అన్వేషించండి

Guppedantha Manasu మే 10 ఎపిసోడ్: రిషికి ఐలవ్‌యూ చెప్పేసిన వసుధార- షాక్‌లో మాట్లాడలేకపోయిన లెక్చరర్‌

ఫస్ట్‌ టైం రిషిపై వసుధారకు లవ్‌ఫీలింగ్ కలిగినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు వన్‌సైడ్‌గా ఉన్న లవ్‌ ఇప్పుడు రెండో సైడ్‌ నుంచి కూడా స్టార్ట్ అయింది.

తన లవ్‌ను వసుధార రిజెక్ట్ చేసిందని బాధలో ఉన్న గౌతమ్‌ను మరింత ఏడిపిస్తుంటాడు రిషి. గౌతమ్‌ చీఫ్‌ గెస్ట్‌గా పార్టీ ఇస్తున్నానని మహేంద్రకు చెప్తాడు రిషి. ఇలాంటి వాటికి హ్యాపీగా ఫీల్ అవ్వలే కానీ డల్‌ అయిపోతావేంటని గౌతమ్‌ను ఉత్సాహ పరుస్తాడు మహేంద్ర. సరదాగా పార్టీ ఇద్దామనుకున్నానని చెప్తాడు. ఇంతలో గౌతమ్‌ తాను పార్టీకి రానని.. చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి కూడా పార్టీ క్యాన్సిల్ చేసేస్తాడు. వస్తే లేని పోని ప్రశ్నలతో వేధిస్తారని మనసులో అనుకొని వెళ్లిపోతాడు. తాను వస్తానని చెప్పే పార్టీని రిషి క్యాన్సిల్ చేశాడని జగతి అనుకుంటుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటావు రిషి అని అనుకుంటుంది. 

బెడ్‌రూమ్‌కి వెళ్లి వసుధార కోసం రిషి ఆలోచిస్తాడు. ఇంతలో వసుధార మెసేజ్ చేస్తుంది. రిషి గీసిన బొమ్మ ఫొటో పెడుతుంది. ఎలా ఉందని అడుగుతుంది. బాగుందని నీలాగే ఉందని సమాధానం చెప్తాడు రిషి. ఎవరు గీశారని అడుగుతాడు రిషి. తెలుసుకోవాలని సమాధానం ఇస్తుంది వసుధార. మనం ఓసారి కలవాలని అడుగుతుంది. కలవడానికి వస్తే మొహానే తలుపులు వేసేస్తావని గుర్తు చేస్తాడు రిషి. రెస్టారెంట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సమాధానం చెప్తుంది వసుధార. ఆ సమాధానానికి షాక్ తింటాడు రిషి. నేను అడిగిందానికి ఎంత తెలివిగా సమాధానం ఇచ్చిందో అనుకుుంటాడు రిషి. వసుధార ఎదురుగా లేకుండా, ఫొటో చూడకుండా ఆ బొమ్మ ఇంత బాగా ఎలా గీయగలిగానో అనుకుంటాడు. 

సాక్షి వచ్చి దేవయానిని కలుస్తుంది. మనసు బాగాలేదని అందుకే వచ్చి కలుద్దామని అనుకున్నానని చెప్తుంది. రిషి మరీ ఇంత కఠినంగా ఉన్నాడేంటో అనుకుంటుంది సాక్షి. ఇంత నిరాశ అయితే ఎలా అన్న దేవయానికి సాక్షికి హితబోధ చేస్తుంది. రిషి మనసులో ప్రేమ మొలకెత్తాలంటే చాలా టైం పడుతుంది. ఇలాంటి చిన్నచిన్న వాటిని భరించాలంటుంది. నీ మాటల్లో, లుక్స్‌లో సంపూర్ణ ప్రేమ కనిపించాలని గైడ్ చేస్తుంంది. ఎంత నిరాశ ఉన్నా రిషిని వదిలిపెట్టి వెళ్లబోనంటూంది సాక్షి. 

వసుధారను కలవడానికి రెస్టారెంట్‌కు రిషి వెళ్తాడు. మనం ఎక్కడికి వెళ్లాలి సార్ అని అడుగుతుంది వసుధార. చంద్రమండలానికి వెళ్లి వచ్చేద్దామని చెప్తాడు. దానికి నవ్వుతుంది. అక్కడే ఉన్న సాక్షి ఇదంతా చూస్తుంది. దీంతో చీప్‌గా రిషి తిరుగుతున్నాడని అనుకుంటుంది. ఇదేదో మాయ చేస్తుందని అనుమానం పడుతుంది. 

వసుధార అక్కడి నుంచి వెళ్లిన వెంటనే వచ్చి రిషిని పలకరిస్తుంది సాక్షి. సీరియస్‌గా చూసిన రిషి... ముబావంగానే హాయ్ చెప్తాడు. తాను వచ్చింది కాఫీ కోసం కాదని.. నీకోసమే అని చెప్తుంది. అది విన్నాక రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

ఇంతలో చిటికేసి వసుధారను పిలుస్తుంది సాక్షి. మర్యాద లేకుంటే ఇక్కడ నీకేమీ దొరకదని సాక్షికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. కాఫీ తీసుకురమ్మంటే నా డ్యూటీ అయిపోయిందని చెప్తుంది వసుధార. పొగరు చాలా ఎక్కువ ఉందని సాక్షి అడుగుతుంది. అది పొగరు కాదని.. ఆత్మగౌరవమని చెబుతుంది వసు. ఈసారి వచ్చినప్పుడు డబ్బులతోపాటు కాస్త మర్యాద కూడా తీసుకురమ్మని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో వసుకి రిషి నుంచి మెసేజ్ వస్తుంది. చెప్పకుండా వెళ్లినందుకు సారీ చెప్తాడు. లొకేషన్ కూడా పంపిస్తాడు. వచ్చి కలవమని చెప్తాడు. 

ఇద్దరూ ఓ చోట కలుస్తారు. మాట్లాడదామని రమ్మని చెప్పానంటాడు రిషి. రెస్టారెంట్‌లో వాతావరణం నాకు నచ్చలేదంటాడు. బొమ్మ గురించి అడుగుతాడు. ఎవరు గీశారో తెలియదని సమాధానం చెబుతుంది వసు. తెలుసుకోవాలని అనుకుంటుంది. 

ఈ మాటల సందర్భంగానే సడెన్‌గా ఐల్‌వ్‌యూ చెబుతుంది. ఒక్కసారి అలా చెప్పేసరికి రిషి ఫ్యూజుల్ ఎగిరిపోతాయి. ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే అందుకున్న వసుధార... ఐలవ్‌యూ మేటర్ చెప్పాలని కవర్ చేస్తుంది. గౌతమ్‌ చెప్పిన లవ్‌ ప్రపోజల్‌ గురించి వివరిస్తుంది. ఎందుకు రిజెక్ట్‌ చేశావని అడుగుతాడు. చెప్పిన వెంటనే ప్రేమ పుట్టదని చెప్తుంది వసుధార. మరి ప్రేమ ఎప్పుడు పుడుతుందని అడుగుతాడు రిషి. అది ఎప్పుడు ఎలా ఎవరిపై పుడుతుందో మనకు తెలియదని చెప్పేస్తుంది. మన మనసులో ఎవరున్నారో లేదో మనకే తెలియదని వివరిస్తుంది వసుధార. మనసు మనతోనే దోబూచులాట ఆడుతుందంటుంది.  నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని  అడుగుతాడు రిషి. తడుముకోకుండా ఉన్నా ఒక్కోసారి మనకే లేట్‌గా తెలుస్తుందని చెక్‌చేసుకోవాలని సమాధానం చెబుతుంది. మరి మీ మనసులో అని అడిగే సరికి కాసేపు సైలెంట్ అయిపోతాడు. నువ్వే చెప్పావుగా ఉన్నా తెలియదని... నేనూ చెక్‌ చేసుకోవాలని కవర్ చేస్తాడు. వెళ్దామని ఇద్దరూ బయల్దేరతారు. కారు డోర్‌కు వసుధార చున్నీ చిక్కుకుంటుంంది. తీస్తుంటే రాదు... చెప్పొచ్చు కదా అని వచ్చి దాన్ని తీస్తాడు రిషి. అ టైంలో రిషిని చూస్తూనే ఉండిపోతుంది వసుధార. ఆ చున్నీ తీసే క్రమంలో పూర్తిగా లాగేస్తాడు. కాస్త సిగ్గుపడుతూ ఉండిపోతుంది వసుధార. సారీ చెప్పి ఆ చున్నీ ఇచ్చేస్తాడు. 

రేపటి ఎపిసోడ్
వెళ్లిపోయిన తర్వాత రిషి అప్పట్లో రాసిన ప్రేమ లేఖ పట్టుకొని మాట్లాడుకుంటాడు. పక్కనే ఉన్న మహేంద్ర ఇదంతా చూసి వచ్చి జగతిని తీసుకెళ్లి ఆ లెటర్ చూపిస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. 
సీన్‌ కాలేజీకి మారిపోతుంది. తన క్యాబిన్‌లో ఉన్న వసుధారతో మాట్లాడుతుంటాడు రిషి. కొన్ని ఫైల్స్ పడిపోతుంటే వసుధార పట్టుకుంటుంది. భలే క్యాచ్ చేశానంటుంది.. వదులు కోవడం ఈజీ కానీ పట్టుకోవడమే కష్టమంటాడు.. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Embed widget