అన్వేషించండి

Guppedantha Manasu June 9th (ఈరోజు) ఎపిసోడ్: గౌతమ్‌ ప్రశ్నలకు కుంకుమతో వసుధార సమాధానం- తల్లిని తన గది నుంచి వెళ్లిపోమన్న రిషి

కాలేజీకి వచ్చిన రిషికి పువ్వులతో స్వాగతం పలుకుతారు స్టూడెంట్స్. ఈ ఫ్లవర్స్ అవి నాకు వద్దని చెప్తాడు రిషి. వసుధార పట్టుకున్న పువ్వు మాత్రం రిషి జేబులో చూస్తాడు మహేంద్ర.

సాక్షిని లాక్కుని వెళ్లిపోతుంది జగతి. ఇంతలో ఆమెకు దేవయాని అడ్డం పడుతుంది. ఏం చేస్తున్నావ్‌ అని అడుగుతుంది. చేయాల్సిందే చేస్తున్నాను అక్కయ్య అని సమాధానం చెబుతుంది. చూడండి అంటీ... రిషితో మాట్లాడుతుంటే లాక్కొచ్చేశారు అని కంప్లైంట్‌ చేస్తుంది సాక్షి. జగతి ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా అని క్వశ్చన్ చేస్తుంది దేవయాని. నాకు చాలా బాగా అర్థమవుతుంది అక్కయ్య. రిషి యాక్సిడెంట్‌ అయ్యి బెడ్‌పై పడుకొని ఉంటే.. ప్రశ్నలు వేస్తోందని జవాబులు కావాలని అడుగుతుందని చెబుతుంది జగతి. ఏది ఏది అవసరమో.. ఏది అనవసరమో మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని సాక్షి ఎదురు తిరుగుతుంది. మినిమం కామన్‌సెన్స్‌ ఉంటుంంది సాక్షి అంటుంది జగతి. అక్కడకు వచ్చి నీ ప్రశ్నలతో వేధించడం అవసరమా అని సమాధానం చెబుతుంది జగతి. ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలా అని నిలదీస్తుంది. 

జగతీ ఎక్కువ చేస్తున్నావంటుంది దేవయాని. సాక్షి ఎక్కువ చేసిందని గట్టిగానే సమాధానం చెబుతుంది జగతి. యాక్సిడెంట్‌ అయిన వ్యక్తి వద్దకు నడుచుకోవాల్సిన పద్దతేనా అది అని ప్రశ్నిస్తుంది జగతి. తనకు లేకపోయినా మీరైనా చెప్పాలి కదా అని దేవయానిని అడుగుతుంది. ఏంటీ సాక్షి తను చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. ఆంటీ మీరు తను చెప్పేది నమ్ముతున్నారా అని బదులిస్తుంది సాక్షి. నేను వెళ్లాను రిషితో మాట్లాడుతుంటే ఏదో అధికారం ఉన్నట్టు లాక్కుస్తున్నారేంటీ అంటుంది సాక్షి. రిషి తల్లిగా నాకు అధికారం ఉందంటుంది జగతి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందంటుంది జగతి. అర్జెంట్‌గా నీకు ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఏం చేస్తానో నాకు తెలియదంటుంది. రిషి మీకు కొడుకే కావచ్చు అని సాక్షి అనబోతుంటే గట్టిగా అరుస్తుంది జగతి. ఇంకోక మాట మాట్లాడిన బాగోదని వార్నింగ్ ఇస్తుంది. మర్యదగా వెళ్లిపోమంటుంది. వెళ్లి ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది జగతి. తర్వాత మాట్లాడదామని దేవయానికి కూడా సాక్షిని పంపించేస్తుంది.  

ఏంటీ జగతి.. రిషికి ఏదో జరిగిందని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నావా... రిషికి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నావా... రిషి ఎప్పటికీ నీ మాట వినడు... తల్లిగా ఎప్పటికీ నిన్ను అంగీకరించడు అంటుంది దేవయాని. అక్కయ్య మీకు మళ్లీ చెప్తున్నాను.. రిషి నన్ను తల్లిగా అంగీకరించినా లేకపోయినా నాకు బాధ లేదని... రిషి బాగుండాలని నేను కోరుకుంటున్నానని అంటుంంది జగతి. రిషిని కన్నది నేను... ఎలాంటి స్వార్థం లేకుండా మంచిని కోరుకుంటున్నది నేను.. సాక్షిని అడ్డుపెట్టుకొని ఏదో చేయాలని చూడకండి అని దేవయానికి వార్నింగ్ ఇస్తుంది. చూస్తూ ఊరుకోను... నన్ను బాధ పెడితే సహిస్తానేమోగానీ.. నా కొడుకును ఇబ్బంది పెడితే సహించలేను అక్కయ్య అంటుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టావ్.. అది నీ అదృష్టం అనుకో... మహేంద్రకు భార్యగానే మిగిలిపోతావ్. రిషికి తల్లిగా ఎప్పటికీ ఉండలేవ్‌.. నీ తలరాతను మార్చుకోవాలని చూస్తున్నావేమో... నీ నుదుటన రాత రాసింది దేవుడే కావచ్చేమో కానీ.. ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది. నేను చేయాలన్నదే చేస్తాను... ఇది గుర్తుపెట్టుకో అని దేవయాని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. 

ధరణి అక్కడకు వచ్చి... వసుధార వచ్చిందని.. పెద్దత్తయ్య లోపలికి రాకుండా అడ్డుకుందని బయటకు పంపించేసిందని చెబుతుంది. సారీ వసూ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను అనుకుంటుంది వసుధార. 

ఇంటి బయటే ఉన్న వసుధార మాత్రం ఇవాళ ఎలాగైనా రిషి సార్‌ను చూడకుండా వెళ్లను అనుకుంటుంది. 

రిషి పక్కనే కూర్చొని ఉన్న మహేంద్ర రిషి పరిస్థితి చూసి బాధ పడుతుంటాడు. ఇంతలో ఆయనకు వసుధార వీడియో కాల్‌  చేస్తుంది వసుధార. ఎలా ఉన్నారని అడుగుతుంది. పక్కనే ఉన్న రిషిని చూపిస్తాడు. ఒక్కసారి రావచ్చు కదమ్మా అని అడుగుతాడు మహేంద్ర. నేను వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుకదా సార్ అంటుంది. మహేంద్ర అర్థం చేసుకొని వదినగారు ఆపారా అని అడుగుతాడు. అవును అన్నట్టు సమాధానం చెప్తుంది. 

ఇంతలో మెలకవు వచ్చిన రిషి... ఫోన్‌లో ఎవరు అని అడుగుతాడు. వసుధార అని చెప్తాడు మహేంద్ర. మాట్లాడతావా అని అడుగుతాడు. వద్దన్నట్టు తల ఊపుతాడు రిషి. ఇంతలో సరే సార్ నేను ఉంటాని పెట్టేస్తుంది వసుధార. వసుధారతో మాట్లాడాల్సింది కదా రిషి అని అంటాడు మహేంద్ర. కాల్ కనెక్ట్ చేయనా అని అంటాడు. వద్దని రిషి అంటాడు. నిన్ను ఇంటికి తీసుకొచ్చింది వసుధారే అని నీకు తెలుసు కదా అంటాడు మహేంద్ర. అవును అన్నట్టు తలాడిస్తాడు రిషి. 

ఇంటి బయట ఉన్న వసుధార వద్దకు గౌతమ్ వస్తాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వసుధార. వసుధార... రిషిని ఆసుపత్రికి తీసుకెళ్లావు... ఇంటికి తీసుకొచ్చావు.. ఇంట్లోకి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ఆ ఆదృష్టం లేదంటుంది వసుధార. రిషి సార్ ఎలా ఉన్నారని అడుగుతుంది. ఆ బెడ్‌పై వాడని చూడలేకపోతున్నాను అంటాడు గౌతమ్. నీ అభిమానం చాలా గొప్పది... కానీ రిషిని ఎందుకు కాదన్నావో అర్థం కావడం లేదంటాడు. వాడు చాలా సెన్సిటివ్‌... ఏదో గాంభీర్యంగా ఉన్నట్టు నటిస్తాడే కానీ... చిన్న వెదవ... వాడి మనసు క్లాస్‌ రూంలో బోర్డు లాంటింది ఏమున్నా... ఆ తర్వాత అన్నీ క్లియర్ అయిపోతాయి.. నాకు నువ్వు నో చెప్పాక.. నువ్వు ఏం ఫీలయ్యావో తెలియదు కానీ.. రిషికి నో చెప్పాక చాలా ఫీల్ అవుతున్నావ్‌ కదా... వసుధార నాకు సమాధానం అక్కర్లేదు.. నీ మనసు నువ్వే సమాధానం చెప్పుకో... రిషి గాడిని తలచుకుంటే ఏమైపోతాడో అని భయంగా ఉంది. రిషిపై నాకు ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత నీకు ఉంది. పెద్దమ్మ రావద్దని చెప్పాక నీ దారిన నువ్వు వెళ్లిపోవచ్చు... కానీ నీవు వెళ్లలేదు. నిజంగా వద్దనుకుంటే నీలో ఇంత బాధ ఎందుకు ఉంది చెప్పు.... చెప్పు వసుధారా అని నిలదీస్తాడు గౌతమ్. 

వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను.. నువ్వేమీ మాట్లాడటం లేదేంటి వసుధార అని అడుగుతాడు. చిన్న హెల్ప్ చేయమంటుంది. తాను తీసుకొచ్చిన కుంకుమను ఇచ్చి సార్ అది అంటుంటే అర్థమైంది అని అంటాడు గౌతమ్. కొన్ని సందేహాలు మేఘాల్లో కమ్ముకున్నాయి.. ఇప్పుడు విడిపోయాయి... అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అంటాడు గౌతమ్. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

భోజనం టేబుల్ వద్ద కూర్చొని ఉన్న దేవయానికి మహేంద్రను రిషి ఆరోగ్యంపై ఆరా తీస్తుంది. డాక్టర్‌కు ఫోన్ చేస్తున్నావా అని అడుగుతుంది. అవునని చెప్తాడు మహేంద్ర. రిషి భోజనం తన గదికే పంపించేమని చెప్తుంది దేవయాని. ఇది కూడా నేనే చెప్పాలా అంటూ ధరణిపై కసురుకుంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చి పెద్దమ్మ నేనే వద్దన్నాను అని... రిషి నేను కలిసి తింటామని చెప్తాడు. ఎందుకు గౌతమ్ అని మహేంద్ర అంటే.. అంకుల్ మేమూ మేమూ ఫ్రెండ్స్‌.. వాడు తిననూ అన్నా బెదిరించో బతిమాలో తినిపిస్తానంటాడు గౌతమ్.  వెరీ గుడ్ గౌతమ్ అంటాడు మహేంద్ర. 

బెడ్‌పై రిషి ఒక్కడే పడుకొని ఉంటాడు... లేచి నీళ్లు అందుకొనే టైంలో పడిపోతాడు.. జగతి వచ్చి పట్టుకుంటుంది. ఏం కావాలని అడుగుతుంది. ముందు రిషి అంటుంది సీరియస్‌గా చూసే సరికి సార్ అంటుంది. కోపం ఉంటే దూరం పెట్టాలి.. ద్వేషం ఉంటే దూరం అవ్వాలి అంతే కానీ.. నీకు నీవే శిక్ష వేసుకుంటే ఎలా అంటుంది. నీళ్లు ఇస్తూ... దాహం తీర్చుకోవాలి.. దుఃఖం దూరం చేసుకోవాలి... వీటిని వాయిదా వేసుకోకూడదని అంటుంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తారా అని అంటాడు రిషి. ట్యాబ్లెట్స్‌ వేసుకోలేదని చెబుతుంటే.. ప్లీజ్ మేడం అని అరుస్తాడు. సైలెంట్‌గా వెళ్లిపోతుంది జగతి. 

ఇంతలో గౌతమ్ భోజనం తీసుకొస్తాడు... వద్దని చెప్తాడు రిషి. అరే ఇలా అంటావనే నేను తినకుండా ఉన్నానని చెప్తాడు. నేను తినిపిస్తాను... బుద్దిగా తిను అంటాడు. ఇంతలో వసుధార ఇచ్చిన కుంకుమ గుర్తుకు వస్తుంది. తీసి రిషికి పెడతాడు. 

రేపటి భాగం
కాలేజీకి వచ్చిన రిషికి పువ్వులతో స్వాగతం పలుకుతారు స్టూడెంట్స్. ఈ ఫ్లవర్స్ అవి నాకు వద్దని చెప్తాడు రిషి. వసుధార పట్టుకున్న పువ్వు మాత్రం రిషి జేబులో చూస్తాడు మహేంద్ర. మనం దేన్ని వద్దనుకుంటామో అదే మనకు చేరుతుందని అంటాడు మహేంద్ర.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget