అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నగలు పుట్టింటివాళ్ల మీద విసిరి కొట్టిన ప్రేమ! ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం రామరాజుకి తెలిసిపోతుందా!

Illu Illalu Pillalu Serial Today Episode may 9th ప్రేమ ప్రతీ సారీ నగలతోనే గొడవ అని నగలు వద్దూ అంటూ విసిరి కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రోజుకో గొడవతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే ప్రేమ తన మేనత్త, తండ్రికి ధీరజ్ గురించి చెప్పాలని ప్రయత్నిస్తుంది. వద్దని ధీరజ్ అంటే నీకు వీళ్ల గురించి చెప్పాలి.. నీ మంచితనం ఏంటో వీళ్లకి తెలియాలి.. నీ కాళ్లు కడిగి వీళ్లు నెత్తిన చల్లుకోవాలి అని అంటుంది. ఏం అవసరం లేదు ఇంట్లోకి పద అని ధీరజ్ ప్రేమని ఆపేస్తాడు. దాంతో ప్రేమ ప్రతీ సారీ ఈ గొడవ అంతా ఈ నగల కోసమే కదా నాకు ఈ నగలు ఏం అవసరం లేదు అని వాటిని భద్రావతి కాళ్ల దగ్గర విసిరేస్తుంది. 

భద్రావతి కోపంగా నువ్వు లక్ష్మీ దేవిలా కలకల్లాడు ఉండాలని చేయించిన నగలే అవి అంతే కానీ ఎవరో తాకట్టు పెట్టుకోవాలని కాదు.. చేతకాని తండ్రి చేతకాని కొడుకులు అని భద్రావతి వెళ్లిపోతుంది. రామరాజు, ప్రేమ, ధీరజ్ కూడా లోపలికి వెళ్లిపోతాడు. రేవతి కింద పడిన నగలు తీసి అమూల్యకి ఇచ్చి ఇవి తీసుకొని లోపల పెట్టమ్మా అని చెప్పి వెళ్లిపోతుంది. రామరాజు ఇంట్లోకి వెళ్లి ఆలోచిస్తూ నిల్చొని ఉంటే అందరూ రామరాజు దగ్గరకు వెళ్లి తన దగ్గర నిల్చొంటారు. వేదవతి ప్రేమతో నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందే ఎందుకు ఇలా చేశావ్ అని అడుగుతుంది. అత్తయ్యా ధీరజ్ కోసం అని చెప్పింది కదా.. తను మంచి ఉద్దేశంతో చేసింది కానీ ఇలా అయింది ఇక వదిలేయండి అని అంటుంది నర్మద. తను మంచే చేసిందికానీ అర్థం చేసుకునే మనసు ఎదురింటి వాళ్లకి లేదు.. మీ మామయ్యని అవమానించడానికి కాచుకొని కూర్చొన్నారు అని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని వేదవతి  అంటుంది. 

ధీరజ్ తండ్రి దగ్గరకు వెళ్లి సారీ నాన్న తనేదో తెలీక చేసింది అని అంటే ఏంట్రా తెలీక చేయడం.. మీరు అసలు నిజంగా భార్యాభర్తలేనా.. ఎవరి సొంత నిర్ణయాలు వాళ్లు తీసుకుంటారా.. ఎవరి పెత్తనాలు వాళ్లవేనా.. మంచి చెడుల కోసం మొగుడు పెళ్లాలు అసలు మాట్లాడుకోరా.. ఈ నగల విషయంలో ఒక రోజు అంతా నేను పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాను.. నా కుటుంబం పోలీస్ స్టేషన్ బయట పడిగాపులు కాసింది.. ఆ నగల విషయంలో అన్ని సార్లు గొడవ అయినప్పుడు కూడా ఎవరైనా వాటిని ముట్టుకుంటారా.. తీసుకెళ్లి తాకట్టు పెట్టాలి అని ఎవరైనా అనుకుంటారా అని రామరాజు అడుగుతాడు. ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళ్లి అలా చూస్తాడు. తిరుపతి ధీరజ్‌తో ప్రేమ చాలా అమాయకురాలురా.. నువ్వు కారు కొనడానికి ఇబ్బంది పడుతుంటే అలా చేసింది ఏం అనొద్దురా అని అంటాడు. 

ధీరజ్ అమూల్యతో ఆ నగలు ఇలా ఇవ్వు అమూల్య అని వాటిని తీసుకొని చూస్తూ నా కోసమే చేశావా అని అడుగుతాడు. అవునురా.. కారు డౌన్ పేమెంట్ ఈ రోజు లాస్ట్ కదా.. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశానురా.. అయినా భార్యగా నీ కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారురా అని అంటుంది. ధీరజ్ ప్రేమ నగలు అన్నీ ప్రేమకి అలంకరిస్తాడు. అందరి ముందు ప్రేమని దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెడతాడు. ఇంకెప్పుడూ వద్దు అన్న పని చేయొద్దు.. మనం సమస్యల్లో పడినా.. పర్లేదు.. మన వల్ల ఎవరూ సమస్యల్లో పడకూడదు.. మనం బాధ పడినా పర్లేదు మన వల్ల ఇంకెవరూ బాధ పడకూడదు అని అంటాడు. నర్మద సాగర్‌తో ఇంకోసారి తప్పు చేయొద్దు అని ధీరజ్ ప్రేమతో ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూడు.. నువ్వు మాత్రం గొడవ పెట్టుకొని మేడ మీదకు వెళ్లిపోతావ్ అని అంటుంది. వల్లీ మనసులో ధీరజ్ ప్రేమని కళ్లలో పెట్టుకొని చూసుకుంటున్నాడు.. నేను చిన్న తప్పు చేస్తే మా ఆయన నన్ను పుట్టింటిలో వదిలేసేవాడు అని అనుకుంటుంది. 

ప్రేమ వేదవతితో అత్త మీ అబ్బాయి స్థానంలో ఇంకెవరు అయినా ఉండుంటే నన్ను పుట్టింటిలో వదిలేసేవాళ్లు. ధీరజ్ మాత్రం నన్ను ఇంతలా అర్థం చేసుకుంటాడు. ఇలాంటి మంచి వాడిని డబ్బు కోసం ట్రాప్ చేశాడు అని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. రేయ్ నువ్వు ఎందుకు ఊరుకున్నావ్‌రా.. మన పెళ్లి ఎలా అయిందో చెప్పొచ్చు కదా అని అంటుంది.  వేదవతి, నర్మద ఈ విషయం ఇక వదిలేయ్ అని ప్రేమని ఆపుతారు. కానీ ప్రేమ మాత్రం ఈ రోజు కాకపోతే రేపు అయినా తెలియాలి కదా ఇప్పుడే అందరికీ చెప్పేస్తా అని వెళ్తుంటే వేదవతి ఆపుతుంది. రామరాజు ప్రేమ దగ్గరకు వెళ్లి ఎప్పటికైనా తెలియాల్సిందే అంటున్నావ్.. అంటే మీ పెళ్లి వెనక ఏమైనా మతలబు ఉందా.. మీరు ఇద్దరూ నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా అని రామరాజు అడుగుతాడు. 

నర్మద రామరాజుతో అది కాదు మామయ్య వీళ్లిద్దరి పెళ్లి జరగదు ఏమో అని ప్రేమ ఏదో చేసుకోవాలని అనుకున్నప్పుడు ధీరజ్ ప్రేమ మెడతో తాళి కట్టేశాడు అని అంటుంది. దానికి వల్లీ కోసం వచ్చిన అమ్మాయి.. అమూల్యని విశ్వక్ లేపుకెళ్లినట్లు ధీరజ్ ప్రేమని లేపుకెళ్లాడా.. అమూల్య లేచిపోవడం వెనక నీ హస్తం ఉందంట కదా ప్రేమ.. అని అంటుంది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని నర్మద కోపంగా అడిగితే వల్లీ ఏం అనొద్దు అని ఆపుతుంది. భాగ్యం పోయింది అంటే ఈ సుకన్య వచ్చింది.. ఇది ఇంకా పుల్లలు పెడుతుందే అని అనుకుంటుంది. వల్లీ సుకన్యని పక్కకి తీసుకెళ్లి.. ఓసేయ్ అమూల్య విషయం ఎందుకు మాట్లాడావే.. అమూల్య విషయంలో నేను మొత్తం చేశాను అని ఇంట్లో తెలుసే నువ్వు ఎక్కువ మాట్లాడకు అని అంటుంది. అత్త అన్నీ చెప్పింది కానీ ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు ఏంటా అని అంటుంది. చందు వచ్చి ఎవరు తిను అని అడిగితే వల్లీ పరిచయం చేస్తుంది. చందు సుకన్యతో వీళ్ల అమ్మానాన్నలు అస్సలు మంచి వాళ్లు కాదు.. మీరు అయినా కొంచెం మంచి చెప్పండి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

మరిన్ని ఆసక్తికరమైన సీరియల్స్‌, నటుల వ్యక్తిగత జీవితాలు, మరిన్ని సంగతల కోసం తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget