటో చూపించి వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా ఆదికేశవ్ ఇంటికి వెళ్లినప్పుడు ఫోన్ నీటిలో పడిపోతుంది. ఫోన్ బియ్యం డబ్బాలో పెట్టమని సూర్యకాంతం గౌరికి చెప్తుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















