అన్వేషించండి

Guppedantha Manasu మే 9 ఎపిసోడ్: వసుధార, సాక్షి ఫేస్‌ టు ఫేస్- రెస్టారెంట్‌లో ఇద్దరి మధ్య వార్- గౌతమ్‌ లవ్‌ ఫెయిల్యూర్ పార్టీ ఇస్తున్న రిషి

దేవయానికి చెప్పిన మాటలతో సాక్షి ఇప్పుడు నేరుగా వసుధారతో ఢీ కొట్టేందుకు రెడీ అయింది. రెస్టారెంట్‌ ఫస్ట్‌ టైం వీళ్లద్దు గొడవ పడనున్నారు.

అమెరికా నుంచి వస్తూనే నిన్న చూశానని... అప్పుడే ప్రేమలో పడిపోయానని వసుధారతో చెప్తాడు గౌతమ్. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నానని... కానీ ఇవాళ ధైర్యం చేశానని అంటాడు గౌతమ్. ఇదే మాట వేరే వాళ్లు చెప్పి ఉంటే చెంప పగులగొట్టేద్దాన్ని అని... మీరు రిషి సార్ ఫ్రెండ్‌ కాబట్టి వదిలేస్తున్నాని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. తనకు లైఫ్‌లో లక్ష్యం ఉందని... అది తప్ప వేరే ధ్యాస లేదని చెప్పేస్తుంది వసు. మొత్తం విన్న గౌతమ్‌ నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని వసుధారను అడుగుతాడు. ఎక్కడో దూరంగా ఉండి ఇదంతా వింటున్న రిషికి ఇదంతా చాలా ఆనందాన్ని ఇస్తుంది. గౌతమ్‌కు ఓకే చెప్పేస్తుందేమో అని కాస్త టెన్షన్ పడ్డా... వసు ఇచ్చన రిప్లైతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారో తెలుసుకోవడమే నా గోల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

మనసులో ఎవరైనా ఉన్నారా అని గౌతమ్ అడిగేసరికి ఎలాంటి సమాధానం చెప్పాలో వసుధారకు అర్థం కాదు. ఎవరున్నారని చెప్పనూ అంటూ ఆలోచిస్తుంది. ఇంతలో గౌతమ్‌ పిలిచి నాలో ఉన్న లోపం ఏంటని ప్రశ్నిస్తాడు. ప్రేమించకపోవడానికి రీజన్ ఏంటని అడుగుతాడు. 

ఆస్తులు, అంతస్తులు ఉంటే ప్రేమ పుట్టదని అదో ఆత్మ భాష అని ఒకరు ఐలవ్‌యూ అని చెప్పిన వెంటనే పుట్టేది ప్రేమ ఎలా అవుతుందని వసుధార ప్రశ్నిస్తుంది. తనకు జీవితంలో ఓ లక్ష్యం ఉందని చెప్పేస్తుంది. నా ఆలోచన అంతా దానిపైనే ఉందంటుంది. చదువుకోసం అందర్నీ వదిలేసి వచ్చి అనాథలా బతుకుతున్నానని వివరిస్తుంది. సమయం సందర్భం వస్తే ప్రేమ, పెళ్లి ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని క్లియర్ చేస్తుంది వసుధార. 

గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్‌ను తిరిగి ఇచ్చేస్తుంది వసుధార. అది నీకు నచ్చుతుందని.. అందుకే మీ వద్దే ఉంచుకోమని చెప్తాడు గౌతమ్. ఆ పెయింట్‌ తెరిచి చూడమని రిక్వస్ట్ చేస్తాడు. చూసి షాక్ అవుతుంది వసుధార. అది ఎవరు గీశారు అని అడుగుతుంది. అది రిషి గీశాడని చెప్పి ఫూల్ అవ్వడం ఇష్టం లేక... కనుక్కోమని వసుధారకే ఫజిల్ ఇస్తాడు. 

కారులో కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటాడు. గౌతమ్‌ బాధతో కారు వద్దకు వస్తాడు. ఏం తెలియనట్టు రిషి క్వశ్చన్స్ వేస్తుంటాడు. తన లవ్‌ ఫెయిల్‌ అయిందని.. తాను ఓడిపోయానని చెప్తాడు గౌతమ్. వసుధార తన ప్రేమను రిజెక్ట్ చేసిందని బాధతో చెప్తాడు గౌతమ్. 
బలవంతంగా గౌతమ్‌ను కారులో ఎక్కించి తీసుకెళ్తాడు రిషి. 
కారులో కూర్చొన్న గౌతమ్‌... వసుధార మనసులో ఎవరో ఉన్నారని చెప్తాడు. తన మనసులో ఎవరున్నారో వసుధారతో చెప్పిస్తే బాగుంటుందని రిషి మనసులో అనుకుంటాడు.

గౌతమ్‌ ఇచ్చిన పెయింటింగ్‌ను చూసి మురిసిపోతుంది వసుధార. ఆ పెయింట్‌ వేసిందెవరూ అని ఆలోచిస్తుంది. ఆ వ్యక్తి మనసులో అంతలా నా రూపం ముద్రించుకుపోయిందా అని అనుకుంటుంది. 

రిషి కూడా ఆ పెయింట్‌ కోసం ఆలోచిస్తుంటాడు. వసుధార ఆ పెయింట్‌ కోసం కచ్చితంగా ఆలోచిస్తుంటుందని అనుకుంటాడు. గౌతమ్‌ చేసిన ఏకైక గొప్ప పని ఇదేనని అంటాడు. 

వసుధారకు అప్పట్లో తనకు అజ్ఞాత వ్యక్తి రాసిన ప్రేమ లేఖ సంగతి గుర్తుకు వస్తుంది. ఎవరో తనను ఫాలో అవుతున్నారని.. అప్పుడు ప్రేమ లేఖ రాశారు.. ఇప్పుడు బొమ్మ గీశారని అనుకుంటుంది. ఇంతలో తన కూడా ఓ లెట్ రాయడం స్టార్ట్‌ చేస్తుంది. 

అదే టైంలో అప్పుడు చించేసిన లేఖను చదువుతుంటాడు రిషి. అందులో గుర్తున్న  పదాలను రాస్తుంటుంది వసుధార. ఈ రెండు చేసిన వ్యక్తి ఒక్కరేనా అని అనుకుంటుంది. 

మహేంద్ర, జగతి ఇద్దరూ రిషి కోసం మాట్లాడుకుంటారు. రిషిని కలిశావా అని అడుగుతుంది జగతి. ప్రేమ ఉంటే తనే రావాలి కదా అని అడుగుతాడు మహేంద్ర. ఇంతలో రిషి వచ్చి డాడ్‌ మీకో సర్‌ప్రైజ్ అంటాడు. తను పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. తన మనసు ఎందుకో హ్యాపీగా ఉందని అందుకే పార్టీ ఇస్తున్నట్టు చెబుతాడు. ఆ పార్టీకీ చీఫ్‌ గెస్ట్‌గా గౌతమ్ పేరు చెబుతాడు. ఆ మాట విన్న గౌతమ్‌ ఇంకా కుంగిపోతాడు. తన ప్రేమ ఫెయిల్ అయిందని పార్టీ చేసుకుంటావా అని గౌతమ్‌ మనసులో అనుకుంటాడు. ఇక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. 

రేపటి ఎపిసోడ్‌

పార్టీ సంగతి చెప్పకుండా ఎక్కడో వెళ్లాలని వసుధారకు చెప్తాడు రిషి. నీ డ్యూటీ అయ్యే వరకు రెస్టారెంట్‌లోనే వెయిట్ చేస్తానంటాడు. ఎక్కడి వెళ్లాలి అని అడుగుతుంది వసుధార. అక్కడే ఉన్న సాక్షి ఇదంతా వింటుంది. ఏంటీ చీప్‌గా వసుధారతో తిరుగుతున్నాడని అనుకుంటంటుంది. వెంటనే రిషి వద్దకు వచ్చి హాయ్ చెబుతుంది. ఆమె రాగానే అక్కడి నుంచి లేచి సీరియస్‌గా వెళ్లిపోతాడు. ఇంతలో వసుధార అక్కడకు వస్తుంది. సాక్షి చాలా రఫ్‌గా ఏయ్‌ అని పిలుపుస్తుంది. ఆ పిలుపు ఏంటి మేడం అని అడుగుతుంది వసుధార. నీకు పొగరు చాలా ఎక్కువ ఉన్నట్టు ఉందని అంటుంది సాక్షి. ఈసారి రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు డబ్బులతోపాటు కాస్త మర్యాద తీసుకురండీ అని చెప్పి గట్టిగానే రియాక్ట్ అవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget