2024 Horoscope Today 08 Augsut: ఆగష్టు 08 రాశిఫలాలు - ఈ రాశులవారు ప్రతి పనిని ఏకాగ్రతతో, భక్తితో చేస్తారు..అందుకే ప్రశంసలు అందుకుంటారు!
Horoscope Prediction 8 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 8 August 2024
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇంటి పనులతో చాలా బిజీగా ఉంటారు. ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రక్తపోటు సమస్య ఉంటుంది.
వృషభ రాశి
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. సామాజిక సేవలో పాల్గొంటారు. పిల్లలు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రోజు తలనొప్పి, ఒత్తిడి సమస్య ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రోజు సన్నిహితులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఇతరులు చెప్పే మాటలను వెంటనే నమ్మవద్దు. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు పనితీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి. విదేశాల్లో వ్యాపారం చేసేవారు వ్యాపారం విస్తరిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి నిరీక్షణ ఫలిస్తుంది. ఎదుటివారికి సహాయం చేయండి
Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!
సింహ రాశి
ఈ రోజు మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుపై నిఘా ఉంటుంది. ఇంజినీరింగ్‌తో అనుబంధం ఉన్నవారు మరింత కష్టపడాల్సి వస్తుంది. మేధో నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. కంటి సమస్యలతో బాధపడాల్సి రావొచ్చు.
కన్యా రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటాకు. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది..అందుకే అందరూ మీ పట్ల తొందరగా ఆకర్షితులవుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్రతి పనిని ఏకాగ్రతతో, భక్తితో చేస్తారు. మీరు ప్రశంసలు అందుకుంటారు.
తులా రాశి
ఈ రోజు అనవసర ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఉండే పెద్దలతో విభేదాలు రావొచ్చు. మీ లోపాలపై కాకుండా మీ స్టెంగ్త్ పై దృష్టి పెట్టండి. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తుల సలహా తీసుకోవడం సరికాదు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఏం చేసినా విజయం సాధిస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది. అనవసర ప్రయాణాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ఇతరులపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రేమ సంబంధాలకు రోజు మంచిది
మకర రాశి
ఈ రోజు అదనపు ఆదాయం కోసం ఇతర మార్గాలపై దృష్టిసారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏదో విషయంలో మానసికంగా ఇబ్బంది పడతారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివ్యాపారులు నష్టపోతారు. ఆలోచించకుంటా నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఒత్తిడి గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!
మీన రాశి
ఈ రోజు ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో మెప్పిస్తారు. స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. మీరు బహుమతి పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.