అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన ధీరజ్! నర్మదకి కొత్త చిక్కులు!

Illu Illalu Pillalu Serial Today Episode April 18th నర్మదకు సేటు కాల్ చేసి సాగర్ పొగరుగా మాట్లాడాడు.. నెల రోజుల్లో డబ్బు మొత్తం ఇచ్చేయాలని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద భాగ్యం కాలు సెట్ అవుతుందని కాలి మీద కావాలనే చితక్కొట్టేస్తుంది. తల్లిని చితక్కొట్టేయడం చూసిన వల్లీ ఆపండి అని అరుస్తుంది. భాగ్యం కన్నీరు కార్చుతూ నొప్పే లేదు.. ఆనందభాష్పాలు అని అంటుంది. వదిన మీ బలం సరిపోవడం లేదు.. పెద్ద వదిన కాస్త బలంగా ఉంటుంది కదా.. వదినకు ఇవ్వు అని వల్లీకి కర్ర ఇప్పిస్తాడు. వల్లీ తప్పక తల్లిని చితక్కొట్టేస్తుంది. దాంతో భాగ్యం అమ్మో కొట్టేశారే నొప్పి అని అరుస్తూ లేస్తుంది. ట్రీట్మెంట్ బాగా పని చేస్తుంది.. రోజుకి నాలుగు పూటలు బడితపూజ చేయండి సెట్ అయిపోతుంది అని ధీరజ్ అంటాడు.

ధీరజ్ వెళ్తూ చూడు వదినా ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు అన్న సంస్కారం మా నాన్న నేర్పాడు కాబట్టి నిజం తెలిసినా ఏం అనలేకపోతున్నాను.. మా ఇంట్లో నిన్ను దేవతలా చూసుకున్నారు.. మా ఫ్యామిలీని మా అన్నయ్యని మోసం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా మీకు.. ఛీ అని వెళ్లిపోతాడు. ఇక నర్మద తన ఫ్రెండ్ ఇచ్చిన సమాచారంతో ధీరజ్‌కి లారీ డిటైల్స్ దొరికాయని.. లారీ డ్రైవర్ ఇతనే అని ఫొటో చూపిస్తుంది. ప్రేమ పడుకొని ఉంటే ధీరజ్ ప్రేమని చూస్తూ ఉంటాడు. ఇక కాస్త దూరంలో ప్రేమ ప్రపోజ్ చేసి ఇచ్చిన గిఫ్ట్ ముక్కలై ఉండటం చూసి దాని దగ్గరకు వెళ్తాడు. ప్రేమని బాధగా చూసి ఇక వెంటనే ఆ బొమ్మని అతికిస్తాడు. మరోవైపు ప్రేమకి యాక్సిడెంట్ కలగా వచ్చి ఉలిక్కిపడి లేస్తుంది.  ఎందుకు పదే పదే తలచుకొని బాధ పడుతున్నావ్.. ఏం కాదు.. అయినా నీ మనసులో బాధ పోయే ఓ సర్‌ఫ్రైజ్ చూపిస్తా అని తను అతికించిన బొమ్మ ప్రేమకి చూపిస్తాడు. అది చూసి ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. బొమ్మని పట్టుకొని హగ్ చేసుకొని ఏడుస్తుంది. 

ధీరజ్ ప్రేమతో పశ్చాత్తాపంతో నీ మనసు అతికించినట్లే ఈ బొమ్మని కూడా అతికించేశాను అని అంటాడు. ప్రేమ ధీరజ్‌ని హగ్ చేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది. ప్రేమ ఏమైనా ఒకసారి విరిగిపోతే అతికించలేం అంటారు. ఒకసారి పోగొట్టుకుంటేనే వాటి విలువ తెలుస్తుంది. జీవితంలో ఇంకెప్పుడూ నిన్నూ నీ గుర్తులను దూరం చేసుకోను అని అంటాడు. తర్వాత ప్రేమని పడుకోపెడతాడు. ప్రేమ యాక్సిడెంట్ గురించి భయపడుతుండటం గుర్తు చేసుకొని ప్రేమలో భయం పోగొట్టాలి అంటే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. 

సేనాపతి ఆ డ్రైవర్‌ని కలిసి నేను చెప్పింది ఏంటి.. నువ్వు చేసింది ఏంటి.. అని డ్రైవర్ని కొడతాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా చూశారా అని అడుగుతాడు. ఇక ధీరజ్ తన ఫ్రెండ్స్‌తో ప్రేమ అది యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలనే చేశారని భయపడుతుంది. అది పొగొట్టాలి అంటే ఆ డ్రైవర్ని కనిపెట్టాలి అని అంటాడు ధీరజ్. ఇక సేనాపతి డ్రైవర్ని నువ్వు ఇక్కడే ఉంటే ప్రమాదం నీ వల్ల నేను దొరికిపోతాను.. అందుకే వేరే రాష్ట్రానికి వెళ్లిపో అని చెప్తాడు. 

నర్మదకు సేటు ఫోన్ చేసి మీ ఆయన చూపించిన బలుపు నీకు చెప్పాలని కాల్ చేశా అంటాడు. ఏమైందని నర్మద అడిగితే సాగర్ షాప్‌కి వచ్చి వడ్డీ డబ్బు ముఖం మీద విసిరేసి.. ఒక్క రోజు వడ్డీ లేటు అవ్వడంతో  మానాన్నకి చెప్పేస్తావా అని అరుస్తాడు. వడ్డీ కింద 30 వేలు ఇస్తాడు. వడ్డీ 60 వేలు అయితే 30 ఇస్తావేంటి అని సేటు అరుస్తాడు. మీ నాన్నకి నమ్మి నీకు ఇచ్చా కానీ నీకు అయితే ఒక్క రూపాయి ఇవ్వను అని అంటాడు. నీ వాలకం చూస్తే నీకు మీ నాన్నకి ఏదో గొడవలు ఉన్నాయని అర్థమైంది నెల రోజుల్లో నా 20 లక్షలు నాకు ఇచ్చేయ్ అని అంటాడు. ఆయన ఏదో తెలీక అలా చేశారని నర్మద అంటే లేదమ్మా ఉద్యోగం ఉందన్న పొగరు.,.మీరు ఏం చేస్తారో నాకు తెలీదు.. నెల రోజుల్లో డబ్బు ఇచ్చేయ్ అంటాడు. సాగర్ కోపంతో చచ్చిపోతున్నా.. లోన్‌కి అప్లై చేస్తుంటే రిజెక్ట్ అవుతుంది. ఏం చేయాలి అని నర్మద అనుకుంటుంది. 

ధీరజ్ ఎస్‌ఐ రిజల్ట్స్ వచ్చాయని తెలిసి కంప్యూటర్ సెంటర్‌కి వెళ్లి చూస్తాడు. ఫెయిల్యూర్‌లో లీస్ట్‌లో ఉందని ఆయన చెప్పడంతో పరీక్షని పులిహోరా చేసేశావ్ కదే అని ధీరజ్ అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget