అన్వేషించండి

Jagadhatri Serial Today April 2nd: జగద్ధాత్రి సీరియల్: కౌషికి సైట్‌లో సునీత డెడ్ బాడీ! రమేశ్, కౌషికిలను పోలీసులు అరెస్ట్ చేస్తారా!

Jagadhatri Serial Today April 2nd కౌషికి స్థలంలో సునీత డెడ్ బాడీ దొరకడం, దివ్యాంక వాళ్ల వచ్చి కౌషికిని అరెస్ట్ చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode: సునీత విషయంలో కౌషికి వెంకటేష్ వైపు ఉంటుంది. దివ్యాంకకు కౌషికి, ధాత్రి వార్నింగ్ ఇస్తాడు. నిషిక, యువరాజ్‌లు దివ్యాంకతో  ఇక్కడ వీళ్ల గురించి తెలిసి కూడా ఎందుకు వచ్చి మాటలు పడ్డావ్ అని అడుగుతారు. దానికి దివ్యాంక ఇంత పొగరు ఉన్న కౌషికిని చూస్తేనే కదా.. పొగరు దిగి ఓడిపోయి బాధ పడుతున్న కౌషికిని చూసి నేను ఆనంద పడేది.. నేను ముందు దివ్యాంకని కాదు.. ఈ సారి పక్కా ప్లాన్‌తో వచ్చా కౌషికి మీద గెలిచే తీరుతా అని అంటుంది. 

నిషిక దివ్యాంకతో వదినను తొక్కేయడానికి నీకు ఏం సాయం కావాలి అన్నా నేను చేస్తానని నిషిక అంటుంది. అవసరం అయితే అడుగుతా అని దివ్యాంక చెప్పి వెళ్లిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ దూరం నుంచి ఇద్దరు మాట్లాడుకోవడం చూసి దివ్యాంక ఏదో పెద్ద ప్లానే వేసింది మనం అలర్ట్‌గా ఉండాలి అని అనుకుంటారు. కౌషికి వాళ్లు తమ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న పనులు దగ్గరకు వస్తుంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. ఇక అనారోగ్యపాలైన వైజయంతిని కేథార్, జగద్ధాత్రి జాగ్రత్తగా చూసుకుంటారు. తోటలో తవ్వుతున్న కార్మికుల గునపానికి రక్తం అతుక్కుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. కౌషికిని పిలిచి విషయం చెప్తారు. కౌషికి ఆ ప్లేస్ మొత్తం తవ్విస్తుంది. అక్కడ ఓ అమ్మాయి శవం కనిపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కౌషికి వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని మేనేజర్‌కి చెప్తుంది. అందరూ నీడలో కూర్చొండి ఎవరూ ఎక్కడికీ వెళ్లొద్దు అని చెప్తుంది. 

కౌషికి వెంటనే తన బాబాయ్ సుధాకర్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. సుధాకర్ జగద్ధాత్రి, కేథార్‌లకు విషయం చెప్తాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. సైట్‌లో బాడీ దొరకడం ఏంటి నాన్న ఎవరు చేసుంటారు అని కేథార్ అంటే ఇంకెవరూ సైట్‌ ఓనరే అంటే వదినే అని అనుకుంటూ నిషిక ఎంట్రీ ఇస్తుంది. యువరాజ్‌ని సీఈఓని చేసుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు అని నిషిక అంటే వీళ్లకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు.. కౌషికి ఒక్కర్తే భయపడుతూ ఉంటుంది వెళ్దాం పదండి అని సుధాకర్ జగద్ధాత్రి వాళ్లని తీసుకెళ్తాడు. నిషిక యువరాజ్ కూడా వెళ్తారు. సైట్‌లో పోలీసులు బాడీని కలెక్ట్ చేసుకొని కౌషికితో మాట్లాడుతూ ఉంటారు. జగద్ధాత్రి వాళ్లు వచ్చి మన సైట్‌లో బాడీ ఏంటి అని అంటే దానికి కౌషికి ఎవరో కాదు నిన్న మన ఇంటికి వెంకటేష్ వచ్చి చెప్పిన సునీతదే ఈ బాడీ అని కౌషికి చెప్తుంది.  దాంతో అందరూ షాక్ అయిపోతారు. 

జగద్ధాత్రి బాడీ చూసి రాత్రే ఇదంతా జరిగినట్లు ఉంది.. బాడీని పాతిన వారు కంగారులో ఏదో ఒక క్లూ వదిలేసి ఉంటారు  అని జగద్ధాత్రి అంటుంది. దాంతో సుధాకర్ ఏంటమ్మా నువ్వు పోలీస్‌లా అన్నీ అడుగుతున్నావ్ అని అంటే వాళ్ల అమ్మ బుక్స్ చదవడం వల్ల ఇలా అలవాటు అయిందని కేథార్ కవర్ చేస్తాడు. బాడీ దగ్గర సాక్ష్యాలు సేకరిస్తున్న వారి మీద జగద్ధాత్రి, కేథార్‌లకు అనుమానం వస్తుంది. చూస్తూ కూడా ఏం చేయలేకపోతున్నాం అనుకుంటారు. దాంతో కేథార్ అవసరం అవుతాయని వాళ్ల పనితీరుని ఫొటోలు తీసుకుంటాడు. మరోవైపు దివ్యాంక నిషిన, యువరాజ్‌లను పిలిచి మాట్లాడుతుంది. మా సైట్‌లో నువ్వేమైనా ప్లాన్ చేశావని తెలిస్తే నేను ఊరుకోని అని యువరాజ్ అంటాడు. నిషిక యువరాజ్‌ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. యువరాజ్ భార్యతో ఈ బాడీ మన సైట్లో పెట్టించింది దివ్యాంకే  దీని వల్ల అక్క జైలుకి వెళ్తుంది కదా అని అంటాడు. అలా జరిగితే నీకే మంచిది కదా నువ్వు కంపెనీలను తీసుకొని సీఈఓ అవుతావు కదా అని దివ్యాంక యువరాజ్‌తో చెప్తుంది. అన్ని నీ కంట్రోల్‌లోకి వస్తే నువ్వే కౌషికి అవుతావు కదా అని అంటుంది. అక్కని ఇలా జైలుకి పంపి నేను గెలవాలి అనుకోవడం లేదు అని యువరాజ్ అంటే మీ అక్క కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు.. మా వదిన జైలుకి వెళ్లాలి నేను నీకు సాయం చేస్తా అని నిషిక దివ్యాంకతో చెప్తుంది. దివ్యాంక తన ప్లాన్‌ని యువరాజ్, నిషికలకు చెప్తుంది. 

డెడ్ బాడీ దగ్గరకు సురేష్ సునీత లవర్ రమేశ్‌ని తీసుకొస్తాడు. సునీత బాడీ చూసి రమేశ్ చాలా ఏడుస్తాడు. ఆ అమ్మాయి మీకు తెలుసా అని ఇన్‌స్పెక్టర్ అడిగితే దివ్యాంక ఎంట్రీ ఇచ్చి పోలీసులు అడుగుతున్నారు కదా చెప్పు కౌషికి అని దివ్యాంక అంటుంది. నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అని కౌషికి అడిగితే మీడియా పర్సన్‌గా నన్ను ఎవరూ ఆపలేరు అని దివ్యాంక అంటుంది. అయితే మొదలు పెట్టాల్సింది నీతోనే అని జగద్ధాత్రి అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు సెక్షన్‌ పేర్లు చెప్పి దివ్యాంకని వణికించేస్తారు. నిషిక సెక్షన్లు విని టీచర్లు అయిన వీళ్లకి ఇంత నాలెడ్జె ఎక్కడిది అని అనుకుంటుంది. దివ్యాంక ఇన్‌స్పెక్టర్‌తో కౌషికి, రమేశ్ ఈ నేరం చేశారు అరెస్ట్ చేయండి అని అంటుంది. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని రమేశ్, సునీత క్లోజ్‌గా ఉన్న వీడియోలు చూపిస్తుంది. తనని వాడుకొని రమేశ్ వదిలేశాడు అని ఆ అమ్మాయి ప్రాబ్లమ్ నుంచి బయట పడేయమని రమేశ్ కౌషికిని కలిశాడు అని అందుకు కౌషికి 50 కోట్లు డిమాండ్ చేసిందని చెప్తుంది. ఈ హత్యకి కౌషికికి ఏం సంబంధం లేదని కేథార్ అంటాడు. పోలీసులు కూడా కౌషికినే హత్య చేయించిందని నమ్మేస్తారు. మా అక్క ఆ అమ్మాయిని చంపింది అని సాక్యాలు ఉన్నాయి అని కేథార్ అడిగితే ఆ బాడీతో పాటు మాకు ఈ చెవి పోగు కూడా దొరికింది అని చూపిస్తారు. అది నాదే కానీ ఈ అమ్మాయి దగ్గరకు ఎలా వచ్చిందో తెలీదు అని కౌషికి అంటుంది. వదిన గదిలో ఉండాల్సిన జుంకా బాడీ దగ్గర ఉంది అంటే అర్థం లేదా అని నిషిక అంటుంది. పోలీసులు కౌషికి, రమేశ్‌ని అరెస్ట్ చేస్తామని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget