అన్వేషించండి

Guppedantha Manasu June 13th (ఈరోజు) ఎపిసోడ్: మీ ప్రాణాలకు ఏమైనా జరిగితే నేను బతకలేనన్న వసుధార- ఆ మాటకు షాక్ తిన్న రిషి

రిషి మైకంలో పడిన వసుధార ఖాళీ కుర్చీలతో మాట్లాడుకుంటూ ఉంటుంది. దాన్ని గమనించిన హోటల్ మేనేజర్ వసుధారను ఇంటికి పంపించేస్తాడు.

కాలేజీలో వసుధార, రిషి ఎదురెదురు పడతారు కానీ ఎలాంటి మాటలు ఉండవు. వసుధార ప్రేమను రిజెక్ట్ చేసిన విషయమే ఇంకా రిషికి గుర్తుకు వస్తుంది. ఎదురుగా వచ్చిన వసును సీరియస్‌గా చూసి వెళ్లిపోతాడు రిషి. అక్కడే ఉన్న గౌతమ్‌తో మాట్లాడిన వసుధార... రిషి సార్ తిన్నారు కదా అని అడుగుతుంది. మొత్తానికి ఏదోలా తిన్నాడులే అని చెప్తాడు గౌతమ్. నాకో విషయం అర్థం కాదు.. రిషి నిన్ను మిస్సయ్యాడా... నువ్వు రిషిని మిస్సయ్యావా అని అడుగుతాడు గౌతమ్. పక్కనే ఉన్న బాక్స్ తీసుకుంటూ... నేను ఈ బాక్స్‌ను మిస్సవ్వను అనుకుంటుంది వసుధార. 

రెస్టారెంట్‌లో పని చేస్తూనే రిషి సార్ వస్తే బాగున్ను అనుకుంటుంది. కాఫీ కూడా ఆయన ఎప్పుడూ కూర్చునే టేబుల్‌పై పెడుతుంది. ఇంతలో వేరే వాళ్లు పిలిచి ఆర్డర్ చెప్తారు. ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. ఎదురుగా వెళ్లి రమ్మని కూర్చోమంటుంది. రెస్టారెంట్‌కే కదా వచ్చాను... నీవు వద్దంటే మాత్రం వెనక్కి వెళ్లిపోతానా అని వెటకారంగా అంటాడు. చూస్తూ ఉంటారా ఆర్డర్‌ తీసుకుంటారా లేదా అని అడుగుతాడు. ఆర్డర్ చెప్పండి సార్ అంటుంది. రెండు కాఫీ, రెండు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్ ఇస్తాడు. ఏంటీ సార్ అని అడుగుతుంది. నీతో మాట్లాడాలి... ఓ కాఫీ తాగి.. ఐస్‌క్రీం తిని.. కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ కాఫీ తాగి, ఐస్‌క్రీమ్ తింటూ నీతో మాట్లాడాలి అంటాడు. దానికి సరే అని వెళ్లిపోతుంటే.. ఏంటీ సరే నేను ఏం చెప్పినా సరే అంటావా అని అడుగుతాడు. కస్టమర్‌లు ఏం చెప్పినా చేయాలి కదా అని అంటుంది. నేను కస్టమర్‌నేనా నీకు ఏమీ కానా అని అడుగుతాడు. 

ఇంతలో హోటల్ మేనేజర్ వచ్చి పిలుస్తాడు. కాసేపటికి అటువైపు చూస్తుంది.. ఏంటమ్మ అని అడుగుతాడు.. ఏదో చెప్తూ రిషి వైపు చూపిస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు.  ఖాళీ కుర్చీ దగ్గర ఏం చేస్తున్నావని అడుగుతాడు. రిషి సార్ వచ్చారని అంటుంది. ఆయన రాలేదు కదా అంటాడు. ఒంట్లో బాగాలేదా అంటాడాయన. ఐస్‌క్రీం అడిగిన వాళ్లకు కాఫీ, కాఫీ అడిగిన వాళ్లకు ఐస్‌క్రీమ్ ఇచ్చావంటా అని చెప్పి నీ మూడ్‌ బాగాలేదనుకుంటా వెళ్లిపోమంటాడు మేనేజర్. 

కారులో వస్తూ.. రిషి.. వసుధార కోసం ఆలోచిస్తుంటాడు. సడెన్‌గా రిస్టారెంట్‌కు వచ్చి ఆగుతాడు. ఏంటీ వసుధార వద్దకు వచ్చ ఆగానా అని అనుకుంటాడు. అప్పుడే వసుధార బయటకు వస్తుంది. ఫోన్‌ కూడా వస్తుంది. కానీ అదంతా భ్రమ అనుకుంటాడు. కానీ ఇంతలో వసుధార తనవైపు రావడాన్ని చూసి ఇదంతా నిజమా అనుకుంటాడు. 

రిషి వద్దకు వచ్చిన వసుధార.. కాఫీ కోసం వచ్చారా అని అడుగుతుంది. ఇక్కడకు వచ్చిన వాళ్లంతా కాఫీ తాగడానికే వస్తారా అని అడుగుతాడు రిషి. ఈ టైంలో రెస్టారెంట్‌లో ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అని అడుగుతాడు... నువ్వు ఏం చేస్తే నాకెందుకని వెళ్లిపోతాడు. పూర్తిగా చెప్పకుండానే వెళ్లిపోయారా అని అనుకుంటుంది. 

వెళ్లిపోయిన కారు ఆగుతుంది. వసుధార వస్తుందని రిషి... సార్ పిలవాలని వసుధార అక్కడే ఆగిపోతారు. ఫోన్‌లో ఇద్దరు మెసేజ్‌లు పాస్ చేసుకుంటారు. ఇంతలో సాక్షి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ రిషి, ఇక్కడ వసుధార మధ్యలో నేనా అనుకుంటుంది. మళ్లీ వీళ్లిద్దరు కలిస్తే  అనుకుంటుంది సాక్షి. 

ఇంతలో రిషి క్యాబ్ బుక్ చేసి వసుధార కోసం పంపిస్తాడు. అందులో ఎక్కి వసుధార తన రూమ్‌కి వెళ్లిపోతుంది. 

ఒంటరిగా కూర్చొని ఉన్న రిషి వద్దకు మహేంద్ర, జగతి వస్తారు. చిన్న పని ఉందని... డిస్టర్బ్ చేయక తప్పలేదంటాడు మహేంద్ర. నాకు ఓపిక లేదని చెప్తాడు రిషి. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని స్కీమ్‌లు, యాడ్‌ఫిల్మ్స్‌ చూసి ఫైనల్ చేస్తే మెయిల్ చేసేద్దామని అంటాడు మహేంద్ర. ఆ వివరాలను జగతి చెప్తారు. మొత్తం విన్న రిషి... అక్కడక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయని వాటిని క్లారిఫై చేయాల్సి ఉందంటాడు. ఏదైనా సరే వసుధారకు చెప్దామని అంటుంది జగతి. ఆమె చాలా ఫాస్ట్‌గా చేస్తుందని అంటుంది. 

ఇది మన వ్యక్తిగత విషయం కాదని... ఆఫీస్‌ వర్కని.. వసుధార, రిషి ఎలాగో కలిసి పని చేస్తున్నారని... నువ్వు ఫోన్ చేసి వసుధారకు చెప్తే సరిపోతుందని జగతితో అంటాడు మహేంద్ర. ఏం కావాలో రిషి చెప్తాడు.. అది వసుధారకు చెప్తే సరిపోతుందని వివరిస్తాడు మహేంద్ర. 

ఇంటికి వచ్చిన వసుధార.. కాలేజీ నుంచి తీసుకొచ్చిన బాక్స్‌ చూస్తుంది. అందులో ఇంకా రైస్ మిగిలిపోయిన సంగతి తింటూ ఉంటుంది. ఇంతలో జగతి వీడియో కాల్‌ చేస్తుంది. ఆ కాల్‌లో వసుధార తింటున్న బాక్స్‌ను చూసి తను కాలేజీలో తిన్న బాక్స్‌ ఒక్కటే అని నిర్దారించుకుంటాడు. తన ఎంగిలి తింటున్న వసుధార.. ప్రేమ మాత్రం లేదంటుందని అనుకుంటాడు. 

మొత్తం ప్రాజెక్టు పూర్తిగా వివరించిన జగతి.... కంప్లీట్ అయిన తర్వాత రిషికి మెయిల్ చేయమంటుంది. ఏంటీ మేడమ్ రిషి సార్‌కు అంత పెద్ద దెబ్బ తగిలితే... రెస్ట్ తీసుకోకుండా కాలేజీకి రావడమేంటని ప్రశ్నిస్తుంది. ఒంటరిగా డ్రైవింగ్ ఎలా చేస్తారని నిలదీస్తుంది. కనీసం మహేంద్ర సార్‌నైనా తోడుగా పంపించాలి కదా అని అడుగుతుంది. మీ అబ్బాయి అంటే మీకు ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ... మా ఎండీ గారంటే మాకు చాలా ప్రేమ ఉందని చెబుతుంది. 

ఈ  మాటలు వింటున్న రిషిలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. బయటకు చెప్పకపోయినా కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే రిషి ఉన్నాడని తెలియకుండానే చాలా విషయాలు చెప్పేస్తుంది వసుధార. జగతి ష్‌ ష్‌ అంటున్నా.. పట్టించుకోదు. ఏంటీ మేడం కాకులను తోలినట్టు ష్ ష్ అంటారు అని తిరిగి ప్రశ్నిస్తుంది. 

ఇంతలో రిషి రియాక్ట్ అవుతూ.. మేడమ్ ఆఫీస్ వర్క్ అయిపోయిందిగా... కాల్‌ కట్‌ చేయవచ్చుగా అని అంటాడు. ఆ మాటలు విన్న వసుధార ఫ్యూజ్‌లు ఎగిపోతాయి. వసుధారకు ఏం చేయాలో ఆర్థంకాకా కాల్ కట్‌ చేస్తుంది. మేడం  ఏంటీ రిషి సార్ ముందు ఇలా ఇరికించారు అనుకుంటుంది. 

తెల్లవారుతుంది.. రెడీ అవుతున్న రిషిని వచ్చి పలకరిస్తాడు గౌతమ్. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. ఇంకా ఎక్కడికి వెళ్తాను... కాలేజీకి అని చెప్తాడు రిషి. అదే ఏంటీ ఇంత త్వరగా అని ఆరా తీస్తాడు. చిన్న పని ఉందని చెప్తాడు రిషి. ఏంటో అంత అర్జెంట్ పని అని మళ్లీ క్వశ్చన్ చేస్తాడు గౌతమ్. అరె ఒక పని అర్జెంటా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది మనం కాదని.. ఆ పని అని అంటాడు రిషి. ఏంటీ పొద్దునే కొటేషనా అని అంటాడు గౌతమ్. నాకు ల్యాబ్‌లో పని ఉందని చెప్తాడు రిషి. నన్ను రమ్మంటే వస్తాను కాదా.. హెల్పింగ్ హ్యాండ్‌లో ఉంటాను అంటాడు గౌతమ్. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు అంటాడు రిషి. నేనేమీ నీ వసుధారలా కాదు.. శాలరీ కూడా తీసుకోను అంటాడు గౌతమ్. కోపంగా చూస్తున్న రిషిని చూస్తూ ఎందుకలా కోపంగా చూస్తావని అడుగుతాడు గౌతమ్. 

ఇంతలో వసుధార మెసేజ్ చేస్తుంది. ఏంటీ వసుధార మేసేజ్ చేసింది చూడాలా వద్దా అనుకుంటాడు. ఏముంటుందిలే... గుడ్‌మార్నింగ్ లేదా... కొటేషన్ అంతేగా అనుకుంటాడు. కానీ మేసేజ్ చూస్తాడు. ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ పూర్తైందని... మెయిల్ చేశాను చూసుకోమంటుంది. 

చెప్పిన పనులన్నీ చేస్తుంది కానీ ఏంటో.. నన్నిలా రిజెక్ట్ చేసింది అనుకుంటాడు రిషి. 

రేపటి భాగం

కాలేజీ ల్యాబ్‌లో ప్రమాదం  జరుగుతుంది. స్టూడెంట్స్‌ను కాపాడే క్రమంలో రిషి ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఆలస్యంగా వచ్చిన వసుధార... అసలు ఆ గదిలోకి రిషిని ఎలా పంపించాలని అందరిపై కోప్పడుతుంది. మహేంద్ర, జగతి అడ్డుకుంటున్నా ల్యాప్‌లోకి వెళ్తుంది. రిషిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. నీ ప్రాణాలకు ప్రమాదం.. రిషి వెళ్లిపోమంటాడు. నీ ప్రాణాలకు ఏమైనా అయితే నేను చచ్చిపోతానంటూ మాట్లాడుతుంది వసుధార.  ఆ మాట విన్న రిషి షాక్ అవుతాడు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget