అన్వేషించండి

Guppedantha Manasu August 8th Episode: పెద్ద షాకివ్వబోతున్న రిషి.. రంగాను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన శైలేంద్ర - గుప్పెడంత మనసు ఆగష్టు 08 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: రిషి రీ ఎంట్రీతో గుప్పెడంతమనసు కీలక మలుపు తిరిగింది . దేవయాని - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెట్టేందుకు వసుధార- రిషి కొత్త ప్లాన్ వేశారు.ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు ఆగష్టు 08 ఎపిసోడ్)

కాలేజీలో మళ్లీ ఎండీ బాధ్యతలు చేపట్టిన వసుధార.... ఫైల్స్ అన్ని పెండింగ్‌లోనే ఉండ‌టం చూసి కాలేజీ స్టాఫ్ పై ఫైర్ అవుతుంది.వెంటనే వాటికి సంబంధించిన పనులు పూర్తవ్వాలని స్ట్రాంగ్ గా చెబుతుంది. వ‌ర్క్ విష‌యంలో తాను నిజాయితీగా ఉంటాన‌ని, త‌న చుట్టూ ఉన్న‌వాళ్లు కూడా అలాగే ఉండాల‌ని కోరుకుంటానని చెబుతుంది. ఫైల్స్ పాస్ చేసేందుకు సైన్ చేస్తుండగా అక్కడకు వచ్చిన శైలేంద్ర వచ్చి అడ్డుకుంటాడు

శైలేంద్ర: ఏ అధికారంలో ఉన్నావ‌ని ఫైల్స్‌పై సంత‌కాలు చేస్తున్నావ‌ు. నువ్వు ఇప్పుడు ఎండీవి కాదు, క‌నీసం ఇన్‌ఛార్జ్ కూడా కాదు..ఎండీ సీట్‌కు రిజైన్ చేసిన త‌ర్వాత నీకు కాలేజీలో ఎలాంటి హోదా లేదు..నీ సంత‌కానికి విలువ లేదు. నువ్వు ఆర్డిన‌రీవే అంటాడు

ఇంతలో అక్కడకు రిషి రావడంతో..నువ్వేంటి మాట్లాడవు..నీ భార్య అని తప్పుచేసినా మాట్లాడకుంటా ఉంటావా అని అంటాడు

రిషి: మీరు చెప్పిందే నిజం..వ‌సుధార ఇప్పుడు ఎండీ కూడా కాద‌..తన సంత‌కం చెల్ల‌ద‌ు. నీకు ఇప్పుడు అధికారం లేద‌ు, ఈ సీట్‌లో కూర్చున్న వారే ఆ ఫైల్స్ పాస్ చేయాల‌ి

స్టాఫ్: ఇప్పుడు ఎండీ ఎవరూ లేరుకదా ..మరి ఫైల్స్ ఎలా పాస్ అవుతాయి

శైలేంద్ర:  రాజీనామా చేసిన వాళ్లు, అర్హ‌త లేనివాళ్లు సంత‌కాలు పెడితే ఊరుకునేది లేదు..ఈ రోజు వసుధార వచ్చింది, రేపు ఇంకొకరు వస్తారు.. ఎవరికి నచ్చకపోతే వాళ్లు లేచి వెళ్లిపోవాలని ఆలోచించి మళ్లీ వచ్చి కూర్చోవడం సరికాదు

రిషి: వ‌సుధార స్టూడెంట్స్ మంచి కోస‌మే ఫైల్స్ పాస్ చేయాల‌ని అనుకుంటుందేమో...

శైలేంద్ర: నువ్వు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావా

రిషి: నువ్వు చెప్పినట్టే అన్నీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి..త్వ‌ర‌లోనే బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎండీ ప్రకటిస్తాను
 
వ‌సుధార క్యాబిన్ నుంచి బ‌య‌ట‌కు రాగానే ఎండీగా నా పేరు ఎందుకు చెప్ప‌లేద‌ని రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. వ‌సుధార అడిగిన వెంట‌నే నా పేరు చెప్పాల్సింద‌ని అంటాడు. అలా వెంట‌నే పేరు చెప్పేస్తే తాను రిషి కాదు రంగాన‌ని వ‌సుధార ఈజీగా క‌నిపెడుతుంద‌ని అందుకే చెప్పలేదంటాడు. ఆ లాజిక్ విని శైలేంద్ర ఓకే అంటాడు.  

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: ఇంటికి వెళ్లిపోతానన్న మహేంద్ర – కాలేజీకి వెళ్లిన రిషి, వసుధార

ఏంజెల్ - రిషి
కాలేజీలో రిషిని చూసి ఏంజెల్ ఎమోష‌న‌ల్ అవుతుంది. నువ్వు చ‌నిపోయావ‌ని వార్త‌ల్లో న్యూస్ చూడ‌గానే నా గుండె ఆగినంత ప‌నైంది. వ‌సుధార మాత్రం నువ్వు బ‌తికే ఉన్నావ‌ని న‌మ్మంది. ఎవ‌రి మాట‌లు న‌మ్మాలో తెలియ‌క ఎన్నో సార్లు క‌న్నీళ్లు పెట్టుకున్నానో...ఇప్పుడు నిన్ను మ‌ళ్లీ చూసిన త‌ర్వాతే నాకు కొండంత ధైర్యం వ‌చ్చింది.

రిషితో ఏంజెల్ మాట్లాడ‌టం చూసిన శైలేంద్ర...తాను ఏంజెల్ ఫొటో చూపించ‌కుండానే నిజంగానే ప‌రిచ‌యం ఉన్న‌వాడిలా ఎలా మాట్లాడుతున్నాడ‌ని కంగారు ప‌డ‌తాడు. రంగాలా త‌న ముందు నటిస్తున్నది నిజంగానే రిషినా అనే అనుమానం శైలేంద్ర‌లో మొద‌ల‌వుతుంది. ఏంజెల్‌తో రిషి ఏం మాట్లాడుతున్నాడో వినాల‌ని దాక్కుంటాడు. అది గమనించిన రిషి..ఈ అమ్మాయి ఎవ‌రో బెస్ట్ ఫ్రెండ్ అని చ‌నువుగా మాట్లాడుతూ ప్రాణాలు తీస్తోందని, నేను ఎలాగోలా మ్యానేజ్ చేస్తున్నాన‌ని...ఈమె గురించి ఎందుకు చెప్పలేదని శైలేంద్రకి మెసేజ్ చేస్తాడు..హమ్మయ్య అనుకుంటాడు శైలేంద్ర. వాళ్ల మధ్యకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర..మ‌ను ఎక్క‌డ అని అడుగుతాడు. మా బావ నీ ముఖం చూడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని చెప్పి..రిషిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  

ఏంజెల్ - వసుధార
రిషిని తిరిగి తీసుకొచ్చిన వ‌సుధార‌ని ఏంజెల్  తెగ పొగడేస్తుంది. రిషితో పాటు నా ప్రాణం వెన‌క్కి తెచ్చుకున్నాన‌ు, రిషి లేక‌పోతే ఈ వ‌సుధార లేన‌ట్టేనని ఎమోష‌న‌ల్‌ అవుతుంది. . మ‌ను ఎందుకు కాలేజీకి రావ‌డం లేద‌ని ఏంజెల్‌ను అడుగుతుంది వ‌సుధార‌. ఏమైందో తెలియ‌దు కానీ మ‌హేంద్ర ద‌గ్గ‌ర నుంచి వెళ్లిపోవ‌డంతో పాటూ  అనుప‌మ కాలేజీకి కూడా రావ‌డం లేదంటుంది ఏంజెల్. దీని వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంద‌ని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది. త‌న తండ్రి ఎవ‌రో  మనుకి ఇప్పటికీ తెలియలేదని ఏంజెల్ చెప్పచంతో ..తాను రాసిన లెటర్ చదవలేదని అర్థమవుతుంది. ఆ విషయం   చెప్పాల‌ని వ‌సుధార అనుకుంటుంది. కానీ మను ఆమె మాట వినడు...తండ్రి గురించి తాను చెప్పే వ‌ర‌కు ఎవ‌రిని అడ‌గొద్ద‌ని అనుప‌మ త‌న ద‌గ్గ‌ర‌ మాట తీసుకుంద‌నే నిజం బ‌య‌ట‌పెడ‌తాడు. కాలేజీకి ఎందుకు రావ‌డం లేద‌ని అడిగితే మీరు, రిషి వచ్చారు కదా ఆ టాపిక్ వదిలేయండి అనేస్తాడు.

Also Read: ఆగష్టు 08 రాశిఫలాలు - ఈ రాశులవారు ప్రతి పనిని ఏకాగ్రతతో, భక్తితో చేస్తారు..అందుకే ప్రశంసలు అందుకుంటారు!

శైలేంద్ర సంబరం
రేపో మాపో తాను ఎండీని కాబోతున్న‌ట్లు సంబ‌ర‌ప‌డిపోతాడు శైలేంద్ర . త‌న‌నే ఎండీ అని రంగా ప్ర‌క‌టించ‌డం ఖాయ‌మ‌ని త‌ల్లితో చెబుతాడు. రంగా నిజంగానే నీ పేరు చెబుతాడా అంటూ అనుమాన‌ప‌డుతుంది దేవ‌యాని. వాడు మనం చెప్పినట్టే చెబుతాడు అంటాడు శైలేంద్ర. వీలైనంత తొంద‌ర‌గా ప‌ని పూర్తిచేసి రంగాను ఊరు పంపించ‌మ‌ని దేవయాని అంటే..మన రహస్యాలు బయటపడతాయి అందుకే వాడిని తిరిగిరానిలోకాలకు పంపిస్తానంటాడు. పని పూర్తైన వెంటనే వాడిని చంపేస్తానని క్లారిటీ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ధరణి..ఏం మాట్లాడుకుంటున్నారని నిలదీస్తుంది...

ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది... గుప్పెడంత మనసు ఆగష్టు 09 ఎపిసోడ్ లో కాలేజీ ఎండీగా ఎవర్ని ప్రకటిస్తారో చూడాలి....

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget