Illu Illalu Pillalu Serial Today November 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: తోటికోడల్ని కాపాడటానికి తండ్రిని అరెస్ట్ చేయించిన ప్రేమ! నడిరోడ్డు మీద హైడ్రామా!
Illu Illalu Pillalu Serial Today Episode November 11th నర్మద సేనాపతిని అరెస్ట్ చేయించిడం ప్రేమ వల్లే తను దొరికిపోయాడని నర్మద చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద ఏ తప్పు చేయలేదు అని నిరూపణ అవుతుంది. వేదవతి చాలా చాలా సంబరపడిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు కానీ శ్రీవల్లి షాక్‌లో ఉండిపోతుంది. 
భద్రావతి, సేనాపతి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నర్మదకు ఈ కేసులో నుంచి బయట పడటానికి ఒక్క శాతం కూడా ఛాన్స్ లేదు మరి ఎలా బయట పడిందో ఏంటో అని అనుకుంటారు. శ్రీవల్లి కర్రకట్టేసి ఉంటే భాగ్యం, ఇడ్లీబాబాయ్ వెళ్తారు. జస్ట్ మిస్ అని శ్రీవల్లి తల్లితో చెప్పి తెగ బాధ పడిపోతుంది. చెప్పానా చిరుతపులి చితక్కొట్టేస్తుందని అని ఇడ్లీబాబాయ్ నర్మద గురించి అంటే భాగ్యం భర్తని వాయించేస్తుంది. 
నర్మదని లంచం కేసులో ఇరికించిన వాళ్లని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని న్యూస్‌లో చూసిన సేనాపతి అక్కతో నర్మదని ఇరికించాలని ఇలా చేశాం కానీ ఇది మన మెడకు చుట్టుకునేలా ఉంది అక్క అని టెన్షన్ అయిపోతాడు. ఇంతలో పోలీసులు భద్రావతి ఇంటికి వెళ్లడం భాగ్యం, ఇడ్లీబాబాయ్ చూసి ఇంట్లో అందర్ని పిలుస్తారు. పోలీసులు మీ పుట్టింట్లోకి వెళ్లారని వేదవతితో చెప్తారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అప్పుడే రామరాజు వస్తాడు.
వేదవతి రామరాజుతో జరిగింది అంతా చెప్తుంది. మా పుట్టింటి వాళ్లు కుట్ర చేస్తే నర్మద తిప్పి కొట్టిందని చెప్తుంది. ఇక పోలీసులు సేనాపతితో మిమల్ని అరెస్ట్ చేయాలి అంటాడు. నా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని భద్రావతి అంటుంది. అవన్నీ స్టేషన్‌లో చెప్తాం అని పోలీసులు అంటారు. అయినా సరే సేనాపతి గట్టిగా మాట్లాడతాడు. పోలీసులు సేనాపతిని లాక్కెళ్తారు. 
ఇంతలో నర్మద వస్తుంది. డైరెక్ట్‌గా సేనాపతి దగ్గరకు వెళ్లి సింహం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిన మీకే అన్ని తెలివి తేటలు ఉంటే కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న నాకు ఎన్ని తెలివి తేటలు ఉంటాయి సార్.. మీ ప్లాన్‌ని తిప్పి కొడతాను అని మీరు ఊహించకపోతే ఎలా సార్.. మూడో కంటికి తెలీకుండా చాలా జాగ్రత్తగా ఇరికించాం కదా ఎలా తప్పించుకుంది అనుకుంటున్నారా.. మీరు ఈ కుట్ర చేయడానికి వేసిన డబ్బుని ఆ బ్యాంక్ డిటైల్స్‌ని లైట్ తీసుకున్నారు.. నాకు అవి ఆయుధం అయ్యావి.. మీ అరెస్ట్‌కి కారణం అయ్యావి అని నర్మద చెప్తుంది. 
సేనాపతి మనసులో నా ఫోన్‌లో డిటైల్స్ తనకు ఎలా తెలిశాయి అని సేనాపతి అనుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో నర్మద ప్రేమకి సాయం అడగడం ప్రేమ ధీరజ్‌తో గొడవ పడి పుట్టింటికి వెళ్లినట్లు ఇంటికి వెళ్లి తండ్రి ఫోన్‌లో డిటైల్స్ తీసుకుంటుంది. ఈ విషయం నర్మద చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు.
రామరాజు సేనాపతి దగ్గరకు వెళ్లి గవర్నమెంట్ స్థలం కబ్జా చేయడమే కాకుండా నా కోడల్ని జీవితాంతం జైలు పాలు చేయాలి అనుకుంటారా.. నా భార్య ముఖం చూసి నేను మీరు ఎన్ని మాటలు అన్నా పడుతున్నా కానీ నా కోడలు అలా కాదు ఇకనైనా జాగ్రత్త అని అంటాడు. ఇక సేనాపతి ప్రేమని చూసి దండం పెట్టి అమ్మా థ్యాంక్స్ అమ్మా నాన్నకి మంచి మర్యాద ఇచ్చావ్ అని అంటాడు. ఇక సేనాపతిని పోలీసులు తీసుకెళ్తారు.
నర్మద వల్లీ వాళ్ల దగ్గరకు వెళ్లి జంతర్‌మంతర్ ఫ్యామిలీ తర్వాత టార్గెట్ మీరే.. వల్లి అక్కాయ్ నువ్వు ఏదో విషయంలో ఏదో చేస్తున్నావ్ అని నాకు చాలా డౌట్ ఉంది.. ఇక నుంచి ఓ కన్ను నీ మీద కూడా వేసుంటా అని అంటుంది. శ్రీవల్లి వణికిపోతుంది. శ్రీవల్లి ఏడుస్తూ గదిలోకి వెళ్లి దుప్పటి కప్పేస్తుంది. భాగ్యం వెళ్లి చూసి దుప్పటి లాగితే నేనేం చేయలేదు నాకేం తెలీదు మొత్తం మా అమ్మే చేసింది అని అరుస్తుంది. ఏంటే ఏమైంది అమ్మడూ అని భాగ్యం అడుగుతుంది.
నర్మద ఉద్యోగం లేకుండా చేయాలని భాగ్యం కండీషన్ పెట్టిన సంగతి శ్రీవల్లి గుర్తు చేస్తుంది. ఇక నర్మద మనల్ని అరెస్ట్ చేయిస్తుంది అంటే అలా ఏం కాదు అని భాగ్యం అంటుంది. నా కాపురానికి నేనే కొరివి పెట్టేసుకున్నా దేవాడా అని వల్లీ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















