Illu Illalu Pillalu Serial Today September 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఓరేయ్ నాయనా.. అది గవర్నమెంట్ ఎగ్జామ్ అనుకున్నారా! లవర్స్ స్పాట్ అనుకున్నారా!
Illu Illalu Pillalu Serial Today Episode September 9th ప్రేమ కల్యాణ్‌ని వెంటపడి తరమడం, సాగర్ పరీక్ష రాయడం వల్లీ ఫాలో అయి చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి పరీక్షా సెంటర్‌కి వెళ్తాడు. ఎగ్జామ్ పేపర్ చూసి దేవుడా ఒక్కటి కూడా రాదే అనుకుంటాడు. దిక్కులు చూస్తాడు. పరీక్ష సెంటర్ బయట ఖాళీ ప్లేస్ నుంచి తన భార్య నర్మద సైగలు చేస్తూ లవ్‌యూ అని చెప్తూ ఉంటుంది.
సాగర్ కూడా నర్మదని చూస్తూ మురిసిపోతూ నర్మద నా మీద చాలా హోప్స్ పెట్టుకుంది నాకు ఒక్కటి రాదు.. ఎలారా దేవుడా అనుకుంటాడు. ఇక దేవుడిదే భారం అని అనుకొని ఆన్సర్ షీట్‌లో బ్లాంక్స్ నింపేస్తుంటాడు. పరీక్ష అయిపోయిన తర్వాత నర్మద ఎలా రాశావ్ పాస్ అయిపోతావా.. అంతా హ్యాపీ కదా అని గెంతులేసేస్తుంది. నర్మద వాళ్లని వల్లీ ఫాలో అయి సాగర్ పరీక్ష రాశాడని తెలిసి కుళ్లుకుంటుంది. 
వల్లి మనసలో అచ్చ బాబోయ్ అంటే ఈ నర్మద సాగర్‌తో పరీక్ష రాయించిందా.. ఎన్ని కట్టు కథలు అల్లేశారు.. మామయ్య గారికి చెప్పకుండా ఈయన గారితో ఏదో ఉద్యోగం చేయించాలని చాలా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ కల్యాణ్‌ని తరుముకుంటూ వస్తుంది. కల్యాణ్ వల్లిని ఢీ కొట్టేయడంతో వల్లి కింద పడిపోతుంది. కల్యాణ్‌ని తిడుతుంది. ఇంతలో ప్రేమ వాడిని తరుముకుంటూ రావడం చూసి అచ్చబాబోయ్ పేమ అని అనుకుంటుంది. ప్రేమ వాడిని తరమడం వెనక ఏదో ఉంది అది కనిపెడితే మనకు చాలా యూస్ అవుతుందని మంట పెట్టేయొచ్చు అని అనుకుంటుంది. ఇద్దరు తోటి కోడళ్లను టార్చర్ చేయాలని అనుకుంటుంది.
ప్రేమ కల్యాణ్‌ని తరుముకుంటూ వెళ్లడం ధీరజ్ ఫ్రెండ్ చూస్తాడు. వెంటనే ధీరజ్‌కి కాల్ చేసి ప్రేమ ఎవడి వెనక పరుగెడుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్తాడు. ఏ ఏరియా అని ధీరజ్ వస్తాడు. ప్రేమ తరుముతూ ఓ చోట కింద పడిపోతుంది. ధీరజ్‌తో పాటు అందరూ వస్తారు. ప్రేమకి చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఏమైంది.. ఈ దెబ్బలు ఏంటి అని ధీరజ్ అడిగినా ప్రేమ వినిపించుకోకుండా కల్యాణ ఎటు వెళ్లాడనే చూస్తుంది. ఇంతలో ధీరజ్ ప్రేమని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ప్రేమ మనసులో కల్యాణ్ దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు.. ఛా అని అనుకుంటుంది. 
సాగర్ పరీక్ష సరిగా రాయలేదని డల్‌గా ఉంటే నర్మద మాత్రం సాగర్ పరీక్ష బాగా రాశాడని పొంగిపోతుంది. సాగర్‌ని చూసి ఏమైంది అని ఎందుకు అలా ఉన్నావ్ అంటే నేను పరీక్ష సరిగా రాయలేదు నర్మద.. నేనో వేస్ట్ ఫెలోని ఆవేశంలో ఎన్నో మాటలు చెప్తాను కానీ ప్రాక్టికల్‌కి వచ్చే సరికి ఏం చేయలేను.. చేత కాని వాడిని అని తిట్టుకుంటాడు. పరీక్ష బాగా రాయలేదు అని చెప్తాడు. నర్మద సాగర్‌తో నువ్వేం బాధ పడకు కాంపిటేటివ్ పరీక్ష రాసేసినంత మాత్రానా గవర్నమెంట్ ఉద్యోగం రాదు.. ఒక్క సారికి అస్సలు వచ్చేయదు ఇంకో ఆరు నెలల్లో మరో నోటిఫికేషన్ ఉంది.. అప్పటి వరకు బాగా చదువుకో అని అంటుంది. సాగర్, నర్మదతో నేను జాబ్ కొడతాను కదా అప్పుడు మనం కారు కొంటాం.. నువ్వు నేను షికారుకి వెళ్తాం అని చెప్తాడు. నువ్వు అనుకున్నట్లే అన్నీ చేస్తావ్ అని నర్మద అంటుంది. 
ధీరజ్ ప్రేమ కోసం చాలా టెన్షన్ పడతాడు.మొన్న అర్ధరాత్రి ఇలాగే పరిగెత్తావ్.. ఇప్పుడు ఇలా ఏమైంది.. నీ భయానికి కారణం ఏంటి అని అడుగుతాడు. నీకు చెప్పడం ఇష్టం లేదా నాతో చెప్పడం ఇష్టం లేదా.. నిన్ను చూస్తే నాకు చాలా టెన్షన్‌గా ఉంది. నీకు నీ ప్రాబ్లమ్ నాకు చెప్పాలి అని లేదా అని అడుగుతాడు. ప్రేమ ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. ధీరజ్ ఎంత అడిగినా ప్రేమ చెప్పదు. నేను నీకు ఏం కానా.. చివరి సారి అడుగుతున్నా చెప్పు.. నేను నీకు ఏం కానా అని అడుగుతాడు. ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















