Gruhalakshmi February 1st: కొడుకులని ఆస్తి అడిగిన నందు- ఇవ్వబోమని తెగేసి చెప్పేసిన ప్రేమ్, అభి
లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పరంధామయ్యకి ఆస్తి కలిసి వస్తుంది. దాన్ని తీసుకోవాలని నందు ఆశపడతాడు. వచ్చిన ఆస్తి ఏం చేయమంటావ్ అని పరంధామయ్య తులసిని అడుగుతాడు. ఇప్పటి వరకు ఇంట్లో అందరికీ ఏదో ఒకరకంగా సహాయం చేశారు. చెయ్యనిది మనవాళ్లు, మనవరాళ్ళకి వాళ్ళకి ఇవ్వమని సలహా ఇస్తుంది. మంచి సలహా ఇచ్చావ్ నందు భవిష్యత్ లో చేసే అవకాశం ఉన్న లాస్య చేయనివ్వదు. వాళ్ళ నాన్న చేయలేని పని తాతయ్యగా నేను చేస్తానని అంటాడు. నందుని లాస్య పరంధామయ్య దగ్గరకి పంపిస్తుంది. మన కష్టాలు తీర్చడానికి దేవుడు సాయం చేయడానికి ఏమో ఆస్తి వచ్చింది. దాన్ని ఏం చేయాలో అని ఆలోచించాను ఏం ఆలోచన రాలేదు తులసిని పిలిచి అడిగాను. మంచి సలహా ఇచ్చింది. ఇన్ని రోజులు ఈ ఇంట్లో అందరికీ ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నారు. అందుకని మనవళ్ళకి, మనవరాళ్ళకి రాసి ఇవ్వమని చెప్పిందని అనేసరికి నందు షాక్ అవుతాడు.
Also Read: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్
మీకు అనుకోకుండా ఆస్తి కలిసొచ్చింది ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నా, ఆస్తి నా పేరు మీద రాయండని అడుగుతాడు. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న అయిన బయట వాళ్ళకి కాదుగా నీ పిల్లలకే రాస్తున్నా కదా అని పరంధామయ్య చెప్తాడు. అది విని లాస్య తులసి మీద ఎక్కించాలని చూస్తుంది. తులసి మా పిల్లల గురించి ఆలోచించింది వాళ్ళ భవిష్యత్ గురించి అందుకు మెచ్చుకోవాలి. మనం సమస్యల్లో ఉండి ఆలోచిస్తున్నాం కాబట్టి అది తప్పుగా అనిపిస్తుందని మెచ్చుకుంటాడు. ఇక మిగిలింది పిల్లల డెసిషన్ ఆస్తి ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యమని తులసికి చెప్పు అని లాస్య అంటుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో నందు తులసి దగ్గరకి వస్తాడు.
ఆస్తి మన పిల్లల పేరు మీద రాయమని చెప్పావంట కదా, మంచి సలహా ఇచ్చావని అంటాడు. ఇప్పుడు ఆస్తి వాళ్ళకంటే నాకు ముఖ్యం. అది నేను బిజినెస్ చేసుకోవడానికి ఉపగయోగపడుతుంది. నువ్వు పిల్లల్ని ఒప్పించి ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చేలా ఒప్పిస్తే బాగుంటుందని అడుగుతాడు. మూడేళ్ళలో విడిపించేస్తాను, ఆ తర్వాత వాళ్ళకి ఆస్తి తిరిగిచ్చేస్తాను అని చెప్తాడు. ఏం చూసి మిమ్మల్ని నమ్మాలని తులసి ఎదురు ప్రశ్నిస్తుంది. రేపు ఇదే ప్రశ్న నన్ను పిల్లలు అడుగుతారు నేను ఏం చెప్పేదని అంటుంది. అంటే పిల్లలకి ఆస్తి ఇవ్వొద్దని సలహా ఇస్తావా అని అంటాడు. ‘మీ నాన్నకి అవసరం ఆస్తి ఇవ్వమని అలా ఎలా చెప్తాను, వాళ్ళు చిన్న పిల్లలు కాదు మీరు మీ భార్యకి విలువ ఇస్తున్నట్టే వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. మీరు నన్ను అడగాల్సిన అవసరం ఏంటి? మీరే వాళ్ళని డైరెక్ట్ గా అడగండి ఇస్తే సంతోషంగా తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు’ అని చెప్పేసి వెళ్ళిపోతుంది.
Also Read: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
అందరూ భోజనం చేస్తున్న టైమ్ లో ఆస్తి మీకు రాస్తున్న అని ప్రేమ్, అభికి చెప్పడంతో వాళ్ళు సంతోషిస్తారు. నందు మాత్రం అసహనంగా మొహం పెడతాడు. ఆస్తి మీకు ఇస్తున్న జాగ్రత్తగా చూసుకోండి, మీ నాన్నని చూసి నేర్చుకోమని అంటాడు. ఆ మాట విని లాస్య వాదనకి దిగుతుంది. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, ఇలాంటి సమయంలో నాన్నకి ఆస్తి కలిసి రావడం మీకు రాసి ఇవ్వడం సంతోషంగా అనిపించింది. కానీ నాది ఒక రిక్వెస్ట్. మీరు పెట్టుబడి కింద ఆస్తి ఇస్తే వ్యాపారం పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటాను, మీ దగ్గర నుంచి పైసా కూడా తీసుకొనని నందు అంటాడు. అభి మాత్రం ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోడు. మీలాగే నా అవసరాలు నాకు ఉన్నాయ్ ఇప్పుడు వాటి గురించి ఆలోచించాలని చెప్తాడు. ప్రాపర్టీ విషయంలో డెసిషన్ అభిదే అని అంకిత చెప్తుంది.
ప్రేమ్ కూడా మీ మీద నమ్మకం లేదని ప్రాపర్టీ ఇవ్వలేనని తెగేసి చెప్తాడు. మీరు కూడా ఇలా చేస్తే ఎలా అని లాస్య అంటుంది. అంత అవసరం అనుకుంటే అమ్మ చూపించిన జాబ్ చేసుకోవచ్చు కదా అని దెప్పిపొడుస్తాడు. వాళ్ళ మాటలకి నందు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ్ మాటలు తలుచుకుని నందు కోపంతో రగిలిపోతాడు. గులాబీ చెట్టు పట్టుకుని తన చేతులు గాయపరుచుకుంటాడు. తులసి అది చూసి మొక్క వదలమని చెప్తుంది. చేతులకు ముల్లు గుచ్చుకుని రక్తం వస్తుంది.