అన్వేషించండి

Guppedantha Manasu Serial December 12th Episode: శైలేంద్ర నిజస్వరూపం బయటపెట్టేసిన ధరణి, రిషి గురించి ముకుల్ కి క్లారిటీ వచ్చినట్టేనా!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 12th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 12 ఎపిసోడ్)

ముకుల్ కి షాకిచ్చిన కొడుకుని పొగిడేస్తుంది దేవయాని. ఇద్దరూ అవే విషయాలు మాట్లాడుకుంటుంటే...ధరణి ఎంట్రీ ఇస్తుంది.  
ధరణి: కిల్ల‌ర్‌తో మాట్లాడిన వాయిస్ మీదే క‌దా అని...మీరు రౌడీకి డ‌బ్బులిస్తుంటే తాను చూశాన‌ని, టెక్నాల‌జీ అని చెప్పి అంద‌రిని న‌మ్మించిన‌ట్లుగా న‌న్ను న‌మ్మించ‌లేర‌ు. నిజం దాచ‌డం వెనుక ఏదో కుట్ర ఉంది
శైలేంద్ర: నిజం నీకోస‌మే దాచాన‌ు. నిజం నిరూపిత‌మైతే నాకు శిక్ష ప‌డుతుంది. జైలుకు వెళ‌తాను. అప్పుడు నువ్వు ఒంట‌రిగా మారిపోతావ‌ని ధ‌ర‌ణిపై ప్రేమ‌ను కురిపించిన‌ట్లుగా నాట‌కం ఆడుతాడు శైలేంద్ర‌. నిన్ను ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెట్టిన త‌ర్వాత నీ ప్రేమ త‌ప్ప నాకు ఏం క‌డ‌ప‌డ‌టం లేద‌ని, లైఫ్ లాంగ్ నాకు నువ్వు తోడుగా ఉంటే చాల‌ని, ఎండీ సీట్ కూడా అక్క‌ర‌లేద‌ు
దేవయాని: ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. పంతాలు, క‌క్ష‌లు మ‌ర్చిపోయాన‌ని, మీరిద్ద‌రు సంతోషంగా ఉంటే చాలు అని నటిస్తుంది.
అయినా ధ‌ర‌ణి కోపం త‌గ్గ‌దు ఆవేశంగా రూమ్ నుంచి వెళ్లిపోతుంది. త‌న‌ను ఎలా కూల్ చేయాలో తెలుసున‌ని త‌ల్లితో అంటాడు శైలేంద్ర‌.

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: కన్న తల్లినే చంపాడు అన్న నింద రిషి మీద వేసేసిన శైలేంద్ర, ఈసారీ తప్పించుకున్నాడుగా!

ముకుల్-అనుపమ
శైలేంద్ర ఇచ్చిన ట్విస్ట్‌తో ముకుల్ డైలమాలో ప‌డ‌తాడు. జ‌గ‌తి మేడ‌మ్ శిష్యుడిగా తొంద‌ర‌గా కేసును సాల్వ్ చేసి ఆమె ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని అనుకున్నాన‌ని, కానీ రానురాను ఈ మ‌ర్డ‌ర్ కేసు ఫ‌జిల్‌గా మారుతోంది.  శైలేంద్ర‌నే నిజ‌మైన హంత‌కుడిని అనుప‌మ‌కు చెబుతాడు ముకుల్‌.టెక్నాల‌జీని అడ్డుపెట్టుకొని త‌ప్పించుకున్నాడ‌ని అంటాడు. ఆ త‌ర్వాత రిషి గురించి ముకుల్‌ను అడుగుతుంది అనుప‌మ‌. లాస్ట్ టైమ్ రిషి ఫోన్ సిగ్న‌ల్స్ శైలేంద్ర జాయిన్ ఆయిన హాస్పిట‌ల్ ఏరియాలోనే చూపించాయ‌ని, ఆ త‌ర్వాత సిటీలో సిగ్న‌ల్స్ ఎక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని ముకుల్ అంటాడు. రిషి కార్ కూడా సిటీ బ‌య‌ట దొరికింద‌ని అంటాడు. ఆ మాట‌లు విని అనుప‌మ కంగారు ప‌డుతుంది. రిషిని ఎవ‌రైన కిడ్నాప్ చేశారా? అత‌డికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిందా అన్న‌ది తెలియ‌డం లేద‌ని ముకుల్ అంటాడు. ఎంత ట్రై చేసినా ఎలాంటి క్లూ దొర‌క‌డం లేద‌ని అనుప‌మ‌కు చెబుతాడు ముకుల్‌. రిషి క‌న‌బ‌డ‌కుండా పోవ‌డం వెనుక శైలేంద్ర మీద ఎటాక్ చేసిన రౌడీల‌ ప్ర‌మేయం ఉండొచ్చ‌ని అనుప‌మ అనుమానం వ్య‌క్తం చేస్తుంది. శైలేంద్ర మీద జ‌రిగిన ఎటాక్ కావాల‌నే అత‌డు చేయించుకున్న‌ట్లుగా అనిపిస్తుంద‌ని అనుప‌మ‌కు బ‌దులిస్తాడు ముకుల్. ప్రాణాలు పోకుండా జ‌రిగిన ఎటాక్ అద‌ని, జ‌గ‌తి హ‌త్య విష‌యంలో శైలేంద్ర ఫ్యామిలీ ఇన్‌వాల్వ్‌మెంట్ త‌ప్ప‌కుండా ఉండి ఉంటుందంచాడు.

Also Read: రిషి కారు దొరికింది కానీ! ముకుల్ కి అడ్డంగా దొరికిపోయిన శైలేంద్ర - షాక్ లో అనుపమ,ధరణి!

ధరణికి నిజం తెలిసిపోయింది
శైలేంద్ర‌పై ఎటాక్ చేసిన రౌడీలు  క‌ల‌వ‌డానికి ఇంటికి వ‌స్తారు. ఆ రౌడీల‌తో శైలేంద్ర మాట్లాడుతుండ‌గా ధ‌ర‌ణి చూస్తుంది. నేను చెప్పిన స్క్రిప్ట్ ప్ర‌కారం అద్భుతంగా చేశార‌ని రౌడీల‌ను మెచ్చుకుంటాడు శైలేంద్ర‌. మీరు సూప‌ర్ అంటూ వారిని పొగుడుతారు. అంతా బాగానే చేశారు కానీ చివ‌ర‌లో మీ ఫ్యామిలీని వ‌దిలిపెట్టం అనే డైలాగ్ నేను చెప్ప‌మ‌న‌లేదు క‌దా అది ఎందుకు అన్నార‌ని రౌడీల‌ను అడుగుతాడు శైలేంద్ర‌. ఫ్యామిలీ సెంటిమెంట్ క‌దా అని డైలాగ్ వాడాన‌ని రౌడీ అంటాడు. ఆ డైలాగ్ బాగా పండింద‌ని మెచ్చుకుంటాడు శైలేంద్ర‌. మ‌రోసారి రౌడీతో ఆ డైలాగ్ చెప్పించుకుంటాడు శైలేంద్ర‌.ఆ వాయిస్ విని ధ‌ర‌ణి గుర్తుప‌డుతుంది. త‌న భ‌ర్త‌పై ఎటాక్ చేసింది వాళ్లేన‌ని అటాక్ మొత్తం శైలేంద్రనే అని తెలుసుకుంటుంది. ఇంతా తాను సైలెంట్ గా ఉంటే శైలేంద్ర ఎంతమంది ప్రాణాలు తీస్తాడో ఏంటో...వీడు కుక్కలా చచ్చే వరకూ వదిలిపెట్టేది లేదనుకుంటుంది.  శైలేంద్ర నిజ‌స్వ‌రూపం వ‌సుధార‌, మ‌హేంద్ర‌ల‌కు చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. 

Also Read: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

మహేంద్ర-వసుధార
ఏ తప్పూ చేయకుండా చేయని నాకొడుకు కనిపించడం లేదు..భార్య చావుకి కారణం అయినవాడు కళ్లముందే ఉన్నా నేను ఏమీ చేయలేకపోయాను అని బాధపడతాడు మహేంద్ర. ఇంతలో ధరణి ఎంట్రీ ఇస్తుంది...
ధరణి: జ‌గ‌తి అత్తయ్య ప్రాణాలు తీసింది మా ఆయన  శైలేంద్ర‌నే. కిల్ల‌ర్‌కు డ‌బ్బులు ఇస్తుండ‌గా  నేను చూశాన‌ు..ముకుల్ వినిపించిన వాయిస్ శైలేంద్ర‌తో పాటు వినిపించిన మ‌రో వాయిస్ ఆ కిల్ల‌ర్‌దేన‌ని అంటుంది. జ‌గ‌తిపై అటాక్ గురించి నేనే వ‌సుధార‌కు చెప్పి హెచ్చ‌రించాన‌ు.  శైలేంద్ర మారిపోయాడ‌ని అనుకున్నాన‌ని, కానీ అదంతా అబ‌ద్ధ‌ం.. న‌న్ను ప్రేమ‌గా చూసుకుంటాన‌ని, ఇక‌పై ఎవ‌రికి ఎలాంటి హాని చేయ‌న‌ని  మాటిచ్చాడ‌ని, పిచ్చిదానిలా ఆ మాట‌లు న‌మ్మాన‌ని ధ‌ర‌ణి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. తను మారిపోలేద‌ని, త‌న‌ను మ‌భ్య‌పెట్ట‌డానికే,  నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్ట‌కుండా ఉండ‌టానికే నాట‌కం ఆడుతున్నాడ‌ని ధ‌ర‌ణి బాధ‌ప‌డుతుంది. శైలేంద్ర‌పై జ‌రిగిన ఎటాక్ కూడా ఫేక్ అని, ముకుల్‌కు వాయిస్ దొర‌క‌డంతో ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికే త‌న‌కు తానే రౌడీల‌కు డ‌బ్బులిచ్చి పొడిపించుకున్నాడ‌ని అంటుంది. ఆ ఎటాక్ గురించి ఎవ‌రికి అనుమానం రాకుండా నా క‌ళ్ల ముందే అదంతా జ‌రిగేలా ప్లాన్ చేశాడ‌ని అంటుంది. శైలేంద్ర‌ను పొడిచిన రౌడీల‌కు డ‌బ్బులివ్వ‌డం కూడా చూశాన‌ని అంటుంది. జ‌గ‌తి చావుకు, ఇప్పుడు రిషి క‌నిపించ‌క‌పోవ‌డానికి అన్నింటికి కార‌ణం మా ఆయ‌నేన‌ని అంటుంది.
అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన అనుప‌మ ధ‌ర‌ణి మాట‌లు విని షాక‌వుతుంది
అనుపమ: ధ‌ర‌ణి నువ్వు చెబుతున్నది నిజమా..
ధరణి: ఒట్టు మేడం..మా ఆయన దుర్మార్గాల గురించి మీకు తెలియ‌దు..ఇప్పుడు కాదు..మొద‌టి నుంచి రిషిని చంప‌డానికే  ప్ర‌య‌త్నించాడ‌ు
మహేంద్ర: ఇప్పుడు అర్థమైందా దోషి ఎవరో...
ధరణి: ఆయన ఫారెన్ నుంచి వచ్చాక ఎండీ సీట్‌పై ఆశ‌ప‌డి జ‌గ‌తిని చంపాడ‌ని, రిషిని చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ు
ఎపిసోడ్ ముగిసింది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Embed widget