అన్వేషించండి

Janaki Kalaganaledu June 24th (ఈరోజు) ఎపిసోడ్: జానకికి క్షమాపణలు చెప్పిన అత్త- ప్రేమ కురిపిస్తూనే డిఫెన్స్‌లో పడేసిన జ్ఞానాంబ

చేసిన తప్పులను క్షమించమని జానికిని జ్ఞానాంబ వేడుకుంటుంది. నువ్వు నా దగ్గర ఏం దాయలేదన్న విషయం తెలియక బాధపెట్టానంటుంది. ఈ మాటకు ఏం చెప్పాలో జానకికి అర్థం కాదు.

గుడిలో కుటుంబాన్ని రక్షించి గాయపడిన జానకిని ఇంటికి తీసుకొస్తారు. ఇంటి వద్దే డాక్టర్ చికిత్స చేస్తారు. ఏమవుతుందన్న కంగారులో ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. చికిత్స చేసిన కాసేపటికి జాకని కళ్లు తెరుస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదని... చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని... ప్రాణాలతో బయడటం చాలా అదృష్టమని చెబుతుంది డాక్టర్. మందులు వాడమని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. 

ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ... మిమ్మల్నీ అలా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ బాధను అనుభవించానంటాడు రామచంద్ర. ఇప్పటికీ ఆ భయం అలానే ఉందని చెప్తాడు. 

మల్లిక కలుగుజేసుకొని జానకి ప్రాణాలతో నా వల్లే బయటపడిందని అంటుంది. నేను చేసిన అభిషేకానికి పరమశివుడు కరుణించి జానకిని ప్రాణాలతో బయటేశాడని అంటుంది. 

అసలు ఆ ప్రమాదానికి కారణమేంటని గోవిందరాజు ఆరా తీస్తాడు. పక్కనే ఉన్న విష్ణు... ఇంకెవరు మల్లికే అంటాడు. దాంతో మల్లిక కంగారు పడుతుంది. బిందిలో తీసుకొచ్చిన నీళ్లు సరిగా తీసుకురాకపోవడంతో దారిలోనే పడి ఇలా అయిందంటాడు విష్ణు. 

జ్ఞానాంభ ఆపమని చెప్పి... జానకి విశ్రాంతి తీసుకుంటుంది అంతా బయటకు వెళ్లండని చెబుతుంది. ఒక్క రామచంద్ర తప్ప అంతా బయటకు వెళ్లిపోతారు. 

జానకిని చూసి రామచంద్ర బాధపడుతుంటే... వద్దని కళ్లతో వారిస్తుంది. బాధపడొద్దు తగ్గిపోతుందని చెబుతుంది. 

మీకు ఏమైనా జరిగి ఉంటే నేను బతకలేను అంటాడు రామచంద్ర. అలా అనొద్దని ఆపేస్తుంది జానకి. ఊపిరి తీసుకోకుండానైనా బతకగలనేమో కానీ... మీరు లేకుండా ఉండలేనంటాడు. మీరు లేని బతుకు నరకమే కాదు శాపం కూడా అని చెప్పి జ్యూస్ తాగిస్తాడు. నాప్రాణమే ఇక్కడ ఉంటే వదిలేసి వెళ్లగలనని ఎలా అనుకుంటారని అడుగుతాడు. కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమెను చూస్తు అలానే కూర్చుండిపోతాడు. కాళ్లు నొక్కుతాడు. జానకి మేలుకొని వద్దని వారిస్తుంది. తప్పు కాదని... ఇది భర్త బాధ్యతని చెప్తాడు.

ఇక్కడ మల్లిక ఒళ్లు నొప్పులతో తెగ బాధపడుతుంటింది. దాన్ని చూసిన విష్ణు వెటకారంగా ఏమైందని అడుగుతాడు. గిన్నెలో వేడినీళ్లు తీసుకొస్తాడు. నీ వల్లే ఇదంతా జరిగిందని గట్టిగా కొట్టేస్తుంది. ప్రదక్షిణలతో ఇరికించింది మీరే కదా అని అసహనం వ్యక్తం చేస్తుంది. వాళ్లు వెళ్లకుండా కుట్ర చేసిందే కాకుండా వళ్లు గెలిచి వచ్చిన తర్వాత ఆనందంగా ఉండాల్సిందిపోయి కడుపు మంటతో ఉంటావేంటని అడుగుతాడు విష్ణు. తర్వాత ఆమెకు కాపడం పెడతాడు. ఒళ్లు నొప్పులున్నప్పటికీ మొగుడు కాపడం పెడుతుంటే కాస్త ఇగో చల్లారిందని అంటుంది మల్లిక. 
డైనింగ్ టేబుల్‌పై కూర్చొని ఉన్న జానకి.. రామచంద్ర చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో జ్ఞానాంభ వస్తుంది. ఏదో చెప్పబోతుంది. ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది అడుగుతుంది జానకి. 

నువ్వు క్షమించాలని జానకిని జ్ఞానాంభ అడుగుతుంది. ఏంటని షాక్ తింటుంది జానకి. ఆ మాట వినడానికి ఇబ్బందిగా ఉందని అంటుంది. నిన్న తప్పుగా అర్థం చేసుకున్నానని... అందుకు బాధపడుతున్నానని అంటుంది జ్ఞానాంభ. అయ్యో అత్తయ్య... మీరు నన్నేమే బాధ పెట్టలేదని అంటుంది జానకి. దయచేసి మీ మనసులోంచి ఆ ఆలోచన తీసేయమంటుంది.

నువ్వు నాతో మాట్లాడుతుంటే చీదరించుకున్నాను... నువ్వు కనబడితే అసహ్యించుకున్నాను... నిన్ను పురుగులా చిన్న చూపు చూశాను. ఇవన్నీ నిన్ను బాధ పెట్టడం కాకుండా ఇంకేంటని అంటుంది జ్ఞానాంభ. నేను అనుకున్నదే నిజం... నాకు తెలిసిందే వాస్తవం అనే మొండితనంలో ఉండిపోయాను. నువ్వు నాపే కేసు పెట్టించావని చెప్పగానే గుడ్డిగా నమ్మేశాను. నా కొడుకును గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నావని నీపై కోపం పెంచుకున్నాను అంటుంది. నీ చదువుకున్న తెలివితేటలతో నా కొడుకును నా నుంచి దూరం చేసి కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావని నమ్మాను. జానకి ఇలా చేస్తుంది అని నమ్మిన నేను... నా కోడలు ఇలా చేస్తుందా అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను. నువ్వెంటో తెలుసుకున్నాను.. నీ మంచితనం ఏంటో గ్రహించాను. తోటి కోడలి కోసం నువ్వు పోలీస్ స్టేషన్‌కు వెళ్లావు. ఓ స్వీట్స్ ఆర్డర్‌... చేయలేమని... అంటే నువ్వు చేసి చూపించావు.. నీ మరిది పరీక్షల్లో తప్పితే చదివించి పాస్ చేయించావు. నీ భర్త వంట వాడు అని మీ అన్నయ్య అవమానిస్తే... సవాల్ చేశావు. వంటల పోటీల్లో గెలిపించి అందరిలో గొప్పగా నిలబెట్టావు. అంతెందుకు గుడిలో నీ ప్రాణాలు అడ్డు వేసి మా ప్రాణాలు కాపాడావు. నీగురించి చెప్పిన అబద్దాలను నిజమని నమ్మిన నేను... కళ్ల ముందు జరిగిన నిజాలను గుర్తించుకోలేకపోయాను. నీకు మంచి చేయడమే తెలుసని... మోసం చేయడం రాదని గుర్తించలేకపోయాను. 

అత్తయ్య మీరు చేసింది కుటుంబం కోసమే తప్ప నాపే కోపంతో కాదు కదా... ప్రేమకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది జానకి. 

చేసిన తప్పులు చెబితే పోతాయంటుంది. చేయని తప్పులకు నీవు శిక్ష అనుభవించినప్పటికీ నాపై రవ్వంతైనా కోపం లేదు. ఇలాంటి కోడల్ని అభినందించాల్సిందిపోయి ఆగ్రహించాలను అంటుంది జ్ఞానాంభ. చేతులు పట్టి అభ్యర్థిస్తున్నాను... క్షమించమని జానకితో వేడుకుంటుంది జ్ఞానాంభ.

అయ్యే అమ్మ చేతులు ఆశీర్వదించాలే కానీ.. క్షమించమని అడగకూడదని అంటుంది జానకి. దయచేసి క్షమాపణలు చెప్పి బాధ పెట్టొద్దని రిక్వస్ట్ చేస్తుంది. 

నాకో భయం ఉందమ్మ... నేను నమ్మిన వాళ్లు నాకు అబద్దం చెబితే తట్టులేనంటుంది జ్ఞానాంభ. వాళ్లు నన్ను మోసం చేస్తే భరించలేను. వాళ్లపై నాకు ఉన్న ప్రేమను అవకాశంగా తీసుకొని మోసం చేశారనే బాధ. అలాంటి బాధతో నిన్ను ఇబ్బంది పెట్టానంటుంది. ఇకపై అలాంటి సమస్యలు రావని... నువ్వు నా దగ్గరేమే దాయవని అర్థమవుతుందని అంటుంది. 

ఇంతలో భోజనం ప్లేట్ తీసుకొచ్చిన రామచంద్ర.. జానకిని తినమంటాడు. ఆ ప్లేట్ అందుకున్న జ్ఞానాంభ... నేను తినిపిస్తానని చెప్పి జానకికి తినిపిస్తుంది. దాన్ని చూసిన మల్లిక ఈర్ష్యతో రగిలిపోతుంది. ఆ సీన్ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మల్లిక మాత్రం తనకు ఎవరూ పిలిచి మర్యాద చేయడం లేదంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget