అన్వేషించండి

Guppedantha Manasu May 07th Episode: మను బయటకు రావాలంటే రిషి రావాల్సిందేనా - శైలేంద్రని టెన్షన్ పెట్టిన వసు ,గుప్పెడంత మనసు మే 07 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: మను అరెస్టుతో మరో మలుపు తిరిగింది గుప్పెడంత మనసు. రాజీవ్ - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెట్టేందుకు వసుధార- మహేంద్ర కొత్త ప్లాన్ వేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మే 07 ఎపిసోడ్)

శైలేంద్ర తనని గమనించేశాడని మహేంద్ర వసుధారకి చెబుతాడు. ఇప్పుడు మన ప్లాన్ ఫెయిలైనట్టేనా అని డిస్కస్ చేసుకుంటారు.
వసు: మనం అనుకున్నవన్నీ ముందే వాళ్లకి తెలిసిపోతున్నాయంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు.. రాజీవ్ బతికే ఉన్నాడు అనిపిస్తోంది... 
( అప్పుడే విండో వెనుక రాజీవ్ నిలబడి ఉంటాడు)
మహేంద్ర: వాడు నిజంగా బతికే ఉంటే బయటకు ఎందుకొస్తాడు..ఎందుకు ఫాలో అవుతాడు..అలా చేస్తే పోలీసులకు దొరికిపోతాడు కదా..
మహేంద్ర-వసుధార డిస్కషన్ విన్న రాజీవ్...నువ్వు ఊహించింది కరెక్టే నేనే నిన్ను ఫాలో అవుతున్నాను ...ఇకపై దాగుడుమూతలుండవ్.. నేరుగా వస్తాను అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు

పోలీస్ స్టేషన్లో 
ఆ డెడ్ బాడీ రాజీవ్ దే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందంటాడు పోలీస్. మహేంద్ర, అనుపమ, వసుధార షాక్ అవుతారు.
పోలీస్: ఆయన అమాయకుడు మంచోడు అన్నారు..కానీ ఇప్పుడేమంటారు. రాజీవ్ బతికే ఉన్నాడు టీ కూడా ఇచ్చాడని కథలు చెబితే మీరు నమ్మారు..డెడ్ బాడీ కూడా దొరక్కపోయేసరికి మీరు నమ్మారు..ఆ రాజీవ్ డ్రామాలు ఆడుతున్నారు అన్నారు..కానీ ఇప్పుడేమైంది..అది రాజీవ్ డెడ్ బాడీ అని తేలింది..ఆల్రెడీ దొరికిన ఆధారాలు మనుకి వ్యతిరేకంగా ఉన్నాయి..ఇక తనని ఎవ్వరూ కాపాడలేరు..ఈ కేసు నుంచి ఎవ్వరూ బయటపడేయలేరు..
వసు: మొదట్నుంచీ ఈ కేసులో మీరు ఓ వైపు నుంచి మాత్రమే ఆలోచిస్తున్నారు..రెండోవైపు ఆలోచించడం లేదు
పోలీస్: చేసిన నేరం ఒప్పుకుంటే క్రిమినల్స్ కి శిక్ష తగ్గుతుంది..
వసు: జడ్జిమెంట్ రాకముందే మీరు క్రిమినల్ అనొద్దు...నేరం రుజువు అయ్యేవరకూ వాళ్లని అనుమానితులు అని మాత్రమే అంటారు
పోలీస్: తనని అంటే మీరు ఫీలవుతున్నట్టున్నారు...మీకు ఎంత చెప్పినా అర్థంకాదు..అతనికి శిక్ష పడడం ఖాయం అనేసి పోలీస్ వెళ్లిపోతాడు

Also Read: నేటి రాశిఫలాలు (07-05-2024) - ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

అనుపమ: తన కళ్లలో భయం కనిపిస్తోంది..నేను తనని అలా పెంచలేదని చెప్పు వసుధారా..ఎంత కష్టమైన కన్నీటి చుక్క బయటకు రాకూడదని చెప్పాను..ఎవరో ఏదో శిక్ష పడుతుందంటే అంతలా భయపడాలా?
మను: ఆ భయం నాకు ఏదో శిక్ష పడుతుందని కాదు..నా తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నానే అని..ఓ వైపు జైలు శిక్ష పడి ఇలానే వెళ్లిపోతానేమో అనిపిస్తోంది
వసు: ఇన్నేళ్ల మీ ఎదురుచూపులకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది..అప్పటివరకూ మహేంద్ర సర్ మీ తండ్రి స్థానంలో ఉంటారు
మహేంద్ర: నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ తండ్రి స్థానంలో ప్రస్తుతానికి నేనుంటాను..నా ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా నిన్ను బయటకు తీసుకొస్తాను..
( అనుపమ-వసుధార ముఖాలు చూసుకుంటారు)
వసు: చివరి నిముషంలో తీర్పు మారే సందర్భాలు చాలా ఉన్నాయి..మీరు తప్పుచేయలేదని నిరూపించేందుకే ప్రయత్నిస్తాను.. మీరు అధైర్య పడొద్దు..

Also Read:

శైలేంద్ర
ఎండీ పదవి ఇస్తానని చెప్పినట్టే చెప్పి..మనుతో లింక్ పెట్టిందేంటి? బాబాయ్ కి రాజీవ్ బతికి ఉన్నాడనే అనుమానం వచ్చింది? ఈ రాజీవ్ గాడు వసుధారని చూడకుండా ఉండలేనంటూ బయట తిరుగుతున్నాడు...ఇదంతా నా ప్రాణం మీదకు వచ్చిపడేట్టుంది? అసలు వసుధార ప్లానేంటి? అనుకుంటాడు...ఇంతలో వసుధార ఓ ఫైల్ పంపించి సైన్ చేయమంటుంది...నేను పెట్టను అన్నానని మీ ఎండీగారి చెప్పు అని తిప్పి పంపిస్తాడు...
మళ్లీ ఆ ఫైల్ తీసుకుని వచ్చిన వసుధార..ఏంటి శైలేంద్ర అనగానే..నాకు రెస్పెక్ట్ ఇవ్వు ముందు అని ఫైర్ అవుతాడు...
వసు: ఎదుటివాళ్లకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఆశించు అనేసి..సైన్ చేయిముందు 
శైలేంద్ర: నేనేమైనా పిచ్చోడినా...మీరు నన్ను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని...ఎండీ సీట్ ఎరచూపి నన్ను ఆశపెడుతున్నారా
వసు: మాకేంటి అవసరం
శైలేంద్ర: రాజీవ్ గురించి తెలుసుకునేందుకు
వసు: అంటే రాజీవ్ గురించి నీకు తెలుసన్నమాట..
శైలేంద్ర: పొగపెడితే కలుగులోంచి రావడానికి నేను ఎలుకను కాదు..శైలేంద్రను..నన్ను మీరు ఏం చేయలేరు
వసు: రాజీవ్ బతికి ఉన్నాడని తెలుసు, ఎక్కడున్నాడో కూడా తెలుసు?..ఇంకా ఎక్కువ నటించకు..నీ నటన కూడా రొటీన్ అయిపోతుంది.. నువ్వు , రాజీవ్ ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో నాకు తెలుసన్న విషయం మీకు తెలియదు..చూస్తూ ఉండండి..అతి తక్కువ టైమ్ లోనే రాజీవ్ ను బయటపెట్టి మనుని నిర్ధోషి అని తేలుస్తాం...

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

శైలేంద్ర కాల్ చేసి నువ్వెక్కడున్నావో తెలిసిపోయిందని రాజీవ్ కి చెబుతాడు... ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కిటికీ పక్కనుంచి ధరణి వినేందుకు ప్రయత్నిస్తుంది... 
రాజీవ్: వాళ్లేదో అన్నారని నువ్వు వెంటనే కాల్ చేశావ్..వాళ్లు నిన్ను కావాలనే రెచ్చగొట్టారు, నువ్వెందుకు వెంటనే కాల్ చేశావ్...కాల్ ట్రాప్ చేస్తే?
ఇంతలో ధరణిని చూసిన శైలేంద్ర..నాకు కాఫీ అవసరం లేదు నువ్వెళ్లు అని ఫైర్ అయి పంపించేసి...మళ్లీ రాజీవ్ తో మాట్లాడుతాడు... జాగ్రత్తగా ఉండు అని మళ్లీ క్లాస్ వేస్తాడు...

Also Read: సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

ధరణి-వసుధార
ఆ త‌ర్వాత వ‌సుధార‌కు కాల్ చేసిన ధరణి.. రాజీవ్‌తో శైలేంద్ర మాట్లాడుతుంది నిజ‌మేన‌ని చెబుతుంది. శైలేంద్ర‌మాట్లాడిన ఫోన్ నంబ‌ర్ దొరికితే రాజీవ్ ఎక్క‌డున్నాడో క‌నిపెట్ట‌వ‌చ్చిన వ‌సుధార అనుకుంటుంది. ఆ నంబ‌ర్‌ను ఎలాగైనా సంపాదించమ‌ని ధ‌ర‌ణిని కోరుతుంది. క‌ష్ట‌మైన స‌రై త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని వ‌సుధార‌కు మాటిస్తుంది ధ‌ర‌ణి. 
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...

గుప్పెడంత మనసు మే 08 ఎపిసోడ్ లో మనుని విడిపించే ప్రయత్నాలు సాగనున్నాయి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget