Jagadhatri Serial Today July 18th: జగద్ధాత్రి సీరియల్: రాజు మర్డర్ మిస్టరీ! కౌషికి కొడుకు రహస్యం జగద్ధాత్రి తెలుసుకుంటుందా?
Jagadhatri Today Episode కౌషికి బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తానని ఆదిలక్ష్మీ తీసుకెళ్లడం జగద్ధాత్రి ఆపి రెండు రోజులు గడువు కోరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode ఆదిలక్ష్మీ కౌషికి కొడుకుని అనాథాశ్రమంలో వదిలేస్తానంటూ తీసుకెళ్తుంటే జగద్ధాత్రి, కేథార్ ఆపుతారు. రెండు రోజుల గడువు అడుగుతారు. నిషిక, వైజయంతిలు వారం గడువు ఇస్తేనే ఏం చేయలేకపోయారు. రెండు రోజుల్లో ఏం చేస్తారు అని అడిగితే జగద్ధాత్రి, కేథార్‌లు బాబు కౌషికి కొడుకని నిరూపిస్తామని చెప్తారు. నిరూపించకపోతే ఏంటి పరిస్థితి అని అడిగితే దానికి జగద్ధాత్రి అప్పుడు మేమే బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తామని అంటుంది.
సురేశ్ షాక్ అయి ఏంటి జగద్ధాత్రి అలా అంటున్నావ్ అని అంటే కౌషికి భర్తతో జగద్ధాత్రి మాట ఇచ్చింది అంటే అది కచ్చితంగా చేస్తుంది సురేశ్ నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంది. సుధాకర్ కూడా జగద్ధాత్రి మాట అంటే రాజముద్ర అని అంటాడు. జగద్ధాత్రికి అంత సీన్ లేదు అని నిషిక అంటుంది. ఇక కౌషికి అత్తతో రెండు రోజులు ఓపిక పట్టండి అని చెప్తుంది. ఆదిలక్ష్మీ రెండు రోజులు గడువు ఇస్తానా ఈ లోపు తేల్చకపోతే బాబుని ఎక్కడ వదులుతానో కూడా మీకు తెలీదని అంటుంది. జగద్ధాత్రి కౌషికితో మేం చూసుకుంటాం అని చెప్పి కేథార్‌తో బయటకు వెళ్తారు.
జేడీ, కేడీలు డీఎన్‌ఏ రిపోర్ట్స్ చేసిన రాజుని కోసం అతని ఇంటికి వస్తారు. మళ్లీ డీఎన్ఏ టెస్ట్ చేయమని చెప్తారు ఇప్పుడు ఈ రాజు ఎందుకు అని కేడీ అడిగితే మళ్లీ టెస్ట్‌లు చేస్తే నిషిక వాళ్లు మళ్లీ తారుమారు చేస్తారు. ఈ రాజుని పట్టుకొని అతను ఎందుకు డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చేశాడు వాడితో ఎవరు చేయించారో సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ అత్తయ్యకి ఏ అనుమానం ఉండదు అని జేడీ చెప్తుంది. ఇద్దరూ రాజు కోసం ఎదురింట్లో అడిగితే వారం నుంచి రాజు ఇంటికి రావడం లేదని సంవత్సరం క్రితం విడాకులు అయిపోయావని రాజుకి ఒక తమ్ముడు ఉన్నాడు అతను కూడా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలీదుఅని ఆవిడ చెప్తుంది. ఇంతలో రమ్య నుంచి కేడీకి కాల్ వస్తుంది. ఊరు అవతల ఓ శవం ఉందని ఎవరు అనేది తెలీలేదని చెప్తుంది.
జేడీ, కేడీలు అక్కడికి వెళ్తారు. క్లూస్ పరిశీలిస్తారు. బాడీ ముఖం గుర్తు పట్టలేనట్లు ఉంటుంది. బాడీ మీద కత్తి గాట్లు ఉండటం వల్ల మర్డర్ అని వెతికిస్తారు. కిరణ్‌ని పోస్ట్ మార్టం కోసం పంపిస్తుంది. కాస్త దూరంలో కారులో ఓ వ్యక్తి ఉండటం అతను జేడీని చూసి భయంతో ఉండటం జేడీ చూస్తుంది. పట్టుకోవడానికి వెళ్లే టైంకి అతను పారిపోతాడు. కారు నెంబరు బట్టి కనిపెడదాం అని కేథార్ అంటే అది ఫేక్ నెంబరు అయింటుందని అంటుంది. మర్డర్ గురించి తెలియాలి అంటే ముందు ఎవరు చనిపోయారో తెలియాలి అనుకుంటారు. వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపారని అనుకుంటారు. కాస్త దూరంలో ఓ మహిళలను కూడా చంపినట్లు గుర్తిస్తారు. ఆ మహిళ చేతి మీద రాజు అని పచ్చబొట్టు ఉంటుంది. అ తని భర్త ఏమో అని అంటే మెట్టెలు లేవని ఆనవాళ్లు కూడా లేవని తను పెళ్లి కాని అమ్మాయి అని జేడీ చెప్తుంది.
జేడీ రెండు మర్డర్‌లకు సంబంధం ఉందని అంటుంది. ఇక ఆ మహిళ కొంగులో డబ్బులో పాటు ఓ పాస్ ఫొటో ఉంటుంది. అది చూసి జేడీ షాక్ అయిపోతుంది. కేథార్ కూడా చూసి షాక్ అవుతాడు. ఆ ఫొటో కౌషికి కొడుకుకు డీఎన్‌ఏ టెస్ట్ చేసిన రాజుది. ఆ శవం కూడా రాజుదే అయింటుందని అనుకుంటారు. వారం నుంచి రాజు కనిపించకపోవడం రాజుని కూడా వారం ముందు చంపేసుంటాడని అనుకుంటారు. వైజయంతి ఎమ్మెల్యే సీటు వస్తుందని తెగ సంబర పడిపోతుంది. జగద్ధాత్రి, కేథార్‌లు తాయారు ఏదో పెద్ద ప్లానే వేస్తుందని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!






















