Jagadhatri Serial Today July 11th: జగద్ధాత్రి సీరియల్: కౌషికి బాబు కోసం హైడ్రామా! మాస్టర్ ప్లాన్‌తో మీనన్ ఆటకట్టించిన జేడీ, కేడీ!
Jagadhatri Today Episode మీనన్ జగద్ధాత్రి తండ్రి, పిన్నిని చంపేస్తానని జేడీ, కేడీలను బెదిరించడం ఇద్దరూ తెలివిగా మీనన్ ప్లాన్ తిప్పి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి కొడుకు తన కొడుకంటూ సుజాత దంపతులు వస్తారు. మా బిడ్డను మా నుంచి దూరం చేయొద్దని బతిమాలుతారు. వైజయంతి, నిషిక, ఆదిలక్ష్మీలు బాబుని తీసుకెళ్లిపోమని అంటారు. నా బాబు నా బాబు అని కౌషికి భర్తతో చెప్పి ఏడుస్తుంది. జగద్ధాత్రి, కేథార్ వెళ్లి వాళ్లు గేటు కూడా దాటలేరని అంటారు.
సుజాత వాళ్ల కారు ఆపి సుజాత చేతిలో ఉన్న బాబుని జగద్ధాత్రి తీసుకుంటుంది. మా బాబు అని సుజాత అంటే అందరం కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తేల్చుకుందామని కేథార్ అంటాడు. వీడు మీ బాబు అయితే పోలీస్ స్టేషన్‌లో చూసుకుందాం.. నిజంగా బాబు మీ కొడుకు అయితే మీకు ఇచ్చేస్తా అని జగద్ధాత్రి అంటుంది. బాబు మీ కొడుకే అని అనడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతానని కేథార్ అంటాడు. ఆదిలక్ష్మీ మనసులో వాళ్లని నేను పంపానని తెలిస్తే కౌషికి నన్ను అరెస్ట్ చేయిస్తానని అంటుంది. ఇక జగద్ధాత్రి, కేథార్‌లు బాబు ఎక్కడ పుట్టాడు. ఏ డేట్‌లో పుట్టాడు.. డాక్టర్‌పేరు అడుగుతారు.
కేథార్ వెంటనే డాక్టర్‌కి కాల్ చేసి సుజాతకి డెలివరీ చేశారా అని అడిగితే డాక్టర్ డెలివరీ చేయలేదు అని అంటాడు. ఇద్దరూ పారిపోవాలని ప్రయత్నిస్తే కేథార్ పట్టుకొని అతన్ని కొట్టి ప్రశ్నిస్తాడు. సుజాత నిజం చెప్తాను అంటే నిషిక ఆపుతుంది. ఇక సుజాత అబద్ధం చెప్తుంది. టీవీలో చూసి పిల్లలు లేని మేం ఇలా చేశామని అంటారు. కేథార్, జగద్ధాత్రి ప్రశ్నిస్తుంటే దొరికిపోయామని ఇద్దరూ పారిపోతారు. కారు నెంబరు నోట్ చేసుకున్నాం.. సీసీ టీవీలో వాళ్ల ముఖాలు కూడా రికార్డ్ అయ్యావని పోలీస్ కంప్లైంట్ ఇస్తామని కేథార్, జగద్ధాత్రి చెప్తారు. సురేశ్ భార్యతో ఈ సారి బాబు కోసం ఎవరు వచ్చినా ఇవ్వొద్దని అంటాడు.
మీనన్ యామినిని రమ్మని చెప్తాడు. యామిని కారులో వస్తుంది. యామినితో జేడీ, కేడీలు మాట్లాడుతారు. రౌడీ వస్తే అతని పేరు చెప్పి మొత్తం చెక్ చేస్తాడు. ఫోన్ బ్యాగ్ పెట్టమని అంటాడు. భయపడకుండా వాడు చెప్పినట్లు చేసి వెళ్లు నీ కోసం మా టీమ్ అంతా ఉందని జేడీ ధైర్యం చెప్తుంది. యామిని లోపలికి వెళ్తుంది. రమ్య వాళ్లు బ్యాక్ సైడ్ నుంచి బిల్డింగ్‌లోకి వెళ్తారు. జగద్ధాత్రి, కేథార్‌లు ముందు నుంచి చెరో వైపు వెళ్తారు. యామిని జగద్ధాత్రి తండ్రి, మామయ్యని కలుస్తుంది. అంతా మీనన్ దగ్గర ఉంటారు. జేడీ కేడీలు బయట నుంచి ఒక్కో రౌడీ అంతు చూస్తూ వస్తుంటారు.
యామినితో జగద్ధాత్రి పన్ని మీనన్ అడిగింది చేయమని లేదంటే మమల్ని చంపేస్తాడు అంటుంది. యామిని సరే అత్తయ్యా అంటుంది. మీనన్ యామినికి ఫ్లైట్‌లోకి తీసుకెళ్లాల్సిన బాక్స్ ఇస్తాడు. సెక్యూరిటీ చెక్ దగ్గర మా వాళ్లు ఉంటారు అక్కడ నుంచి ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే అని అంటాడు. జగద్ధాత్రి తండ్రి ఆ పని చేయొద్దని అంటాడు. దాంతో మీనన్ వాళ్లని భయపెట్టడానికి గన్ పేల్చుతాడు. జేడీ, కేడీలు మీనన్ వాళ్ల దగ్గరకు వచ్చేస్తారు.
మీనన్ జేడీతో నువ్వు వస్తావని నాకు తెలుసు జేడీ అంటాడు. వీళ్లని కిడ్నాప్ చేసి తప్పు చేశావ్ మీనన్ అని కేథార్ అంటే నేను కాదు ఈ యామిని జేడీని నమ్మి తప్పు చేసిందని అంటూ యామినిని లాక్కొని గన్ గురి పెట్టి జేడీ, కేడీల గన్‌లు తీసుకుంటాడు. ఇక మీనన్ దేవాని పిలిచి జేడీ తల్లి, పిన్నిలను తీసుకెళ్లి పది నిమిషాల తర్వాత చంపేయమని యామినిని తాను తీసుకెళ్తానని అంటాడు. జేడీతో ముగ్గురిని కాపాడుతా అని చెప్పుంటావ్ కదా మొదటి సారి మాట తప్పడానికి రెడీగా ఉండు అని చెప్పి అందర్ని తీసుకెళ్లిపోతాడు.
జగద్ధాత్రి కేథార్ అండ్ టీమ్‌తో మీనన్ మన టైం వేస్ట్ చేయడానికి మీనన్ ఇద్దరిని రెండు కార్లలో తీసుకెళ్లమన్నాడు కానీ నిజానికి ఇద్దరినీ ఒకే కారులో తీసుకెళ్లాడని అది బ్యాక్ సైడ్ కారులో అని గెస్ చేసి చెప్తుంది. జేడీ తన ఇద్దరూ టీమ్ మేట్స్‌ని చెరో కారుని ఫాలో అవ్వమని అందులో ఎవరూ లేకపోతే చెప్పమని అంటుంది. తాను కేథార్ వేరే వైపు వెళ్తారు. మీనన్‌నే మనల్ని వెతుక్కుంటూ వస్తాడని అంటుంది. రమ్య, కిరణ్‌లు చెరో కారుని ఫాలో అయి ఎవరూ లేరని చెప్తారు. దేవా జగద్ధాత్రి పిన్ని, తండ్రిలను తీసుకొచ్చి చంపాలని అనుకుంటాడు. ఇంతలో జేడీ ఎంట్రీ ఇచ్చి నీ ప్రాణాలు పోకుండా ఎవరు కాపాడుతారు అని అంటుంది. దేవా షాక్ అయిపోతాడు.
కేథార్ దేవాకి గన్ గురి పెట్టి గన్ తీసుకుంటాడు. అందర్ని మోకాల మీద కూర్చొపెడతాడు. దేవా నోటిలో రుమాలు కుక్కి నీ గేమ్ అయిపోయింది ఇప్పుడు మేం ఆడుతాం చూడు అని దేవా నోటిని కట్టేస్తారు. తర్వాత జగద్ధాత్రి చనిపోయినట్లు కింద పడుకుంటుంది. కేథార్ మరో రౌడీతో ఫొటో తీయించి మీనన్‌కి కాల్ చేసి జేడీని కాల్చేశామని కేథార్‌ని పట్టుకోవడానికి దేవా అన్న వెళ్లాడని కాల్ చేయిస్తారు. దాంతో మీనన్ ఆ లొకేషన్‌కి బయల్దేరుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















