Janaki Kalaganaledu February 17th: అన్ని నిజాలు భర్తకి చెప్పిన జ్ఞానంబ- పెళ్లిరోజు వేడుక ఘనంగా చేస్తున్న కొడుకులు, కోడళ్ళు
రామ చేసిన అప్పు తీరడంతో జ్ఞానంబ కుటుంబం మళ్ళీ తమ సొంత ఇంటికి చేరుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
గోవిందరాజులు బయట చాప వేసుకుని పడుకుంటుంటే జ్ఞానంబ వస్తుంది. పిల్లల్ని వేరు కాపురం పెట్టించావ్ కదా నన్ను కూడా వేరు పెట్టవేమో అని గోవిందరాజులు అంటాడు. ఇన్నేళ్ళు కాపురం చేసిన మీరు కూడా అర్థం చేసుకోలేద అని జ్ఞానంబ బాధపడుతుంది. రామ, జానకితో నువ్వు మాట్లాడింది నేను విన్నా, నీకు నచ్చినట్టు ఉంటాంఅని చెప్పినా కూడా ఎందుకు వినలేదు నువ్వు అని జ్ఞానంబని ప్రశ్నిస్తాడు. మనసు చంపుకుని ఈ నిర్ణయం తీసుకున్నా, చిన్నవాడి జీతం 30 వేలు. కన్నవాళ్ళ దగ్గర నిజం దాచాడు అంటే వాడు జీవితాన్ని దాచాలని అనుకుంటున్నాడు.
గోవిందరాజులు: అఖిల్ విష్ణుని చూసి నేర్చుకోవచ్చు కదా స్నేహితుడి షాపులో పని చేస్తూ వాడు ఎంత కష్టపడుతున్నాడో వెళ్ళి చూడమనాల్సింది
జ్ఞానంబ: ఆ షాపు వాడిదే, మనకి తెలియకుండా దాచిన డబ్బుతో ఆ షాపు పెట్టారు. మనం చూశామని పని చేస్తున్నామని అబద్ధం చెప్పారు
గోవిందరాజులు: ఇలాంటి వాళ్ళా మన బిడ్డలు, కన్నవాళ్ళని ఇంత మోసం చేస్తారా?
జ్ఞానంబ: అది మోసం కాదు జాగ్రత్త కష్టం ఈ ఇంటిని పలకరించినప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలని అనుకుంటున్నారు
గోవిందరాజులు: ఇన్ని తెలిసి ఎందుకు ఊరుకున్నావ్ నిలబెట్టి కడిగేయాల్సి కదా
Also Read: పెళ్లి చూపుల్లో కావ్యని చూసి షాకైన రాజ్ కుటుంబం- రాహుల్ చేయి అందుకున్న స్వప్న
జ్ఞానంబ: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకునే జానకి మీద దొంగ అని ముద్ర వేశారు. వాళ్ళకి నచ్చినట్టు బతకమన్నా కానీ ఇంట్లోనే ఉండమని చెప్పా అలా అయినా కలల ముందు ఉంటారు. ఇంతకాలం రామా మోసిన ఎంత బరువు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. చేసిన తప్పు కూడా తెలిసి వస్తుంది
గోవిందరాజులు: వాళ్ళ తప్పులు కూడా అర్థం చేసుకుని తల్లిగా మంచిదారిలో పెట్టాలని చూస్తున్నప్పుడు అది తప్పు అని ఎలా చెప్తాను. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఉండదని మరోసారి నిరూపించావ్
అమ్మవాళ్ళ పెళ్లిరోజు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని రామ అంటాడు. జానకి తలలో మల్లెపూలు పెట్టుకుని రామని కాసేపు టెంప్ట్ చేస్తుంది. జానకి భర్తకి దగ్గర అవుతూ ఉంటే రామ తప్పించుకుంటూ ఉంటాడు. మల్లెపూలు చూసి కంట్రోల్ చేసుకోలేక రామ ముప్పుతిప్పలు పడతాడు. జానకి కావాలని రామని ఉడికిస్తూ ఉంటుంది. పొద్దునే జ్ఞానంబ నిద్రలేచే టైమ్ కి జానకి కిచెన్ లో పనులు చేస్తూ ఉంటుంది. ఓ వైపు చదువుకుంటూనే జానకి పనులు చేసుకోవడం చూసి జ్ఞానంబ మురిసిపోతుంది. మిగతా ఇద్దరు కోడళ్ళు ఇంకా నిద్రలేవలేదని చూసి బాధపడుతుంది.
Also Read: విన్నీ మీద గెలిచిన యష్- భర్తని చూసి మురిసిపోయిన వేద
ముగ్గురు కోడళ్ళు రెడీ అయి పెళ్లి రోజు వేడుకలు చేసుకునేందుకు జ్ఞానంబని ఒప్పించడానికి ట్రై చేస్తారు. అటు తండ్రికి కొట్టబట్టలు తీసుకుని రామ వాళ్ళు గోవిందరాజులు దగ్గరకి వెళతారు. ముగ్గురు కోడళ్ళు ఒకేసారి జ్ఞానంబకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం చూసి సంతోషిస్తుంది. ముగ్గురు కొడుకులు, కోడళ్ళు కలిసి జ్ఞానంబ, గోవిందరాజులని ఒప్పించి కొత్త బట్టలు పెడతారు.