అన్వేషించండి

Guppedantha Manasu June 6th (ఈరోజు) ఎపిసోడ్: వసుధారపై కోపంతో సాక్షి కారులో వెళ్లిన రిషికి ప్రమాదం- చూసేందుకు వెళ్తే అడ్డుపడ్డ దేవయాని

వసుధార, రిషిని కలుపుదామని మహేంద్ర, జగతి వేసిన ప్లాన్ సాక్షి కారణంగా బెడిసికొడుతుంది. వసుధారపై కోపంతో సాక్షి కారులో వెళ్లిన రిషి ప్రమాదం బారిన పడతాడు.

కాలేజ్‌కి వచ్చిన సాక్షి మరోసారి వసుధారతో  గొడవ పడుతుంది. నా దారిలో వెళ్తానని... ఎవరు అడ్డువచ్చినా ఆగనంటూ క్లారిటీ ఇస్తుంది వసుధార. తన దారికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా తొక్కుకుంటూ వెళ్లిపోతానంటుంది వసుధార. నీవు బాగా మాట్లాడతావని అందరూ అంటూ ఉంటే ఏమో అనుకున్నాను.. కానీ ఇప్పుడే తెలుస్తుందని అంటుంది సాక్షి. ఆరోజు నీకు ఏదైతే చెప్పానో అది నిజం చేయబోతున్నాను అంటూ మరోసారి బెదిరింపులకు దిగుతుంది సాక్షి. ఆ విషయం చెప్పడానికే వచ్చానంటుంది సాక్షి. రిషి, వసుధార కలిసి దిగిన ఫొటోలను చూపిస్తుంది. వీటన్నింటినీ పెద్ద పెద్ద పోస్టర్లు వేసి కాలేజీలో అంటిస్తానంటుంది. సోషల్, మెయిన్ మీడియాలో చర్చ జరిగేలా చేస్తానంటుంది. రిషికి దూరంగా ఉండమని చెప్పానంటుంది. నువ్వు దూరంగా ఉండటం లేదని... నేను చెప్పినవన్నీ నిజం చేస్తానంటుంది సాక్షి. బెదిరిస్తున్నావా అంటుంది వసుధార. నువ్వు ఆల్రెడీ భయపడిపోయావని... ఇంకా భయపెట్టడం ఏంటి అంటుంది సాక్షి. 

నేను ఎవరికీ భయపడను.. భయానికి గౌరవానికి చిన్న తేడా ఉంటుందని వసుధార చెప్తుంది. అది నీకు అర్థం కావడం లేదంటుంది. నా మనస్సాక్షిసి భయపడతానే తప్ప మనుషులకు కాదంటుంది. రిషికి నాకు అడ్డు వస్తున్నావని... నాకు నీలా ఓపిక లేదని.. ఈ ఫొటోలు తీసుకెళ్లి రచ్చ చేస్తానంటుంది సాక్షి. దేనికి హెచ్చరిస్తావని... ఎవరికి భయపెడతావంటుంది వసుధార. నువ్వు వసుధారను భయపెట్టలేవని అంటుంది. నువ్వు ఇంకా రిషి మనుసులో ఉన్నావని చెబుతుంది సాక్షి. అది నీ ప్రాబ్లమ్‌ అని నా ప్రాబ్లమ్ కాదంటుంది వసుధార. రిషి మనసులో నేను ఉంటే ఆ స్థానంలో నువ్వు వెళ్లు అది నీ ఇష్టం. ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే నువ్వు వెళ్లే దారి సరైంది కాదని సాక్షికి చెబుతుంది వసుధార. 

నేను వెళ్తున్న దారి సరైందా కాదా అన్నది నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదని అంటుంది సాక్షి. ఆ పని లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోమంటుంది వసుధార. నేను ఎంత పెద్ద తుపాను సృష్టించబోతున్నానో నీకు అర్థం కావడం లేదని... ఇద్దరి జీవితాలు తారుమారు అవుతాయని హెచ్చరిస్తుంది సాక్షి. 

నేను క్లారిటీతో ఉన్నానని... నీ బెదిరింపులకు భయపడాల్సిన పని లేదంటుంంది వసుధార. నాకు ఏం చెప్పాల్సిన పని లేదని.. నేను ఏం చేయాలనే పనిలో చాలా స్పష్టంగా ఉన్ననంటుంది. వసుధార గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదంటుంది. నా విజ్ఞతతో ఆలోచించి  ముందడుగు వేస్తానంటుంది. ఇంకెప్పుడూ నా దారికి అడ్డురాకు అని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. 

రిషిని కారులో మహేంద్ర ఎక్కడితో తీసుకెళ్తుంటాడు. ఎక్కడికి వెళ్తున్నామని... రిషి ఒకటికి పదిసార్లు అడుగుతాడు. ఎన్నిసార్లు అడిగినా మహేంద్ర ఏం చెప్పకుండానేరుగా వసుధార ఉన్న రెస్టారెంట్‌కు తీసుకెళ్తాడు. రెస్టారెంట్‌కు అని మీరు చెప్పలేదు కదా అంటాడు. చెప్తే నువ్వు రావు కదా అంటాడు మహేంద్ర. 

రెస్టారెంట్‌లో జగతి కూర్చొని ఉంటుంది. వసుధార వచ్చి ఏం తీసుకురావాలా అని అడుగుతుంది. నీకు ఈ మధ్య ఓపిక తగ్గిపోయిందని అంటుంది జగతి. అలాంటిదేమీ లేదని అంటుంది వసుధార. ఇంతలో మహేంద్ర, రిషి కూడా అక్కడకు వస్తారు. రిషి సార్ కోసమే జగతి మేడం కాఫీ తాగకుండా కూర్చొని ఉన్నారా అని అనుకుంటుంది. ఇలా చెప్పా పెట్టకుండా రెస్టారెంట్‌కు తీసుకురావడం ఏంటని మహేంద్రతో అంటాడు రిషి. కాఫీ ఇక్కడే బాగుంటుందని చెప్తాడు మహేంద్ర.
అలా వస్తూ... అక్కడే ఉన్న జగతి, వసుధారను చూసి ప్లాన్ చేసుకొని రెస్టారెంట్‌కు వచ్చారా అంటు ప్రశ్నిస్తాడు రిషి. వాళ్లకి కూడా కాఫీ తాగాలనిపించిందేమో అనుకుంటాడు. రిషి వెళ్లిపోతుంటే ఆపుతాడు మహేంద్ర. అలా వెళ్తే బాగోదు అంటాడు. ఉండాలని, రావాలని లేనప్పుడు వెళ్లడం ఒక్కటే మార్కం కదా అంటాడు రిషి. ఒక్క కాఫీ కలిసి తాగుదాం అన్నాను.. అంతే కదా.. ఈ డాడీకి ఆ టైం కూడా ఇవ్వలేవా అని ప్రాధేయపడతాడు మహేంద్ర. ఆ మాటతో కుర్చీలో కూర్చుంటాడు రిషి. 
కాఫీ, కావాలా ఐస్‌క్రీమ్ కావాలా అని రిషిని అడుగుతాడు మహేంద్ర. సరే నీకు కాఫీ అంటే ఇష్టం కదా అంటాడు మహేంద్ర. వసుధారను పిలిచి నీ రెస్టారెంట్‌కు వచ్చిన వాళ్లకు ఏం కావాలో అడగవా అంటాడు మహేంద్ర. వసుధార అడుగుతుంది. సార్ ఏం తీసుకుంటారని అడుగుతుంది. వెంటనే లేచి నిలబడ్డ రిషికి అటుగా వస్తున్న సాక్షి కనిపిస్తుంది. సరిగ్గా టైంకు వచ్చిందని అనుకుంటాడు. 

సాక్షి... నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతాడు రిషి. ఇంటికేంటి ఎక్కడికి తీసుకెళ్లమన్నా వెళ్తానంటుంది సాక్షి. ఇక్కడ వరకు వచ్చాం కదా.. కాఫీ షేర్ చేసుకుందామా అని అడుగుతుంది. సరే నువ్వు కాఫీ తాగేయ్‌ నేను క్యాబ్‌లో వెళ్తానంటాడు. ఇంతలో సాక్షి కాఫీ క్యాన్సిల్ చేసి రిషితో బయల్దేరుతుంది. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. 

నువ్వు నా కారులో రావడం చాలా ఆనందంగా ఉందని పొంగిపోతుంది సాక్షి. నేను డ్రైవ్ చేస్తానంటూ తాళాలు తీసుకుంటాడు రిషి. ఇంతలో మహేంద్ర ఫోన్ చేస్తాడు. అలా వెళ్లడం కరెక్టేనా అని ప్రశ్నిస్తాడు. కొన్నిసార్లు ఏది కరెక్టో కాదో.. మన మనసే చెబుతుంది అని దాన్ని ఫాలో అవ్వడమే మన పని  అంటాడు రిషి. పక్కనే ఉన్న సాక్షి చాలా బాగా చెప్పావంటూ ప్రైజ్ చేస్తుంది. రెండు అయిష్టాలు భరించడం కన్నా ఒక్కటి భరించడం బెటర్ అని కాల్ కట్ చేసి వెళ్లిపాతాడు.

కారులో రిషితో వెళ్తున్న సాక్షి... అనుకున్నది చాలా తొందరగా సాధించావని అనుకుంటుంది. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. భుజంపై చేయి వేస్తుంది సాక్షి. పక్కకు తప్పుకుంటాడు రిషి. ఇలా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని... ఇంత త్వరగా వస్తుందని  అనుకోలేదంటాడు. దూరంగా వెళ్దామని చెబుతుంది.  నీతో జర్నీ నాకు ఇష్టం లేదని.. ఈ కొద్దిసేపటికే చాలా ఇబ్బందిగా ఉందని అని కారు దిగి వెళ్లిపోతాడు రిషి.

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న రిషి... వసుధార కోసమే ఆలోచిస్తుంటాడు. సాక్షితో మాట్లాడాలంటేనే చాలా చిరాకుగా ఉందని... కానీ వసుధారను మాత్రం మర్చిపోలేకపోతున్నానని ఎందుకిలా అని అనుకుంటాడు. నా మససులో ప్రేమ గురించి చెప్పినందుకు జ్ఞాపకాల శిక్ష వేసి ఎందుకిలా వేధిస్తున్నావ్‌ వసుధార అని అనుకుంటాడు రిషి. 

రేపటి ఎపిసోడ్
సాక్షి కారు దిగి నడుచుకుంటూ వస్తున్న రిషికి యాక్సిడెంట్ అవుతుంది. అతన్ని ఇంటికి తీసుకొస్తారు. రిషిని చూడటానికి వచ్చిన వసుధారను దేవయాని లోపలికి రానివ్వకుండా చేస్తుంది. ఈ ప్రమాదానికి కారణం నువ్వే అంటుంది. ఆ మాటలకు బాధపడి వెళ్లిపోతుంది వసుధార. గాయాలతో బెడ్‌పై పడుకొని ఉన్న రిషి మాత్రం వసుధార కోసం కలవరిస్తుంటాడు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget