Jagadhatri Serial February 12th: ‘జగధాత్రి’ సీరియల్: ప్రియ నుంచి నిజం రాబట్టే ప్రయత్నంలో జేడి, కేడి - సమస్యలో చిక్కుకుపోయిన కౌషికి!
Jagadhatri Serial Today Episode: బోర్డు మెంబర్స్ కౌషికి ఇంటికి వచ్చి సుధాకర్ గారితో పాటు టీ తాగుతాము ఆయనని తీసుకురండి అనడంతో కథ మలుపు తిరుగుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు ఎండివి అవ్వాలంటే ఈ పని చెయ్యు, కానీ నువ్వు చేసినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వదినకి తెలియకూడదు అని సలహా ఇస్తుంది దివ్యాంక.
నిషిక: నేను ఎండి ఆ అని ఆనందపడిపోతూ నాకు భయంగా ఉంది, నువ్వు కూడా తోడుగా రావచ్చు కదా అంటుంది.
దివ్యాంక: నా ఫ్రెండ్ ఎదుగుతానంటే అందుకు నా సహాయం తప్పకుండా ఉంటుంది. తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
మరోవైపు ధాత్రి వాళ్లు మినిస్టర్ పిఏ ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాచ్మెన్ వాళ్ళని అడ్డుకుంటాడు. ధాత్రి వాళ్ళు మేము పోలీసులం అని ఐడి కార్డు చూపించడంతో, మేడం లేరు ఫారిన్ వెళ్లారు అని చెప్తాడు వాచ్మెన్.
ఇంతలో మోటర్ నిండిపోవడంతో కట్టడానికి వెళ్తాడు వాచ్మెన్. అప్పుడే ఆలోచనలో పడిన ధాత్రి కారు మీద చేయి వేస్తే ఇంజన్ హీట్ కి చెయ్యి కాలుతుంది, టైర్ కి బురద కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఇదంతా గమనిస్తుంది ధాత్రి ఇంతలో వాచ్మెన్ వస్తాడు.
ధాత్రి: ఈ కారు మీ మేడం కాకుండా ఇంకెవరు వాడతారు అని అడుగుతుంది.
వాచ్మెన్ : ఇంకెవరు వాడరు మేడం అని చెప్తాడు.
ధాత్రి : ఇంజను హీట్ గా ఉంది, కారు కూడా ఇప్పుడే బయటికి వెళ్లి వచ్చినట్లు టైర్లకి ఫ్రెష్ గా బురద అంటుకొని ఉంది అని నిలదీస్తుంది.
కేదార్: నిన్ను తన్ని లోపల వేసి నిజం చెప్పించేంత ఓపిక, టైం మాకు లేవు నిజం చెప్పు, మేడం లోపల ఉన్నారు కదా అని అడుగుతాడు.
ఇంతలో బాడీగార్డ్లు వచ్చి కేదార్ వాళ్ళని అడ్డుకుంటారు. కేదార్ వాళ్ళు బాడీగార్డ్స్ ని చితకొట్టి ప్రియా ఇంట్లోకి ప్రవేశిస్తారు. వాచ్మెన్ తో మాట్లాడించి ఆమెని గదిలో నుంచి బయటికి రప్పిస్తారు.
ధాత్రి: మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మినిస్టర్ హత్య విషయంలో మీ ప్రమేయం ఏమైనా ఉందా అని అడుగుతుంది.
ప్రియ: నేను చంపలేదు, కానీ ఆయన దగ్గర చాలా రోజుల నుంచి పని చేయడం వలన అందరి దృష్టి నా మీద పడింది. అందరూ నన్ను ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే ఇవ్వటం లేదు అని చెప్తుంది.
ధాత్రి: మీ చేతికిమట్టి గాజులు ఏమిటి ఈ రోజుల్లో ఎవరు అలాంటి గాజులు వేసుకోరు కదా అయినా ఈ గాజులు కొన్ని మినిస్టర్ గారి ఇంట్లో దొరికాయి అని చెప్తుంది.
ప్రియ: ఆ మాటలు విని కంగారుపడుతుంది, తర్వాత మినిస్టర్ గారి రూమ్ లోకి వెళ్ళే అంత చొరవ నాకు లేదు అని చెప్తుంది.
కాసేపు ఆమెని ఎంక్వయిరీ చేసి బయటికి వస్తారు రాత్రి వాళ్ళు.
కేదార్: నువ్వు ఏమనుకుంటున్నావు, తను నేరం చేసింది అనుకుంటున్నావా అని ధాత్రిని అడుగుతాడు.
ధాత్రి: తను నేరం చేసింది అని చెప్పలేను కానీ ఖచ్చితంగా తప్పు చేసింది అని చెప్తుంది.
మరోవైపు దివ్యాంక నిషిక ఇంటికి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే బోర్డు మెంబర్స్ రావడం గమనిస్తారు దివ్యాంక, నిషిక.
దివ్యాంక: ఇంక నీ యాక్టింగ్ స్టార్ట్ చెయ్యు అని చెప్తుంది.
నిషిక : మావయ్య గారిని పోలీసులు అరెస్టు చేశారంట, కానీ ఈ విషయం మా వదిన బయటికి చెప్పొద్దంది ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంట అని వచ్చిన వాళ్ళు వినేలాగా చెప్తుంది.
ఆ మాటలు విన్న బోర్డు మెంబర్స్ నేరుగా నిషిక దగ్గరికి వచ్చి మీ మామయ్య గారు అరెస్టు అయ్యారా అని అడుగుతారు
నిషిక: లేదు నేను మా మేనమామ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి తప్పించుకుంటుంది.
నేరుగా కౌషికి గారిని కనుక్కుందామని చెప్పి లోపలికి వస్తారు బోర్డు మెంబర్స్.కౌషికి వాళ్ళని రిసీవ్ చేసుకుని టీ ఆఫర్ చేస్తుంది. సుధాకర్ గారిని పిలవండి అందరం కలిసే కాఫీ తాగుదాం అంటారు వచ్చిన వాళ్ళు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కౌషికి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.