Janaki Kalaganaledu February 1st: గోవిందరాజులు నడిచేలా చేసిన జానకి, రామా- సంతోషంలో జ్ఞానంబ
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం అప్పుల పాలు అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి తన స్నేహితురాలు చెప్పిన విషయం రామాకి చెప్పాలని అనుకుంటుంది. అఖిల్ కి ఏదైనా ఉద్యోగం చూడమని జెస్సీ తన తండ్రికి చెప్తుంది. అది విని అఖిల్ కోపంతో రగిలిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ పరువు తీయాలని ఫిక్స్ అయ్యారా? మీ అల్లుడు ఖాళీగా ఉన్నాడని చెప్పి పరువు తీస్తున్నవా అని తిడతాడు. అలా అనుకున్నప్పుడు నువ్వే వెళ్ళి జాబ్ చూసుకో, కష్టపడి పని చేయాలని అనుకోనప్పుడు పౌరుషం పనికిరాదని అంటుంది. మీరందరూ నన్ను పనికిరాని వాడినని అంటున్నారా నేనెంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళతాడు. ఊరికి డాక్టర్ వచ్చారంట మావయ్యని ఆయనకి చూపిస్తే త్వరగా తగ్గిపోతుందని చెప్తుంది. ఆ డాక్టర్ పుణ్యమా అని నాన్న మామూలు మనిషి అయితే మంచిదే కదా అని రామా కూడా సంతోషిస్తాడు.
Also Read: మనసు భారమైన వేళ జ్ఞాపకాలు బరువయ్యాయి- రిషిధారని కలిపిన కాగితపు పడవలు
రామా, జానకి గోవిందరాజులని తీసుకుని హాస్పిటల్ కి వస్తారు. డాక్టర్ గోవిందరాజుల్ని పరిశీలిస్తాడు. రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేస్తూ మెడిసిన్ వాడితే ఎప్పటిలాగా మామూలు మనిషి అవుతాడని డాక్టర్ చెప్తాడు. అది విని జ్ఞానంబ సంతోషిస్తుంది. డబ్బులు ఎక్కడివని గోవిందరాజులు అడుగుతాడు. సంపాదిస్తున్న కదా మీరేమి ఆలోచించొద్దని రామా ధైర్యం చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జానకి గోవిందరాజులు కాలికి నూనె రాసి మర్దన చేస్తుంది. రామా తండ్రి లేచి నిలబడి నడవడం కోసం స్టాండ్ తీసుకుని వస్తాడు. లేవడానికి ట్రై చేస్తాడు కానీ కుదరకపోయే సరికి జానకి తనకి ధైర్యం చెప్తుంది. మల్లిక మాత్రం ఆయన వల్ల కాదని అంటుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మాటలు అంటుంది. కాసేపటికి గోవిందరాజులుని రామా, జానకి నిలబెట్టి చిన్నగా నడిపిస్తారు.
అది చూసి జ్ఞానంబ చాలా సంతోషిస్తుంది. రామా వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. డబ్బులు తీసుకొచ్చి రామా జ్ఞానంబకి ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత గోవిందరాజుల్ని మళ్ళీ హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. గోవిందరాజులు దగ్గర స్టాండ్ తీసి జానకి రామా చెరొక వైపు చేతులు పట్టి నడిపిస్తారు. చిన్నగా అడుగులు వేస్తూ గోవిందరాజులని ఎప్పటిలాగా మామూలుగా నడుస్తాడు. కాసేపటికి రామా, జానకి చేతులు వదిలేసి నడవమని చెప్తారు. తను ఎప్పటిలాగా నడవగలుగున్నా అని గోవిందరాజులు సంతోషంగా చెప్తాడు. తండ్రి మామూలు మనిషి అయినందుకు రామా చాలా సంతోషిస్తాడు. ఇక నా జీవితం కుర్చీకె అంకితం అయిపోయిందని అనుకున్నా కానీ ఈ ఇంటి కోడలు నా తలరాత మార్చేసిందని మెచ్చుకుంటాడు.
Also Read: కొడుకులని ఆస్తి అడిగిన నందు- ఇవ్వబోమని తెగేసి చెప్పేసిన ప్రేమ్, అభి
అది విని మల్లిక కుళ్ళుకుంటుంది. నడిపించింది కదా అని మహాలక్ష్మి చేయకండి.. కుర్చీలో పడటానికి కారణం తనే మళ్ళీ మామూలు మనిషి చేయడం కూడా తన బాధ్యతే అని మల్లిక అంటుంది. వంకర పోయిన కాళ్ళు సరిగా అయినట్టు మల్లిక నోరు కూడా సరి అయ్యేటట్టు చూడమని గోవిందరాజులు సెటైర్ వేస్తాడు. జ్ఞానంబ భర్త కోసం జావ కాస్తుంటే జానకి వచ్చి చేశాను అని గ్లాస్ అందిస్తుంది. అది తీసుకుని వెళ్ళిపోవడం చూసి జానకి సంతోషపడుతుంది.