అన్వేషించండి

Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్

Jagadhatri Serial Today Episode June 4th:నిషిక పదేపదే కేదార్‌ను అవమానిస్తుండటంతో జగధాత్రికి కోపం వస్తుంది. తన బండారం భయటపెట్టడానికి మాస్టర్‌ ప్లాన్ వేస్తుంది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు  ట్విస్టులతో అదిరిపోయింది. సుధాకర్‌ కేదార్‌ను దగ్గరకు తీసుకునే సమయంలో నిషిక వచ్చి తన కడుపు పోవడానికి వీళ్లే కారణమని గుర్తుచేసి  అవమానిస్తుంది. దీంతో జగధాత్రికి కోపం వస్తుంది.తప్పు వాళ్లు చేసి మనల్ని  అవమానిస్తున్నారని కేదార్‌తో అంటుంది. ఇవాళే ఆ నిషిక బండారం బయటపెట్టాలని అందుకు  నా దగ్గర ఓ ఉపాయం ఉందంటూ చెబుతుంది. ఇంతకీ ఆ  ఉపాయం ఏంటో ఈరోజు ఏపిసోడ్‌లో చూద్దాం.

జగధాత్రికి అవమానం

కిందపడిపోబోతున్న తండ్రిని కాపాడటంతో సుధాకర్‌ కేదార్‌ను దగ్గరకు తీసుకోవాలనుకుంటాడు. అప్పుడే నిషిక తన గర్భంపోవడానికి కారణమైన మిమ్మల్ని మామయ్య ఎప్పటికీ క్షమించడని గుర్తుచేయడంతో సుధాకర్‌ వెనక్కి తగ్గుతాడు.  నాన్నకు దగ్గరవ్వాలనే మీరే కావాలని ఈ పని చేశారంటూ యువరాజు అంటాడు. వీల్‌ఛైర్ మామూలుగా కూడా పట్టుకుని ఆపొచ్చని....కావాలనే కేదార్‌ కిందకు దూకి చేతికి దెబ్బ తగిలించుకుని ఈ పని చేశాడని అంటాడు.నాన్న దగ్గర సింపతి కొట్టేసి దగ్గరవ్వాలని చూస్తున్నారని అంటాడు. జగధాత్రి ఎంత చెప్పినా కూడా సుధాకర్‌ మాత్రం ఆమెను క్షమించడు. దీంతో కోపంతో జగధాత్రి అక్కడి  నుంచి వెళ్లిపోతుంది. ఈ జన్మలో మామయ్య దాన్ని దగ్గరకు రానివ్వడని నిశిక సంబరపడిపోతుంది.

జగధాత్రి మాస్టర్‌ ప్లాన్

కేదార్‌ ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే జగధాత్రి అక్కడికి వచ్చి ఓదార్చుతుంది. నువ్వేమీ బాధపడొద్దని...త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని అంటుంది.మామయ్య నిన్ను దగ్గరకు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతుంది.అందుకు నా దగ్గర ఓ మంచి ఉపాయం ఉందంటూ తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న నేను చెప్పిన లొకేషన్‌కు నువ్వు రావా అని చెబుతుంది.దీంతో ఆయన జగధాత్రి చెప్పిన చోటకి వస్తాడు. కేదార్‌, జగధాత్రి కూడా అక్కడికి చేరుకుంటారు. ఏంటమ్మా ఇంత సడెన్‌గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావని అడుగుతాడు.

డాక్టర్‌కు జగధాత్రి వార్నింగ్

ఈ ఇల్లు నిషికను చూసిన డాక్టర్‌ ఇల్లు అని చెబుతుంది.మరి ఇక్కడికి మనం ఎందుకు వచ్చామని అడుగుతాడు.  దీంతో జగధాత్రి నిషిక ఆడిన నాటకం, డాక్టర్‌కు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పిన విషయం ఆ తర్వాత ఇంట్లో కావాలనే కిందపడి ఆ నింద తనపై వేసి మామయ్యను కేదార్‌కు దూరం చేయడం మొత్తం పూసగుచ్చినట్లు చెబుతుంది. ఆ నిషిక ఇంతపని చేసిందా అని అంటాడు.చిన్నప్పటి నుంచి దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదని..ఇలా నలుగురిలో పెట్టి గట్టిగా కడిగేస్తే అయినా బుద్ధి వస్తుందని అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. జగధాత్రి ప్లాన్ మొత్తం తండ్రికి చెప్పి డాక్టర్‌ ఇంట్లోకి వెళ్లమని చెబుతుంది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

జగధాత్రి చెప్పినట్లే వాళ్ల నాన్న డాక్టర్ ఇంటి తలుపు కొడతాడు.ఆమె భయటకు వచ్చి ఎవరని అడుగుతుంది.తాను నిషిక వాళ్ల నాన్నను  అని కొంచెం లోపలికి రావొచ్చా అని అంటాడు. దీంతో ఆమె లోపలికి ఆహ్వానిస్తుంది.ఎందుకు నా కూతురుకి లేని కడుపు ఉందని చెప్పావని అంటాడు. ఆ తర్వాత ఆకడుపు పోయిందని అబద్ధం చెప్పావని  నిలదీస్తాడు. మీరు  ఏవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని డాక్టర్ బెదరిస్తుంది. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకోకపోతే నేను నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్తానని అప్పుడు వాళ్లే నిజం కక్కిస్తారని అంటాడు. పోలీసులంటే నాకేమైనా భయమా అని డాక్టర్ అంటుంది. అయినా పోలీసులు నీ మాటలు ఎందుకు నమ్ముతారని అనగా....నాకు ఇంకో కూతురు ఉందని జగదధాత్రిని పిలుస్తాడు.ఆమెకు ఇంకో పేరు కూడా  ఉందని చెప్పగానే డాక్టర్ అదిరిపడుతుంది. జేడీ వచ్చి మర్యాదగా మీరు నిజం ఒప్పుకుని మామయ్య దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాలని...ఆ తర్వాత మీ క్లీనిక్‌ మూసివేయాలని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తుంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget