అన్వేషించండి

Jagadhatri Serial Today June 9th:వైజయంతిపై పగతీర్చుకున్న పాపారాయుడు..చెట్నిలో విషం కలిపి చెల్లికి తినిపించిన అన్నయ్య.

Jagadhatri Serial June 9th: తప్పు చేసిన చెల్లిని చంపడానికి వచ్చిన పాపారాయుడు...తాను మారిపోయానని పగలు,కక్షలు వద్దనుకుంటున్నానని అందరినీ నమ్మించి చెల్లికి విషం కలిపిన టిఫిన్ పెట్టి చంపబోతాడు.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. వైజయంతిని చంపడానికి ఇంటికి వచ్చిన పాపారాయుడిని జగధాత్రి,కేదార్‌ అడ్డుకున్నా వైజయంతి తన గోతిని తానే తవ్వుకుని అన్నను ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. మంచివాడిలా అందరినీ నమ్మించిన పాపారాయుడు...చెల్లికి టిఫిన్‌లో విషం  కలిపి పెట్టడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
పగబట్టిన పాపారాయుడు
                  వైజయంతి తప్పుచేసిందని బలంగా నమ్మిన పాపారాయుడు..ఆమెను ఎలాగైనా చంపాలని పథకం వేస్తాడు. దగ్గుమందు సీసాలో విషం నింపుకుని వస్తాడు. పాపారాయుడు లోపలికి వెళ్తుండగా.....కేదార్‌ అతన్ని ఢీకొట్టగానే విషం ఉన్న సీసీ కిందపడిపోతుంది. సారీ మామయ్య అని కేదార్ చెప్పగా..నేను నీకు మామయ్య ఏంట్రా అని కోప్పడతాడు. కేదార్‌ సీసీ తీసి ఇవ్వబోగా....అతని చేతుల్లో నుంచి సీసా లాక్కుంటాడు. మీరు మారిపోతే మంచిదని...మళ్లీ ఈ ఇంట్లో ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం ఈసారి చాలా సీరియస్‌గా ఉంటుందని జగధాత్రి వార్నింగ్ ఇస్తుంది. దీంతో కోపంగా పాపారాయుడు లోపలికి వెళ్లిపోతాడు.
మారిపోయానంటూ నాటకం
                             పాపారాయుడిని చూడగానే సుధాకర్‌ కోపంతో రగిలిపోతాడు. నిన్ను జైలులో పెట్టించాను కదా మళ్లీ బయటకు ఎలా వచ్చావని నిలదీస్తాడు. మీ కొడుకే బెయిల్‌ ఇప్పించి బయటకు తెచ్చాడని చెబుతాడు. సుధాకర్‌ కొడుకుపై కోప్పడగా....వైజయంతి కల్పించుకుని మా అన్నయ్య ఏదో కోపంలో నన్ను చంపబోయాడని....అంతమాత్రానా నాపై ప్రేమలేకుండా పోతుందా అని అంటుంది. దీంతో పాపారాయుడు  కూడా తాను పూర్తిగా మారిపోయానని నాటకం ఆడతాడు. తన చెల్లిని క్షమించేశానని అంటాడు.పాత పగలన్నీ వదిలేశానని చెప్పడానికి వచ్చానని అంటాడు. ఇంతలో జగధాత్రి కల్పించుకుని మీరు నిజంగానే మారిపోయారా అని ప్రశ్నిస్తుంది. దీంతో వైజయంతికి కోపం వచ్చి నువ్వు మధ్యలో దూరిపోవద్దని అరుస్తుంది.నిషిక ,యువరాజు కూడా మా పాపారాయుడు మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని అంటాడు. ఏంలేదు ఇందాక పాపారాయుడు బాబాయి వచ్చేప్పుడు సీసీలో ఏదో తీసుకొచ్చారని అది చూపిస్తే మాకు ఎలాంటి అనుమానం లేదని అంటారు. దీంతో వైజయంతి జగధాత్రిపై మండిపడుతుంది. మా అన్నయ్య నీకు చూపించేది ఏంటని అరుస్తుంది.అయినా నువ్వు ఏంటి ఏం మాట్లాడకుండా ఉన్నావని మొగుడుపైనా మండిపడుతుంది. వాళ్లు నీ ప్రాణాలు కాపాడటం కోసమే అడుగుతుంటే మధ్యలో  నేను ఎలా కల్పించుకుంటానని అంటాడు. వీళ్లు ఇలాగే అంటారు కానీ నువ్వు వెళ్లి నా రూమ్‌లో కూర్చోమని వైజయంతి అంటుంది.
వైజయంతికి విషం పెట్టిన పాపారాయుడు
                         అన్నకు ఎలాగైనా శ్రీవల్లి గురించి నిజం చెప్పేస్తే....తన కోపం తగ్గిపోతుందని వైజయంతి అనుకుంటుంది. టిఫిన్ తీసుకుని పాపారాయుడి దగ్గరకు వెళ్తుంది. 
ఏదో కీడు శంకించిన జగధాత్రి, కేదార్‌...కిటికీలో నుంచి అంతా చూస్తారు.మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పి పంపించి ఆ టిఫిన్‌లో పాపారాయుడు విషం కలిపేస్తాడు. వైజయంతి రాగానే చిన్నప్పుడు నీకు నేనే తినిపించేవాడినని చెప్పి....చెల్లికి ప్రేమగా విషం కలిపిన టిఫిన్ తినిపిస్తాడు. టిఫిన్ తిన్న వైజయంతి గొంతుపట్టుకుని కిందపడిపోతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget