Illu Illalu Pillalu Serial Today July 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: పెత్తనం కోసం పుల్లలెట్టేస్తున్న వల్లి.. మామని మాయ చేసి.. తోడికోడళ్లని తోసేసిందిగా!
Illu Illalu Pillalu Today Episode ఇంటి పెత్తనం కోసం శ్రీవల్లి ఇంటి నుంచి వెళ్లిపోతానని మామయ్యని మాయ చేసి అత్తా కోడళ్లని దూరం చేయాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ఇంటి నుంచి వెళ్లిపోతానని బ్యాగ్ సర్దేసి వస్తుంది. రామరాజు చూసి ఏమైందని అడుగుతాడు. నీకు నీ భర్తకి ఏమైనా గొడవలు అయ్యావా అని ప్రశ్నిస్తారు. దాంతో శ్రీవల్లి తన భర్త చాలా మంచోడని అమాయకుడని చెప్పి మీకు అవమానం జరిగింది.. ఎదురింటి వాళ్లు చొక్క చింపేయడంతో నా గుండె తరుక్కుపోతుంది. మీకు జరిగిన అవమానం మా నాన్నకి జరిగినట్లు అనిపించింది మామయ్యగారు అని అంటుంది. ఈ అవమానాలు అన్నీనాకు అలవాటు అయిపోయావి.. నా సగం జీవితం ఈ అవమానాలే అని రామరాజు చెప్తారు. కోడల్ని లోపలికి వెళ్లమని అంటారు. దాంతో శ్రీవల్లి ఉమ్మడి కుటుంబానికి కోడలు అయ్యాయని మురిసిపోయాను. మీరు వీళ్లందరి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచారు. అందమైన బృందావనంలా తీర్చిదిద్దారు. మీ గొప్పతనం తెలిసి మీరు నా దృష్టిలో దేవుడు అయిపోయారు. మీ విలువ, త్యాగం వీళ్లెవరికీ తెలీడం లేదండీ మామయ్యగారండీ అని అంటుంది.
చందు వల్లితో తెలీకుండా మాట్లాడకు వల్లీ ఈ ఇంట్లో అందరికీ మా నాన్న విలువ తెలుసు.. ఈ ఇంటిలో అందరి దృష్టిలో మామయ్య గారు ఆకాశం అంత ఎత్తులో ఉన్నారని అంటాడు. దానికి వల్లి ఈ ఇంట్లో ఎవరైనా మామయ్యగారికి విలువ ఇస్తున్నారా.. మాట వింటున్నారా.. ఎవరి నిర్ణయాలు వాళ్లవి అని అంటుంది. వేదవతి కోపంగా వల్లి నోటికొచ్చినట్లు మాట్లాడకు ఇంట్లో ఎవరికీ మీ మామయ్య గారి విలువ తెలీయకపోడం ఏంటే ఇంకెక్కువ మాట్లాడితే ఊరుకోను వెళ్లు లోపలికి అని కోప్పడుతుంది. దాంతో శ్రీవల్లి అత్తయ్య గారు ఇలా అంటున్నందుకు సారీ మీదికూడా చాలా పెద్ద తప్పు ఉందని అంటుంది. మీరు ఇద్దరిని నెత్తినెక్కించుకున్నారు.. ప్రతీ దానికి వెనకేసుకొచ్చారు అని అంటుంది.
నర్మద శ్రీవల్లితో ఏంటి అక్క గొడవ పెద్దది చేస్తావ్ అంటే చూశారా నోరేసుకొని పడిపోతుంది అని శ్రీవల్లి అంటుంది. మామయ్య గారికి అంత పెద్ద అవమానం జరగడానికి ప్రేమ చెప్పకుండా డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లడానికి మీరు వాళ్లకి ఇచ్చిన చనువే కారణం కాదా అని అంటుంది. ఇక ఇద్దరు మరుదుల దగ్గరకు వెళ్లి.. ఏం కొడుకులయ్యా మీరు. మీరు మీ భార్యల్ని కంట్రోల్‌లో పెట్టుకొని ఉంటే ఈ రోజు మామయ్య గారి షర్ట్ చంపే పరిస్థితి వస్తుందా అని అంటుంది. ప్రేమ ఎందుకు అక్క మధ్యలో నువ్వు వస్తున్నావ్ అంటే మీతో మాట్లాడలేను నేను మీ ఇద్దరికీ ఓ దండం అని అంటుంది. రామరాజుతో మామయ్య గారు మీరు లోలోపల ఎంత బాధ పడుతున్నారో నాకు తెలుసు అందుకే ఇక్కడ ఉండలేను పుట్టింటికి వెళ్లిపోతున్నా అంటుంది. బ్యాగ్ తీసుకొని బయల్దేరుతుంది.
శ్రీవల్లి వెళ్తూ గేట్ తీసి మళ్లీ వెనక్కి వస్తుంది. రామరాజు దగ్గరకు వెళ్లి మీ అందరూ పిలిచారు అని నేను వెనక్కి రాలేదు మామయ్య గారు.. నేను వెళ్లిపోతే వీళ్లందరితో మీరు ఒంటరి అయిపోతారు మామయ్యగారు.. నేను వెళ్లిపోతే మిమల్ని ఎవరు చూసుకుంటారు మామయ్యగారండీ.. అందుకే మీరు బాధపడుతుంటే చూసి తట్టుకోవడం కష్టమైనా సరే దేవుడు లాంటి మిమల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అయినా ఇక్కడే ఉండిపోతానని శ్రీవల్లి అంటుంది. వల్లి మాటలకు రామ రాజు వల్లితో నీ మాటలతో నాకు ఎవరు ఏంటో అర్థమైందమ్మా నేను ఓ నిర్ణయం తీసుకున్నా రేపు నా నిర్ణయం మీ అందరికీ చెప్తానని అంటాడు. శ్రీవల్లి మనసులో అమ్మ చెప్పినట్లు చేసిన నాటకం ఫలించిందిరేపు మామయ్య ఏం చెప్తారో అర్థమైంది.. ఇక నుంచి ఈ ఇంట్లో నేను ఆడిందే ఆట అని అనుకుంటుంది.
వేదవతి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే నర్మద వెళ్లి ముగ్గు వేస్తా మీకు ఎందుకు శ్రమ అని అంటే మీరు మా ఆయనతో అనిపించిన మాటలకంటే ఇదేం పెద్ద కష్టం కాదులే అని వెళ్లిపోతుంది. ఇక కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తుంటే ప్రేమ వెళ్లి సాయం చేస్తాను అంటే వేదవతి తన కూతురు అమూల్య మీద పెట్టి ప్రేమని తిట్టి ఇక నుంచి నువ్వే నాకు ఇంటి పనుల్లో వంట పనుల్లో సాయం చేయాలి వేరే వాళ్లు దూరకూడదని అంటుంది. ప్రేమ ఏడిస్తే అమ్మ కోపం ఎక్కువ సేపు ఉండదు ఫీలవకు వదిన అని అమూల్య అంటుంది. ఇక వేదవతి బట్టలు ఆరేయడానికి వెళ్తే నర్మద, ప్రేమ అక్కడికి వెళ్తారు. తమతో మాట్లాడమని క్షమించమని అడుగుతారు. శ్రీవల్లి మొత్తం చూస్తుంది. మీ కారణంగా నాకు నరకంగా ఉందని మీతో కలిసి నేను నాటకం ఆడానని మా ఆయన నన్ను అన్నారు ఇక నుంచి మీరు నన్ను అత్తయ్యా అని పిలవొద్దని అంటుంది.
ప్రేమ అత్తతో అటు మా అమ్మలు మాతో మాట్లాడరు మీరు మాట్లాడకపోతే మేం ఉండగలమా అంటుంది. నర్మద అత్తతో ఏ అమ్మ అయినా బిడ్డలకు ఇంత పెద్ద శిక్ష వేస్తుందా అని అంటుంది. వేదవతి కరిగిపోతుంది. దాంతో శ్రీవల్లి మళ్లీ వెళ్లి వేదవతిని పట్టుకున్న ఇద్దరి కోడల్ని తోసేసి అత్తయ్య గారిని నానామాటలు అనిపించి ఇంత అవమానం కలిగేలా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా.. మీరు చేసిన పనికి అత్తయ్యతో మాట్లాడే అర్హత లేదని అంటుంది. వేదవతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. నర్మద, ప్రేమలు ఏడుస్తారు. శ్రీవల్లి చిందులేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















