Jagadhatri Serial Today March 5th: ‘జగధాత్రి’ సీరియల్: దొంగచాటుగా జైలులోకి వెళ్లిన కేదార్, ధాత్రి – మీనన్ నుంచి సుధాకర్ ను సేవ్ చేసిన ధాత్రి
Jagadhatri Today Episode: కేదార్, ధాత్రి దొంగచాటుగా జైలులోకి వెళ్లి సుధాకర్ ను సేవ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇట్రెస్టింగ్ గా జరిగింది.
Jagadhatri Serial Today Episode: మీనన్ సింగ్ గెటప్ వేసుకుని జైలులోకి వెళ్లి సుధాకర్ షెల్‌లో కూర్చుంటాడు. దీంతో సుధాకర్ ఎవరు మీరు అని అడుగుతాడు.. నా పేరు మీనన్ అనగానే సుధాకర్ షాక్ అవుతాడు. మీనన్ గురించి ప్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. నేను ఒక బిజినెస్ మ్యాన్‌ని నాతో నీకేం పని అని అడుగుతాడు సుధాకర్. నీలాంట క్రిమినల్‌తో పరిచయం కూడా పెట్టుకోకూడదని అనుకుంటాను. అనడంతో మీనన్ పని నీతోనే కానీ చేయాల్సింది నీ కూతురు కౌషికి అనగానే సుధాకర్ నీ కూతురు జోలికి వస్తే బాగుండదు అనగానే కౌషికి చేతికి ఒక పెన్‌డ్రైవ్ వచ్చింది. అది ఇంకో గంటలో నా చేతికి రాకపోతే నిన్ను చంపేస్తానని నీ కూతురుకు చెప్పాను. ఇప్పటికే 40 నిమిషాలు అయిపోయాయి. ఇంక 20 నిమిషాలు మాత్రమే ఉన్నాయి అంటూ మీనన్ బెదిరిస్తాడు. ఇంతలో మీనన్ సుధాకర్‌ను కొట్టిస్తూ కౌషికి వీడియో కాల్ చేసి చూపిస్తాడు. కౌషికి బాధపడుతూ వచ్చేస్తున్నాను ప్లీజ్ మా బాబాయ్‌ని కొట్టకండి అని బయలుదేరుతుంది. మీనన్ సుధాకర్‌ను షెల్ నుంచి వేరే దగ్గరకు షిఫ్ట్ చేస్తాడు. కౌషికి జైలు దగ్గరకు వచ్చి ధాత్రికి ఫోన్ చేస్తుంది.
ధాత్రి: వదిన చెప్పండి.
కౌషికి: మీనన్ జైలు లోపలికి వెళ్లి బాబాయ్‌ని కొడుతున్నాడు జగధాత్రి. అది నాకు వీడియో కాల్ చేసి చూపించాడు.
ధాత్రి: కొడుతున్నాడా? మీరు పెన్‌డ్రైవ్ తీసుకుని లోపలికి వెళ్లండి వదిన.
కౌషికి: వాడికి పెన్‌డ్రైవ్ ఇచ్చి బాబాయ్‌ని కాపాడుకోవాలో? బాబాయ్ ని పణంగా పెట్టి నిజాన్ని కాపాడుకోవాలో తెలియడం లేదు జగధాత్రి.
అనగానే ధాత్రి వదిన మీరు లోపలికి వెళ్లండి నేను, కేదార్ వస్తున్నాం అని చెప్తుంది. దీంతో కౌషికి లోపలికి వెళ్తుంది. ఇంతలో ధాత్రి, కేదార్ జైలు దగ్గరకు వస్తారు. జైలరు లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడు దీంతో ఏం చేయాలో ఆలోచిస్తుంటారు ధాత్రి, కేదార్. మరోవైపు కౌషికిని లోపలికి తీసుకెళ్తుంటాడు జైలరు. మరోవైపు యువరాజ్ జైలు దగ్గరు వచ్చి చాటు నుంచి కేదార్, ధాత్రిలను గమనిస్తుంటాడు. కౌషికిని జైలరు మీనన్ దగ్గరకు తీసుకెళ్లి వదిలేస్తాడు. సార్ ఇంకా పది నిమిషాలే ఉందని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కేదార్, ధాత్రి గోడ పై నుంచి దూకి జైలు లోపలకి వస్తారు.
కౌషికి: మీనన్ నువ్వు మనిషివా? పశువువా? నేను పెన్‌డ్రైవ్ ఇస్తానని చెప్పాక కూడా మా బాబాయ్‌ని అలా కొట్టావు.
మీనన్: ప్రాణాలతో ఉన్నాడు సంతోషించు. పెన్‌డ్రైవ్ ఇచ్చి మీ బాబాయ్‌ని తీసుకెళ్లిపో..
సుధాకర్: అమ్మా కౌషికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. ఆ పెన్‌డ్రైవ్ వీళ్ల చేతికి ఇవ్వకు జనాలకు నిజాలు తెలియాలి. వాళ్లను ఎవరు ఎలా మోసం చేస్తున్నారో తెలియాలి.
మరోవైపు కేదార్, ధాత్రి ఒకవైపు, యువరాజ్ ఇంకవైపు జైలులో వెతుకుతుంటారు. ఇంతలో మీనన్ పెన్‌డ్రైవ్ ఇవ్వు అంటూ బెదిరించడంతో కౌషికి పెన్‌డ్రైవ్ ఇవ్వబోతుంటే ధాత్రి కేదార్ వచ్చి అడ్డుపడతారు. వాళ్లను చూసిని మీనన్ ఏయ్ జేడీ వచ్చేశావా? అనగానే కౌషికి షాక్ అవుతుంది. మీనన్ రౌడీలను కేదార్, ధాత్రి కొట్టి మీనన్ దగ్గరకు వెళ్లబోతుంటే మీనన్ కత్తి తీసి సుధాకర్ మెడపై పెడతాడు.
మీనన్: కౌషికి నీకు మరీమరీ చెప్పాను పోలీసులను వెంటబెట్టుకొస్తావా? నీకు మీ బాబాయ్ ప్రాణాల కంటే నీకు పెన్‌డ్రైవ్ ఎక్కువైందా?
అంటూ సుధాకర్ ను చంపబోతుంటే కౌషికి ధాత్రి దగ్గరకు వెళ్లి పెన్ డ్రైవ్ అతనికి ఇచ్చేయండి అని ప్రాధేయపడుతుంది. దీంతో మీనన్ ఇక్కడకు వచ్చి పెన్ డ్రైవ్ నా కాళ్ల దగ్గర పెట్టి నీ ముఖం చూపించు అంటాడు. దీంతో ధాత్రి మీనన్ దగ్గరకు వెళ్లి పెన్ డ్రైవ్ ఇస్తుంది. ఇక ముసుగు తీసెయ్ అనగానే ధాత్రి, కేదార్ ఇద్దరూ నేను తీస్తానంటే నేను తీస్తానని పోటీ పడుతూ మీనన్ దగ్గరకు వెళ్లి మీనన్ కొడతారు. సుధాకర్‌ను సేవ్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మహేష్ బాబు నా క్లాస్ మేట్, బెంచీలు ఎక్కి దూకుతూ అల్లరి చేసేవాళ్లం - కోలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్