Ennallo Vechina Hrudayam Serial Today April 16th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!
Ennallo Vechina Hrudayam Today Episode గిరి స్వామీజీలా మారిపోవడం రత్నమాలకు పక్షవాతం రావడం త్రిపుర ఫ్యామిలీ చూడటానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గిరి స్వామీజీలా మారిపోయి తాము చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగిందని తన తల్లికి పక్షవాతం వచ్చిందని చెప్తాడు. త్రిపుర షాక్ అయిపోతుంది. రత్రమాల కదల్లేక ఉన్న వీడియో త్రిపురకి చూపిస్తాడు. తనకు యాక్సిడెంట్ అవ్వడంతో చావు అంచుల వరకు వెళ్లి రావడంతో పూర్తిగా మారిపోయానని నేను అన్యాయం చేసిన వాళ్లందరికీ న్యాయం చేశానని ఇప్పుడు నీకు చేయాలని నీ కోసం వెతుకుతూ ఉన్నానని చెప్తాడు.
గిరి: అమ్మ మిమల్ని చూడాలని పరితపిస్తుంది. కానీ మేం చేసిన పాపాలకు ఎట్టా మీరు వస్తారు ఏ ముఖం పెట్టుకొని పిలుస్తాను. త్రిపుర ఇది నాటకం కాదు నిజం. అమ్మ చావుతో నాటకం ఆడే అంత దుర్మార్గుడిని కాదు. కావాలంటే మీ నుంచి లాక్కున్న ఇళ్లు అన్నీ ఇచ్చేస్తాను కానీ నాకు ఓ చిన్న సాయం చేస్తావా ఒకే ఒక్క సారి మా అమ్మని చూడటానికి వస్తావా. నిన్ను చూస్తేనైనా మా అమ్మ కోలుకొని బతుకుతుందేమో అని చిన్న ఆశతో అడుగుతున్నాను. నా కోసం ఈ భూమ్మీద బతికుంది మా అమ్మ మాత్రమే తనని రక్షించుకోవాలని అడుగుతున్నాను. మా అమ్మ దూరం అయితే నేను బతకలేను త్రిపుర. సరే నిన్ను బలవంతం చేయను కానీ నిన్న చూసిన తర్వాత అన్నీ గుర్తొచ్చి చేప్పేశా తిప్పు. నువ్వు గాయత్రీ తాతయ్య ఏడున్నా బాగుండాలి. నీకు క్షమాపణ చెప్పాను కదా నేను మా అమ్మ దగ్గరికి పోయి సేవలు చేసుకుంటా.
త్రిపుర: బావ ఒక్క నిమిషం ఆగు అత్తయ్యని చూడటానికి నేను వస్తాను.
గిరి: నిజంగా నువ్వు దేవత త్రిపుర. నేను ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ పట్టించుకోకుండా మా అమ్మని చూడటానికి వస్తాను అన్నావ్ నీ రుణం తీర్చుకోలేను త్రిపుర.
త్రిపుర: అవన్నీ సరే ముందు ఊరు వెళ్తాం పద.
త్రిపుర వెళ్లే సరికి రత్నమాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మంచి నీరు తీసుకోవడానికి ప్రయత్నించి మంచం మీద నుంచి పడిపోబోతే త్రిపుర ఆపుతుంది. మంచి నీరు తాగిస్తుంది. త్రిపురని పట్టుకొని ఏడుస్తుంది. సైగలు చేయడంతో గిరి తాతయ్యని రమాప్రభ అత్తని ఊర్వశిని చూడాలని ఉందని ఏడుస్తుందని అంటాడు. రత్రమాల త్రిపుర కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. త్రిపుర వెంటనే తన తాతయ్యకి కాల్ చేసి జరిగింది అంతా చెప్తుంది. పెద్దాయన షాక్ అయిపోతారు. వెంటనే బయల్దేరమని త్రిపుర చెప్తుంది.
బాల త్రిపుర కోసం 30 లక్షలు సర్దుబాటు చేయాలి అనుకుంటాడు. యశోద గాయత్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. యశోద గాయత్రీకి నగలు చూపిస్తూ అన్నీ బాలకి కాబోయే భార్యకి చేయించినవి అని చెప్తుంది. ఆ నగలు చూసిన బాల వాటిని పట్టుకొని అవి ఎంత ఉంటాయి అని అడుగుతాడు. ఇప్పుడు వీటి రేట్ ఎందుకు బావగారు అని గాయత్రీ అడుగుతుంది. చెప్తా కానీ మొత్తం రేటు ఎంత అని అడుగుతాడు. 18 లక్షలు ఉంటాయి అని యశోద అంటుంది. దాంతో బాల 30 లక్షలు ఉండవా అని అంటాడు. గాయత్రీ యశోద ఇద్దరూ షాక్ అవుతారు. ఎందుకు అంత అని అడిగితే సీక్రెట్ అని అంటాడు.
రమాప్రభ, ఊర్వశి, తాతయ్య గిరి ఇంటికి వెళ్తారు. ముగ్గురు రత్నమాలని చూసి షాక్ అవుతారు. పెద్దాయన కూతురిని చూసి ఏడిస్తే రత్నమాల వాళ్లకి సైగలు చేసి ఏడుస్తుంది. గుండె బాదుకొని ఏడుస్తుంది. త్రిపుర ఓదార్చుతుంది. మీకు చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగిందని అంటుందని గిరి చెప్తాడు. మన కుటుంబానికి ఇలా అయిందేంటి వదిన ఇక్కడ మీకు ఇలా అయింది అక్కడ గంగ అక్కకి రెండు రోజుల్లో ఫైన్ కట్టకపోతే ఉరి తీస్తారని చెప్తుంది. దాంతో రత్నామాల ఏడుస్తూ బ్యాగ్ తీసుకురమ్మని గిరికి సైగ చేస్తుంది. గిరి డబ్బుల బ్యాగ్ తీసుకొచ్చి తాతయ్యకి ఇస్తాడు. వెంటనే ఈ డబ్బు కట్టి అత్తయ్యని విడిపించుకు తీసుకురమ్మని చెప్తాడు. డబ్బు తీసుకోకపోతే ఒట్టు అన్నట్లు రత్నమాల తన మీద త్రిపుర చేయి పెట్టుకొని తీసుకోమని చెప్తుంది. ఇవి సరిపోకోతే ఇంక ఎంత కావాలి అన్నా ఇస్తానని గిరి అంటాడు. నా ఆస్తి మొత్తం త్రిపురకు రాస్తానని అమ్మ అంటుందని గిరి చెప్తాడు. త్రిపుర తీసుకొని ఆ డబ్బుని లాయర్‌కి ఇవ్వమని చెప్తుంది. పెద్దాయన డబ్బు తీసుకొని వెళ్తారు.
వదిన మారిపోయింది గిరి కూడా మారిపోయాడు త్రిపురకు ఇచ్చి పెళ్లి చేద్దామని రమాప్రభ అంటుంది. ఇప్పుడు ఆ మాటలు వద్దని త్రిపురకు ఇష్టం లేకుండా పెళ్లి అనే మాటే ఎత్తొదని గిరి అంటాడు. రత్నమాల సైగ చేయడంతో ఏంటని పెద్దాయన అడుగుతారు. గిరి వద్దని అంటాడు. పెద్దాయన చెప్పమని అడగటంతో అమ్మ రోజుల మనిషిని నాకు త్రిపురకి పెళ్లి చేస్తే చూసి కన్ను మూస్తానని ఆస్తి మొత్తం త్రిపుర పేరు మీద రాస్తానని అమ్మలా నన్ను త్రిపుర మాత్రమే చూసుకోగలదని చెప్తుందని అంటాడు. గిరి తాతయ్యని పట్టుకొని ఏడుస్తూ ఇదే మా అమ్మ చివరి కోరిక అంట అని ఏడుస్తాడు. తాతగారు త్రిపురతో నీ నిర్ణయం ఏమైనా గౌరవిస్తాను. గిరి మారిపోయాడు మీ అత్త పక్షవాతంతో ఉంది నిర్ణయం ఏదైనా నీ ఇష్టమే అంటారు. రమాప్రభ కూడా త్రిపురతో అమ్మ త్రిపుర మీ అమ్మ అయినా అదే చెప్తుంది నేను మీ అమ్మ స్థానంలో ఉండి చెప్తున్నా గిరిని పెళ్లి చేసుకో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















