అన్వేషించండి

Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!

Kiraak RP Wedding: జబర్దస్త్‌లోని ఎంతోమంది కామెడియన్స్ పెళ్లి చేసుకొని, ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయారు. ఇక తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో కామెడియన్ చేరాడు. తనే కిరాక్ ఆర్‌పీ.

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్‌పీ సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఏ హడావిడి లేకుండా, ఎవరు సెలబ్రిటీలను పిలవకుండా నిరాడంబరంగా ఆర్పీ పెళ్లి చేసుకున్నాడు.

వైజాగ్‌లో సైలెంట్‌గా పెళ్లి..
కిరాక్ ఆర్‌పీ, లక్ష్మీ ప్రసన్న.. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరికి గతేడాది మేలో వీరి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన ఇన్నాళ్లకు వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారు. అయితే పెళ్లి సింపుల్‌గా జరిగిపోవడంపై ఆర్‌పీ స్పందించాడు. అమ్మాయిది వైజాగ్ అని చెప్పుకొచ్చాడు. గతేడాది వారి నిశ్చితార్థం జరిగిందని గుర్తుచేశాడు. వారు ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లిచేసుకుంటున్నారని బయటపెట్టాడు. ఎంగేజ్‌మెంట్‌తో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా సెలబ్రిటీలు వచ్చారని కానీ పెళ్లి మాత్రం సింపుల్‌గా చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అందుకే కేవలం బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరగడం కోసం వైజాగ్‌ను ఎంచుకున్నట్టు తెలిపాడు.

ఎందుకిలా అంటూ అనుమానాలు..
ఇక ఎంగేజ్‌మెంట్ అయిన ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో కిరాక్ ఆర్‌పీ చెప్పలేదు. ఆర్‌పీ.. జబర్దస్త్‌లో కామెడియన్‌గా చేస్తున్న సమయంలోనే లక్ష్మి ప్రసన్నతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇదే విషయాన్ని ఒక షోలో కూడా ఆర్‌పీ బయటపెట్టాడు. ఆర్పీ పెళ్లి గురించి తెలిసి జబర్దస్త్ ప్రేక్షకులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా ఎంగేజ్‌మెంట్ అయిన ఏడాదిన్నర తర్వాత పెళ్లి జరగడం, ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా పెళ్లి జరిగిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కామెడియన్ నుంచి బిజినెస్‌మ్యాన్‌గా..
బజర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా పలు విధాలుగా సెటిల్ అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఇంకా ఇండస్ట్రీలో కామెడియన్స్‌గా ఫిక్స్ అయిపోయారు. అలాగే కిరాక్ ఆర్‌పీ కూడా జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఒకరోజు సడెన్‌గా హోటల్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే పేరుతో హోటల్‌ను ప్రారంభించాడు. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి పలువురు సెలబ్రిటీలు హాజరవ్వడంతో దీని గురించి చాలామంది ప్రజలకు తెలిసింది. పైగా ఫుడ్ టేస్ట్ బాగుంది అని పాజిటివ్ రివ్యూలు వైరల్ అవ్వడంతో ఇప్పుడు అదే పేరుతో హైదరాబాద్‌లో పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు ఆర్‌పీ. ఆర్‌పీతో పాటు జబర్దస్త్ నుంచే ఒకేసారి బయటికి వచ్చేసిన కామెడియన్స్ ఎంతోమంది ఉన్నారు. వారంతా దాని నుంచి బయటికి వచ్చేసిన తర్వాత అవకాశాలు లేక మళ్లీ తిరిగి జబర్దస్త్‌లోనే అడుగుపెట్టారు. అయితే ఆర్‌పీ కూడా అలాగే చేస్తాడని చాలామంది ప్రేక్షకులు అంచనా వేశారు కానీ తను మాత్రం ఫుడ్ బిజినెస్‌లో లాభాలతో అక్కడే సెటిల్ అయిపోయాడు.

Also Read: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget