Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: తాడేపల్లి గూడెంలో ఎయిర్‌పోర్ట్, ఫిబ్రవరి 30 అంట.. కామాక్షికి భారీ మోసం.. వల్లీకి ముహూర్తం ఫిక్స్!
Illu Illalu Pillalu Serial Today Episode August 14th శ్రీవల్లిని నిలదీసిన కామాక్షికి భాగ్యం రెండు ఎకరాలు ఇస్తానని మభ్యపెట్టడం ఆ విషయం నర్మద, ప్రేమలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode కామాక్షి తనకు ఇచ్చిన ఆడపడుచు కట్నం బంగారం గిల్ట్ అని వల్లితో గొడవ పెట్టుకుంటుంది. వల్లి, భాగ్యం కామాక్షిని బతిమాలడం నర్మద, ప్రేమలు చూస్తారు. ఏదో జరుగుతుందని అనుకుంటారు. రామరాజుకి విషయం చెప్తాను అని వెళ్తున్న కామాక్షిని ఆపి ఆ ఉంగరాలు పొరపాటున శ్రీవల్లి బంగారంలోకి వచ్చేసిందని వల్లి చెల్లికి బంగారు నగలు ఉన్నా వాటి కంటే గిల్ట్ నగలు ఇష్టమని వాటిని శ్రీవల్లి కలిపేసుంటారని అంటుంది.
కామాక్షి మళ్లీ తన బంగారం తిరిగి అడిగితే ముష్టి లక్ష రూపాయల రింగ్ ఎందుకమ్మా తాడేపల్లి గూడెంలోని ఎయిర్పోర్ట్ దగ్గర మాకు ఉన్న వంద ఎకరాల్లో రెండు ఎకరాలు నీకు ఇచ్చేస్తానమ్మా 25 కోట్లు ఉంటుందని ఫిబ్రవరి 30న రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని అంటుంది భాగ్యం. కామాక్షి నిజమే అని నమ్మేసి గెంతులేస్తుంది. భాగ్యం కూతురితో ఈ తింగరి దానికి తాడేపల్ల గూడెంలో ఎయిర్ పోర్ట్ లేదని ఫిబ్రవరి 30వ తేదీ కూడా లేదని తెలీదు పిచ్చిది అనుకుంటారు. కామాక్షి నిజమని గెంతులేస్తూ కామాక్షి కోటీశ్వరురాలు అని బోర్డు పెట్టేసుకుంటానని అనుకుంటుంది.
నర్మద, ప్రేమలు కామాక్షిని ఆపి విషయం అడుగుతారు. దానికి కామాక్షి పక్క ఊరిలో మామిడి చెట్టుకి దానిమ్మ పళ్లు కాశాయంట ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం అని కామాక్షి సెటైర్లు వేస్తుంది. కామాక్షి మూతి మూడు వంకలు తిప్పుకుంటూ మీకు ఆడపడుచు కట్నం ఇవ్వడం చేతకాదు కానీ నన్ను అడుగుతున్నారు. కనీసం తులం బంగారం ఇవ్వడం లేదు.. వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు అని వల్లి చూడు ఎంత మంచిదో నాకు తాడేపల్లి గూడెంలోని ఎయిర్పోర్ట్ దగ్గర 2 ఎకరాలు ఇస్తామని చెప్తామని అన్నారని అంటుంది. కామాక్షి వల్లిని పొడిగేస్తూ విషయం మొత్తం నర్మద, ప్రేమలకు చెప్పేస్తుంది.
ప్రేమ నర్మదతో రెండు ఎకరాలు రాయడం అనేది జరగని విషయం ఈ నగల విషయంలో ప్రతీసారి వల్లి ఏదో టెన్షన్ పడుతుంది అని నర్మద అంటుంది. దాంతో ప్రేమ గతంలో నగలు లాకర్‌లో వేసిన టైంలో టెన్షన్ పడటం నా నగలు మా ఇంట్లో ఇచ్చినప్పుడు కూడా తీసుకున్నారా ఏమైనా అన్నారా అని ప్రశ్నించిందని ప్రేమ చెప్తుంది. దానికి నర్మద డౌట్ లేదు ఆ వల్లి నగల విషయంలో ఏదో పెద్ద మతలబే ఉంది. అదంతా బయటకు తీయాలి అంటే పెద్ద ప్లానే వేయాలి అని నర్మద అంటుంది.
రామరాజుకి వేదవతి కాఫీ తీసుకొచ్చి చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టేస్తుంది. రామరాజు వేదవతికి కాఫీ చేతికి ఇవ్వలేదని అడుగుతాడు. నీ చేతితోనే ఇస్తే నాకు ఇష్టం అని రామరాజు వేదవతి చేతికి ముద్దు పెడతాడు. నర్మద, ప్రేమలు చూసి నోరెళ్ల బెడతారు. ఇక నర్మద, ప్రేమలు వచ్చి వరలక్ష్మీ వ్రతం రేపే చేద్దామని అంటుంది. రెండో శుక్రవారం చేద్దామని వేదవతి అంటే లేదు లేదు భాగ్యం పిన్ని వాళ్లు ఉంటారు కదా అంటుంది. కామాక్షి వదిన కూడా ఇంట్లోనే ఉంది కదా ఇళ్లంతా సందడిగా ఉంది కదా అని అత్తామామల్ని బతిమాలుతారు. రామరాజు సరే అనేస్తాడు. వేదవతి ఇద్దరు కోడళ్లని దగ్గరకు తీసుకొని మీరు అనుకున్నది చేసేస్తారే అని ఘటికులు రేపే వ్రతం చేసుకుందాం అని అంటుంది.
శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది. నర్మద, ప్రేమలు భాగ్యం, వల్లి దగ్గరకు వెళ్లి పిన్ని గారు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది రేపే ముహూర్తం మీరు ఊహించనట్లు ఉంటుంది రెడీగా ఉండండి అని అంటారు. వీళ్ల మాటలు వెనక.. రేపే సడెన్‌గా వ్రతం పెట్టడం వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది అది కనిపెట్టేసి మనం జాగ్రత్త పడిపోవాలి అని భాగ్యం, వల్లి అనుకుంటారు. భాగ్యం, ఆనంద్‌రావు, వల్లిలు తెగ ఆలోచిస్తూ ఉంటారు. నా పెళ్లి విషయం మనం చేసిన అన్నీ మోసాలు బయట పెట్టేసి నన్ను గెంటేలా చేస్తారు నేను బావకి దూరం అయిపోతా అని శ్రీవల్లి ఏడుస్తుంది. మన బండారం బయట పడేలోపు మనం పారిపోదాం అని ఆనంద్ రావు అంటే ఎక్కడికి పారిపోయేది వాళ్ల ప్లాన్‌కి ఎట్టా ఎదురు దెబ్బ కొట్టాలో నాకు తెలుసు అని భాగ్యం అంటుంది. వాళ్లు మన బండారం బయట పెట్టడం కాదు నేనే వాళ్లకి ఘోర అవమానం చేస్తానని భాగ్యం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















