Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: భార్యల అందాలు చూసి మైమరిచిన అన్నదమ్ముళ్లు.. మొత్తం రొమాన్సే!
Illu Illalu Pillalu Serial Today Episode August 15th నర్మద, ప్రేమ, వల్లి కోసం సాగర్, ధీరజ్, చందులు కలిసి చీరలు కొనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద శ్రీవల్లి నగలు బండారం బయట పెట్టడానికి వరలక్ష్మీ వ్రతం చేయించడానికి ఒప్పిస్తుంది. ప్రేమ నర్మదతో పూజ చేస్తే నగల బండారం ఎలా బయట పడుతుంది అక్క అని అడుగుతుంది. దాంతో నర్మద పూజకి ఇంట్లో ఉన్న బంగారు నగలు డబ్బు పెడతారు. ఇప్పుడు వల్లి చచ్చినట్లు పెట్టాలి. కానీ తను ఏదైనా సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ మనం తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నగలు పెట్టాల్సిందే అని తన ప్రయత్నాలు తిప్పికొట్టి నగలు తీసుకొచ్చాలా చేద్దామని అంటుంది. సూపర్ ప్లాన్ అక్క ఇప్పుడు నగలు తీసుకురావడం తప్ప తనకు మరో దారి లేదు అని అంటుంది.
వల్లి కుటుంబాన్ని బయట పెట్టడానికి మనం మంచి అవకాశం దొరికింది ఈ అవకాశం అస్సలు వదులుకోకూడదు. వాళ్ల బండారం రేపే బయట పెట్టేద్దాం ఈ సమస్య తెగ్గొట్టేద్దాం అని అంటుంది. ఉదయం నర్మద, ప్రేమ, వల్లి కలిసి పూజ చేస్తారు. ముగ్గురు అన్నదమ్ముళ్లు భార్యల్ని చూసి మురిసిపోతారు. ముగ్గురు భార్యలు పూజ చేస్తుంటే చందు, సాగర్, ధీరజ్ చూస్తూ మైమరిచిపోతారు. తర్వాత ముగ్గురు ఒకర్ని ఒకరు చూసుకొని కంగారు పడి వెళ్లిపోతారు. వల్లి గుమ్మానికి పసుపు రాస్తుంటే చందు వచ్చి పక్కనే కూర్చొని చూసి నవ్వుకుంటాడు. వల్లి సైగ చేస్తే ఏం లేదని తలూపి వెళ్లిపోతూ వెనక్కి వచ్చి ముద్దు పెడతాడు. వల్లి షాక్ అయిపోతుంది. సిగ్గుతో నవ్వుకుంటుంది.
నర్మద గుమ్మానికి పూల దండలు పెడుతుంటే సాగర్ నర్మద నడుముని చూసి చిట్టి నడుమునే చూస్తున్నా చిత్ర హింసలూ పడుతున్నా అనుకుంటూ గిల్లేస్తాడు. ఏయ్ అని నర్మద అనగానే నాకేం తెలీదు అని పారిపోతాడు. ఎవరైనా చూస్తే అని నర్మద అంటే ఎవరూ చూడకపోతే ఒకే కదా అని మళ్లీ గిల్లేసి వెళ్లిపోతాడు. నర్మద కూడా చాలా సిగ్గు పడిపోతుంది. ఇక ప్రేమ వాకిట్లో ముగ్గు పెడుతుంది. ధీరజ్, ప్రేమ పేర్లు కలిసేలా ధీరజ్, ప్రేమ మొదటి అక్షరాలు కలిపి ధీమా DEEMA అని రాస్తుంది. ధీరజ్ చూసి ఏంటే ఇది అని అడుగుతాడు. ఇది అర్థం కావాలి అంటే మినిమమ్ డిగ్రీ పాస్ అవ్వాలి అని చెప్తుంది. నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పు అని ధీరజ్ అడుగుతాడు. దాంతో ప్రేమ మొత్తం చెరిపేసి వెళ్లిపోతుంది. ఎందుకు చరిపేశావ్ అని ధీరజ్ అడిగితే కొన్ని చెరిపేస్తేనే బాగుంటుంది లేదంటే గుండెలో బాధగా ఉంటుందని అంటుంది. తిక్క శంకరమ్మ ఏం చెప్పిందో అర్థం కాలేదు అని ధీరజ్ అనుకుంటాడు.
ధీరజ్, సాగర్, చందులు చీరలు కొనడానికి వెళ్తారు. సాగర్, చందు సెలక్షన్ చేస్తుంటే ధీరజ్ పక్కనే నిల్చొంటాడు. గంట నుంచి చూస్తున్నాం ఏం అర్థం కావడం లేదురా అనుకుంటారు. ప్రేమ కోసం కూడా చీర తీసుకోమని ధీరజ్‌కి చెప్తే నేను తర్వాత తీసుకుంటా మీరు తీసుకోండి అని అంటాడు. ఇది మొదటి వరలక్ష్మీ వ్రతంరా తీసుకోకపోతే ఎలా అంటారు. ధీరజ్ పర్లేదు అంటాడు. చందు ధీరజ్ జేబు చూసి డబ్బులు లేవా అని అంటాడు. అంటే అని ధీరజ్ ఇబ్బంది పడితే కొడితే మా తమ్ముడు బాధ పడుతుంటే మేం సంతోషంగా ఎలా ఉంటాంరా.. మేం మా భార్యలకు చీరలు కొంటుంటే నువ్వు మాత్రం అలా నిల్చొంటే ఎలారా.. మనం సంతోషాలు పంచుకోకపోయినా పర్లేదు కానీ కష్టాలు పంచుకుందాంరా అని చందు 1500 ఇస్తాడు. సాగర్ కూడా డబ్బులు ఇస్తాడు. ఇద్దరూ తమ్ముడిని నవ్వించి చీరలు తీసుకుందామని వెళ్తారు. ముగ్గురు సెలక్ట్ చేస్తారు. చందు నర్మద కోసం సెలక్ట్ చేసి సాగర్‌కి ఇస్తాడు. సాగర్ వదినకు బాగుంటుందిరా అని సెలక్ట్ చేస్తాడు. ధీరజ్ కూడా ఈ చీర చూసి వదిన ఆ చీరలో లక్ష్మీ దేవిలా ఉంటుందిరా అంటాడు. దాంతో చందు అవునురా సూపర్‌గా ఉంది తనకోసం మరుదులు సెలక్ట్ చేశారని తెలిస్తే మీ వదిన చాలా హ్యాపీ అయిపోతుంది అంటాడు.
ధీరజ్‌కి కూడా చీర కొనమని సాగర్ వాళ్లు చెప్తారు. ధీరజ్ మనసులో ఇప్పటికే నా మీద కారాలు మిర్యాలు నూరుతుంది. ఇప్పుడు చీర ఇస్తే ఇంకేం గోల చేస్తుందో అని అనుకుంటూ ఎలా అయినా తనతో చీర కట్టేలా చేయాలి అని చీర సెలక్ట్ చేస్తారు. నర్మద రెడీ అవుతుంటే సాగర్ చీర తీసుకొని వచ్చి నీకు ఓ గిఫ్ట్ తీసుకొచ్చా ఎగిరి గంతేస్తావ్ ముద్దులతో ముంచేస్తావ్ అని చీర ఇస్తాడు. నర్మద మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతుంది. ఏమైంది అని సాగర్ అడుగుతాడు. నేనేమైనా తీసుకురమ్మన్నానా.. మనసులో లేని ప్రేమ ఇలా చీరల్లో మాటల్లో చూపించొద్దు అని అంటుంది. గతంలో తనని బాధ పెట్టిన అన్ని మాటలు గుర్తి చేసి నర్మద బాధ పడుతుంది. సాగర్ సారీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















