Nirupam Paritala: బుల్లితెర డాక్టర్ బాబు.. హిట్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్.. నిరుపమ్ రియల్ లైఫ్ విశేషాలు
Nirupam Paritala: బుల్లితెర డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల.. సినిమాల్లో హీరో ఛాన్స్ మిస్ అయ్యారని తెలుసా. అలాగే ఆయన రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Nirupam Paritala: తెలుగు బుల్లితెరపై 'డాక్టర్ బాబు'గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నటుడు నిరుపమ్ పరిటాల. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రైటర్, నిర్మాతగా కూడా నిరుపమ్ రాణిస్తున్నాడు. నిరుపమ్ పరిటాల కెరీర్, సీరియల్స్, రెమ్యూనిరేషన్, ఆయన రియల్ లైఫ్ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
కెరీర్
నిరుపమ్ తండ్రి ఓంకార్ పరిటాల ప్రముఖ రచయిత, నటుడు. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా, తన సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు నిరుపమ్. నిరుపమ్ ఏపీలోని విజయవాడలో జన్మించాడు. చెన్నైలో MBA పూర్తి చేశాడు. 2006-2007లో ఈటీవీలో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ "చంద్రముఖి" ద్వారా నిరుపమ్ టెలివిజన్‌కు పరిచయమయ్యాడు. ఫస్ట్ సీరియల్‌తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
స్టార్ మా లో వచ్చిన "కార్తీక దీపం" సీరియల్ నిరుపమ్ కెరీర్‌ను మార్చేసింది. 'డాక్టర్ బాబు' (కార్తీక్) పాత్రలు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా 'ఓమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై పలు సీరియల్స్ నిర్మిస్తూ సక్సెస్ అయ్యారు.
సీరియల్స్
నిరుపమ్ పరిటాల తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సీరియల్స్‌లో నటించాడు. వీటిలో ముఖ్యమైనవి. చంద్రముఖి, కలవారి కోడలు, అష్టా చమ్మా, కాంచన గంగ, కుంకుమ పువ్వు, ప్రేమికుడు, కార్తీక దీపం-1, 2 , హిట్లర్ గారి పెళ్ళాం, రాధకు నీవేరా ప్రాణం ఉన్నాయి.
రెమ్యూనిరేషన్
బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో నిరుపమ్ ఒకడు. గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు తీసుకునేవారని, 'కార్తీక దీపం' సక్సెస్ తర్వాత క్రేజ్‌ను బట్టి ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.40,000 వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీరియల్స్, ప్రొడక్షన్ హౌస్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా నిరుపమ్ ఆస్తులు భారీగా సంపాదించాడు. హైదరాబాద్‌లో ఒక సొంత ఫ్లాట్, వైజాగ్‌లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్.
Also Read: నిండు మనసులు: ప్రేరణ మీద పగతోనే గణ సాహితిని పెళ్లి చేసుకున్నాడా! సాహితి జీవితం అన్యాయం అయిపోయిందా!
ఆసక్తికర విషయాలు
'చంద్రముఖి' సీరియల్‌లో తనతో పాటు కలిసి నటించిన సహనటి మంజులను నిరుపమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 'అక్షజ్ ఓంకార్' అనే కుమారుడు ఉన్నాడు. బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.
సినిమా కల
నిరుపమ్‌కు సినిమాల్లో హీరో అవ్వాలని ఉండేది. అందుకోసం 'అష్టా చమ్మా' సినిమా ఆడిషన్స్‌కు కూడా వెళ్లారు. కానీ అప్పటికే టీవీ సీరియల్స్ చేస్తూ పాపులర్ అవ్వడంతో 'టీవీ ఫేస్' అనే ముద్ర వేసి పలు సినిమాల్లో రిజెక్ట్ చేశారని ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు.
బెదిరింపులు
'కార్తీక దీపం' సీరియల్‌లో వంటలక్కను అనుమానించి దూరం పెట్టినప్పుడు, ప్రేక్షకులు నిరుపమ్‌ను నిజంగానే తిడుతూ లెటర్లు, సోషల్ మీడియా పోస్టులు పంపేవారట. కొందరైతే "బయట కనిపిస్తే చెప్పుల దండ వేస్తాం" అని సరదాగా బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని నిరుపమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
వెబ్ సిరీస్ ఎంట్రీ
ఇటీవల కాలంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన వెబ్ సిరీస్‌లో నటించి ఓటీటీలో అడుగుపెట్టారు. అలాగే 'రంగా రంగా వైభవంగా' సినిమాలో చిన్న క్యామియో రోల్ కూడా చేశారు.
సోషల్ మీడియాలో
నిరుపమ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్(nirupamparitala)లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. బుల్లితెర హీరోలలో అత్యంత యాక్టివ్‌గా ఉండే వారిలో నిరుపమ్ ఒకరు. తన సీరియల్స్ షూటింగ్ సెట్స్ నుండి క్రేజీ రీల్స్, ఫన్నీ వీడియోలు, కో-స్టార్స్‌తో దిగిన ఫొటోలను రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటాడు. భార్య మంజుల, కొడుకు అక్షజ్‌తో కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలను, పండగ వేడుకల పిక్స్, ఫ్యామిలీ మూమెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు.
యూట్యూబ్ ఛానెల్
"Manjula Nirupam" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుపమ్, భార్య మంజుల కలిసి వీడియోలు పోస్ట్ చేస్తారు. దీనికి లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వ్లాగ్స్, పండగలు, బర్త్‌డే సెలబ్రేషన్స్, హోమ్ టూర్ వీడియోస్ ఇందులో అప్‌లోడ్ చేస్తుంటారు. వ్లాగ్స్ మాత్రమే కాకుండా, భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, కామెడీ కాన్సెప్ట్‌లతో చిన్న స్కిట్స్, షార్ట్ వీడియోస్‌తో అభిమానులను అలరిస్తుంటారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















