అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లీ బాగోతం తెలుసుకున్న చందు! స్కూల్ దగ్గర హైడ్రామా!

Illu Illalu Pillalu Serial Today Episode March 30th వల్లీ సర్టిఫికేట్లు ఫేక్ అని తెలుసుకున్న చందు వల్లీని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode సాగర్ తన పర్సులో డబ్బులు లేవు అని నర్మదకు చెప్పలేక డబ్బులు అడగలేక ఇబ్బంది పడతాడు. నర్మదకి పర్సు చూడమని అంటాడు. నర్మద చూసి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. మనసులో అందుకేనా అబ్బాయి గారు గడప దాటడం లేదు అని వెయ్యి రూపాయలు పర్సులో పెట్టి బట్టలు ఉతుకుతూ ఉంటే నీ షర్టు జేబులో దొరికాయని పెడుతుంది. నాకు శాలరీ రాగానే ఇచ్చేస్తా అని సాగర్ అంటాడు. అయితే ఒక ముద్దు ఇచ్చి తీసుకో అని అంటుంది. అయితే నాకు డబ్బులు వద్దు అని సాగర్ అంటే మన వార్ వారే ముద్దు ముద్దే ముద్దు పెట్టి తీసుకో అని అంటుంది. దాంతో సాగర్ ముద్దు పెట్టి పర్సు తీసుకుంటాడు. 

చందు శ్రీవల్లిని స్కూల్‌ దగ్గర డ్రాప్ చేస్తాడు. చందు ఇలా డ్రాప్ చేసి వెళ్లగానే శ్రీవల్లి పుట్టింటికి పారిపోతుంది. నర్మద, ప్రేమలు వల్లీ పరుగు మొదలు పెట్టింది కదా ఇక మరోసారి పరుగు పెట్టిద్దామా అని అంటే ఆ వల్లీకి నేను ప్రీ క్లైమాక్స్ ఫిక్స్ చేశా అని చందుకి కాల్ చేసి వల్లీ అక్క కళ్లు తిరిగి పడిపోయింది అంట నాకు కంగారుగా ఉంది స్కూల్ దగ్గరకు వెళ్లండి బావ అని పంపిస్తుంది. చందు కంగారుగా స్కూల్ దగ్గరకు వెళ్తాడు. శ్రీవల్లి కోసం మొత్తం వెతుకుతాడు. వేరే మేడంని వల్లీ గురించి అడుగుతాడు. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని మేడం చెప్తుంది. ఇక ప్రిన్సిపల్‌ని చందు అడుగుతాడు. చాలా రోజుల క్రితం మీ భార్య ఇక్కడ చెప్పారు.. కానీ తను మానేసింది. తను మానేశాక ఎంక్వైరీ చేస్తే తెలిసింది తన సర్టిఫికేట్లు ఫేక్ అని ఒక వేళ తను మళ్లీ వస్తాను అన్నా మేం తీసుకోం.. మీరు తీసుకోండి.. ఈ సర్టిఫికేట్లు అని చందు చేతిలో పెట్టేస్తాడు. వల్లీ మాటలు గుర్తు చేసుకొని చందు షాక్ అయిపోతాడు. 

ప్రేమ నర్మదతో ఆ వల్లీ చదువు సర్టిఫికేట్లు ఫేక్ అని.. అన్నీ అబద్ధం అని చందు బావకి తెలిసిపోయింటుందని అంటుంది. ఇక నర్మదకు చందు ఫోన్ చేస్తాడు. నర్మదతో వల్లీ సర్టిఫికేట్లు అన్నీ ఫేక్ అంటున్నారు అని చందు అంటే.. అదంతా నాకు తెలుసు బావ.. మీకు తెలియాలి అని స్కూల్ దగ్గరకు పంపిచా అని అంటుంది. వల్లీ చదువు అంతా అబద్ధం అని నీకు తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు అని చందు అడిగితే దాని కంటే ముందు మీకు  చెప్పాల్సినవి చాలా ఉన్నాయి బావ.. ముందు మీరు వల్లీ వాళ్ల పుట్టింటికి వెళ్తే చాలా తెలుస్తాయి అని అంటుంది. చందు షాక్ అయి బయల్దేరుతాడు. 

వల్లీకివ భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఇద్దరూ రెండు ప్లేట్స్‌లో స్నాక్స్ పెట్టి తినిపిస్తూ ఉంటారు. వల్లీ తల్లితో నర్మద, ప్రేమల దెబ్బకి ఊపిరి తీసుకునే టైం కూడా లేదు.. అంతా మ్యూజిక్‌నే అని చెప్తుంది. చందు కోపంగా శ్రీవల్లి పుట్టింటికి బయల్దేరుతాడు. చందు వల్లీని పుట్టింట్లో చూసి షాక్ అయిపోతాడు. లోపలికి వెళ్లకుండా బయట నుంచే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావ్ వల్లీ అంటే ఇప్పుడే కదా బావ స్కూల్ దగ్గర డ్రాప్ చేశావ్.. పిల్లలకు పరీక్షలు అని చదివిస్తున్నా.. అని తెగ నటించేస్తుంది. మెలికలు తిరిగిపోయి నువ్వు గుర్తొచ్చేస్తున్నావ్ బా అని బుట్టలో వేయాలని చూస్తుంది. ఇంతలో ఇడ్లీబాబాయ్ అల్లుడిని చూసేస్తాడు. భార్యకి చూపిస్తాడు. భాగ్యం కూడా షాక్ అయిపోతుంది. చందు ఇంట్లోకి రాగానే శ్రీవల్లి చూసి షాక్ అయిపోతుంది. చందు వల్లీ దగ్గరకు వెళ్లి ఇదేనా స్కూల్ వీళ్లేనా పిల్లలు.. వీళ్లకేనా నువ్వు పరీక్షలు పెట్టేది అని అడుగుతాడు. కళ్లు తిరిగి కింద పడిపోయాను అని అందుకే ఇక్కడికి వచ్చాను.. నేను అంటే నీకు బోలెడు లవ్వు కదా బా.. నువ్వు తట్టుకోలేవని నీకు అబద్ధం చెప్పాను అని అంటుంది. దానికి చందు.. శ్రీవల్లి చేయి పట్టుకొని నీ హెల్త్ బాలేనప్పుడు నువ్వు స్కూల్‌కి వెళ్లడం ఎందుకు.. మానేద్దువు గానీ.. సర్టిఫికేట్లు తీసుకుందాం పద అని వల్లీని తీసుకెళ్తాడు. 

భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఇద్దరూ పరిస్థితులు తేడా కొట్టేశాయని అనుకుంటారు. శ్రీవల్లిని చందు స్కూల్ దగ్గరకు తీసుకొస్తాడు. శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది. నీ సర్టిఫికేట్లు తీసుకొద్దాం పద అని అంటే వల్లీ వద్దు అని ఆపుతుంది. నేను ఈ జాబ్ మానేస్తే మామయ్య గారు బాధ పడతారు  అని అంటుంది. నువ్వు జాబ్ మానేస్తే మా నాన్న ఎందుకు బాధ పడతారు అని చందు అడుగుతాడు. శ్రీవల్లి మనసులో సెంటి మెంట్‌కి పడ్డాడని అనుకొని మామయ్యగారు చెప్పడం వల్లే కదా నాకు టీచర్ జాబ్ వచ్చింది.. ఇప్పుడు నేను మానేస్తే ప్రిన్సిపల్ దగ్గర తన పరువు పోయింది అని మామయ్య బాధ పడరా చెప్పు..అందుకే నాకు బాలేకపోయినా మామయ్యగారి ఆనందం కోసం నేను కష్టపడతా అని అంటుంది. నా భార్య కష్టపడితే నేను చూడలేను పద నీ ఎంఏ సర్టిఫికేట్ తీసుకొద్దాం పద అని శ్రీవల్లిని తీసుకెళ్తాడు. శ్రీవల్లి వద్దు అని ఆపుతుంది. ఏంటి స్కూల్ దగ్గర సర్టిఫికేట్లు లేవా.. నా దగ్గర ఉన్నాయి అని చందు తీసుకొచ్చి నీ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకో అని వల్లీ ముఖం మీద కొడతాడు. వల్లీ షాక్ అయిపోతుంది. బా ఈ సర్టిఫికేట్ల గురించి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. నాకు ఎలా తెలుసా..ఈ మాట అడగటానికి నీకు సిగ్గు లేదా అని చందు లాగిపెట్టి కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget