Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్రని పెళ్లి చేసుకుంటానని తల్లి మీద ఒట్టేసిన విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్రని పెళ్లి చేసుకుంటానని విహారి యమున మీద ఒట్టేసి మాట ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర యమునతో మేం వచ్చి చాలా రోజులు అయింది అత్తయ్యా మా అమ్మకి బావ ఇచ్చిన మాట గురించి మా అమ్మ అడుగుతుంది. మేం వచ్చి చాలా నెలలు అయింది ఇంకా నాకు బావకి పెళ్లి అవ్వడం లేదని అంటుంది. విహారి సహస్రని ఆపితే దానికి పద్మాక్షి దాన్ని ఆపుతావేంటి విహారి నువ్వు మీ అమ్మ మాకు ఇచ్చిన మాట గురించి చెప్పు అంటుంది.
అంబిక: అవును విహారి అక్క, సహస్ర నీ మీద ఆశలు పెట్టుకొని ఇక్కడ ఉన్నారు నీకు మీ అమ్మకి మరో ఆలోచనలు ఏం లేవు కదా.
యమున: అలా మాట్లాడుతావేంటి అంబిక మాకు మరో ప్లాన్ ఏం ఉంటుంది.
విహారి: అత్తయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి.
లక్ష్మీ: మనసులో విహారి గారు నిజం చెప్పాలి అనుకుంటున్నారా.
సహస్ర: బావ నువ్వేం చెప్పకు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం అని మాకు తెలుసు.
విహారి: అదంతా కాదు అత్తయ్య నేను మీతో వేరే విషయం గురించి మాట్లాడాలి నేనే మీతో ఒక నిజం చెప్పాలి.
యమున: విహారి నువ్వు చెప్పే నిజం మాకు తెలుసు పెళ్లి గురించి నీ స్టాండ్ గురించే కదా. ఈ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని మాకు ఉంది.
పద్మాక్షి: అలా అంటే సరిపోతుందా ఎప్పుడూ లక్ష్మీ లక్ష్మీ అని ఆ పని మనిషి మీదే నీ ధ్యాస ఉంది తప్ప నా కూతురి గురించి ఆలోచించావా.
అంబిక: ఆలస్యం అయ్యే కొద్ది వేరే వేరు ఆలోచనలు వస్తాయి.
సహస్ర: అలాంటి ఆలోచనలు వస్తే నా నిర్ణయం ఏంటో బావకి బాగా తెలుసు.
యమున: నీ విషయం మా నిర్ణయం ఎన్నటికీ మారదు సహస్ర.
విహారి: ప్లీజ్ నేను చెప్పేది వింటారా.
సహస్ర: బావ ఆగు అత్తయ్య మా అమ్మ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు తర్వాత మనం మాట్లాడుకుందాం.
పద్మాక్షి: నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావ్ విహారి. నువ్వు మాకు ఇచ్చిన మాట గుర్తుంది. వెంటనే పెళ్లి జరగాలి లేదంటే మేం నా దారి చూసుకొని వెళ్లిపోతాం.
సహస్ర: అమ్మ నువ్వు నీ దారి చూసుకుంటావ్ కానీ బావ కానీ అత్తయ్య కానీ ఈ పెళ్లి జరగదు అంటే నాకు చావే గతి.
యమున: నాకు విహారికి సహస్రకి పెళ్లి చేయాలి అని ఉంది.
విహారి: మీరు తొందర పడకుండా నా మాట వినండి.
పద్మాక్షి: రెండు సార్లు పెళ్లి పీటల మీద ఆగిపోయింది తొందరపడకుండా ఎలా ఉంటాను. పెళ్లి చేసుకోకపోతే చస్తాను అంటుంది.
పెళ్లి ఇప్పుడే వద్దని 6, 7 నెలల టైం కావాలని విహారి అంటారు. అందరూ షాక్ అవుతారు. అంత టైం ఎందుకు మీరు మళ్లీ కొత్త నాటకం చేస్తారా అంటుంది. విహారితో నీకు నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పమని పద్మాక్షి నిలదీస్తుంది. విహారి మౌనంగా ఉండటంతో నాకు అర్థమైంది అని ఇక్కడ ఇంకొక్క నిమిషం ఉండాల్సిన అవసరం లేదని సహస్ర లాక్కొని పద్మాక్షి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. యమున ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో పద్మాక్షి తల్లిదండ్రులు తీర్థయాత్రల నుంచి వస్తారు. పద్మాక్షిని ఆపుతారు. విషయం మొత్తం వాళ్లకి చెప్తారు. కాదాంబరి విహారి దగ్గరకు వెళ్లి సహస్రని వారంలో పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని అంటుంది. నానమ్మ మాటకి విహారి షాక్ అయిపోతాడు. ఒట్టు వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది. వాళ్లందరికీ మన మీద నమ్మకం వస్తుందని అంటుంది. మీ అమ్మకి ఈ ఇంట్లో గౌరవం ఉండాలి అంటే వారంలో సహస్రని పెళ్లి చేసుకుంటానని చెప్పమని అంటుంది. యమున చెప్పమని విహారితో చెప్తుంది. దాంతో విహారి తల్లి తల మీద చేయి వేసి ఒట్టు వేస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. కాదాంబరి వెంటనే ముహూర్తాలు పెట్టించమని అంటుంది.
లక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లక్ష్మీ దగ్గరకు పండు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. విహారి బాబు మాట ఇచ్చేశాడు కదా నీ జీవితం ఏమైపోతుందని అడుగు అమ్మా అని అంటాడు. నేను వెళ్లి అడిగితే యమునమ్మ గారి మీద ఒట్టేశారు ఈ పెళ్లి చేసుకోకపోతే సహస్రమ్మ చనిపోతా అంటుంది.. నేను ఎలా అడగను అని లక్ష్మీ అంటుంది. ఇక్కడ సమస్య రావడం విహారి గారు నా మెడలో తాళి కట్టడం సమస్య అని అంటుంది. ఇంతలో విహారి అక్కడికి వస్తాడు. ఈ రోజుతో మన సమస్యకి పరిష్కారం వస్తుందని అనుకున్నా కానీ మరో కొత్త సమస్య వచ్చిందని విహారి అంటాడు. విహారి కన్నీరు పెట్టుకుంటాడు. మీరు యమునమ్మ మీద ఒట్టు వేసినా లేకపోయినా సహస్రమ్మని పెళ్లి చేసుకోవాలి అంటుంది. మీరు లేకపోతే సహస్రమ్మ చనిపోతుందని అంటుంది. నా కోసం ఇంత మందిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది. పండు విహారితో నా మనసు మీరు లక్ష్మీమ్మకి న్యాయం చేయాలి అని చెప్తుంది కానీ లక్ష్మీమ్మకి న్యాయం చేస్తే కుటుంబం ఏమైపోతుందో అని దిగులుగా ఉందని అంటాడు. విహారి ఫ్యామిలీ గురించి ఆలోచించి బాధ పడతాడు. విహారి కుప్పకూలి ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















