Illu Illalu Pillalu Serial Today July 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: రాజమాత వల్లీ కొత్త ఆర్డర్లు.. ప్రేమని గెంటేసి డోర్ లాక్.. ధీరజ్ పరిస్థితేంటి!
Illu Illalu Pillalu Serial Today Episode July 26th వల్లి ప్రేమని బయట పెట్టి డోర్ లాక్ చేయడం, ప్రేమ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ నర్మద పిలుస్తున్నా పలకకుండా నడి రోడ్డు మీద తనని పట్టించుకోకుండా వదిలేస్తాడు. శ్రీవల్లి తల్లి భాగ్యం నర్మద దగ్గరకు వచ్చి ఇలాంటి బతుకు బతికే కంటే చావడం మంచిది అంటూనే నువ్వు అలాంటి పని చేయకు అని అంటుంది.
భాగ్యం నర్మదతో మీద ప్రేమ పెళ్లి కదా పైగా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా.. ఎంతో ప్రేమ చూపించాలి కానీ ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తున్నాడు.. ఇంట్లో కూడా అత్తామామలు పట్టించుకోరంట కదా పాపం.. ఇప్పుడు ఆ ఇంట్లో నీది ఏకాకి బతుకే కదా నీకు ఎంత దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందమ్మా అని దెప్పిపొడుస్తుంది. వారం క్రితం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబం నా అండ.. అడ్డుగా నిల్చొంటా అది ఇదీ అన్నావ్ నాతో తొడకొట్టి శపథాలు చేశావ్ ఇప్పుడేంటి నీ పరిస్థితి అని అంటుంది. టైం ఎప్పుడూ మనకే కలిసొస్తుందని ఎగిరి పడొద్దు అని అంటుంది. నీ గురించి నీ మొగుడు గురించి చూసుకోకుండా వాళ్ల బంఢారం బయట పెడతా వీళ్ల బండారం బయట పెడతా అని దూరితే ఇలాగే ఉంటుందని అంటుంది. జింకకి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయని పులిని వేటాడేయాలి అనుకుంటే ఇలాగే ఉంటుందని పులి ఎవరో జింక ఎవరో తెలుసు కదా అంటుంది.
భాగ్యం వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి ఏది బుసలు కొట్టు చిటెకలు వేసి చివరి డైలాగులు కొట్టు ఏంటి సైలెంట్ అయిపోయావ్.. అని నర్మదని అంటూ వెళ్లిపోతుంది. ఇక ఇంటి దగ్గర ప్రేమ సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చందు ల్యాప్‌టాప్ చూస్తుంటాడు. తిరుపతి, అమూల్య టీవీ చూసి నవ్వుకుంటూ ఉంటారు. వల్లి చూసి ఇళ్లంతా ఇంత సంతోషంగా ప్రశాంతంగా ఉంటే ఎలా అత్తయ్య మామయ్యలు ఆ నర్మద, ప్రేమని క్షమించేస్తారు అని అనుకొని పది అయింది అని భర్తని గదిలోకి పంపేస్తుంది. తిరుపతి, అమూల్యలు టీవీ చూస్తుంటే ఆపేస్తుంది. మామయ్యకి చెప్తా అని బెదిరించి ఇద్దరినీ పంపేస్తుంది.
ప్రేమ దగ్గరకు వెళ్లి పది అయింది లోపలికిరా తలుపు వేసి తాళం వేయాలి అంటుంది. ధీరజ్ ఇంకా రాలేదని ప్రేమ అంటే రూల్ అంటే రూల్ అంటుంది. ధీరజ్ డెలివర్ బాయ్ కదా లేటు అవుతుందని అంటుంది. టైం అంటే టైం అంతే అని అంటుంది. నేను ఉండగా నువ్వు ఎలా తలుపు తాళం వేస్తావో చూస్తా అని ప్రేమ తలుపునకు అడ్డంగా నిల్చొంటుంది. దాంతో వల్లి ప్రేమను బయటకు గెంటేసి తలుపు వేసేస్తుంది. మరోవైపు నర్మద సాగర్‌ని తనని పట్టించుకోకపోవడం చూసి అసలు నేను ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా.. కట్టుకున్న భార్యని అలా ఎవరైనా నడి రోడ్డు మీద అవమానిస్తారా.. ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ.. అన్ని విషయాల్లో నువ్వు నాకు అండగా ఉండాలి కానీ నువ్వే ఇలా వేదిస్తే ఎలారా అని అంటుంది. ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది.. జీవితాంతం తోడు ఉంటావు అనుకున్నా కానీ నువ్వే నన్ను కష్టపెడుతున్నావ్.. ఏమైపోయిందిరా ఆ ప్రేమ అంతా.. నా మనసులో బాధ నీకు అర్థం కావడం లేదారా అని అడుగుతుంది. దానికి సాగర్ నీ మీద ఎంత ప్రేమ ఉందో మా నాన్నకి అవమానం జరిగితే అంతే బాధగా ఉంది. నేను మాట్లాడటం లేదని నువ్వు ఇంత బాధ పడుతున్నావ్ కదా నువ్వు ఆ ప్రేమకి సపోర్ట్ చేసి మా నాన్నకి అవమానం కలగడానికి కారణం అవ్వడం ఇంకా బాధగా ఉందని చెప్పి వెళ్లిపోతాడు. నర్మద ఏడుస్తుంది.
ప్రేమ బయట కూర్చొని దోమలు కొట్టుకుంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు. ఇక్కడ కూర్చొన్నావేంటి అని అడిగితే పనీపాటా లేక రాక్షసుడి కోసం ఎదురు చూస్తున్నా అని అంటుంది ప్రేమ. నీతో వాదించలేను బాగా అలసి పోయా లోపలికి వెళ్దాం పద అని డోర్ తీసినా తోసినా డోర్ రాదు. ధీరజ్ వెళ్లి ప్రేమని అడుగుతాడు. దాంతో ప్రేమ తాళం వేశారు.. నీకు ఏమైనా మతిమరుపా కొత్తగా పెత్తనం తీసుకున్న మీ పెద్ద వదిన రాజమాత చెప్పిన రూల్స్ మర్చిపోయావా అంటుంది. నా ప్రాణానికి ఈ కొత్త రూల్స్ ఏంటి దేవుడా అని అంటాడు. నువ్వుఎందుకు ఇక్కడ ఉన్నావ్ డోర్ వేస్తారని తెలిసి లోపల ఉండాలి కదా అంటే గెంటేశారు రాజమాత అంటుంది. ఇక ధీరజ్ ప్రేమ పక్కన కూర్చొని ప్రేమ ఆకలి చంపేస్తుందే చాలా ఆకలేస్తుందే అంటాడు.
ప్రేమ చాలా ఫీలవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసుకో అంటుంది. అది వచ్చే టైంకి చచ్చేలా ఉన్నానే ఇంట్లోకి వెళ్లడానికి ఏదో ఒక మార్గం చూడవే అంటుంది. దాంతో ప్రేమ నీ దగ్గర రూపాయి కాయిన్ ఉంటే ఇవ్వు అని అడుగుతుంది. ధీరజ్ ఇస్తాడు. ప్రేమ అది తీసుకొని కిటికీ దగ్గరకు వెళ్లి కిటికీ విప్పుతుంటుంది. ధీరజ్ చూసి నీకు ఆరితేరిన దొంగల్లా భలే టాలెంట్ ఉందే.. కొంప తీసి ఎక్కడైనా దొంగల స్కూల్‌లో కోచింగ్ తీసుకున్నావా అని అడుగుతాడు. సెటైర్లు వేస్తావారా అని ప్రేమ కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















