By: ABP Desam | Updated at : 17 Feb 2023 08:57 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంతమనసు ఫిబ్రవరి 17 ఎపిసోడ్ (Guppedanta Manasu February 17th Update)
వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు తలుచుకుని బాధపడుతుంటుంది. ఇదంతా తనకోసమే కదా చేశాను అయినా అర్థం చేసుకోవడం లేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయంలో నన్ను అర్థం చేసుకునే రిషి సార్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు. నా సంతోషమైన దుఃఖమైనా నీతోనే కదా నేను పంచుకునేది అని బాధపడుతూ అక్కడున్న పసుపు, కుంకుమతో రిషిధార అని రాస్తుంది. రిషి సార్ కి నిజం చెప్పాలంటే భయం వేస్తోంది అందుకే ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను...రిషి సార్ కి నిజం తెలిసిందో లేదో ఇంకా ఈ వేదన ఎన్నాళ్లు..ఈ దోబూచులాట ఎన్నాళ్లు రిషి సార్ ని నువ్వే మార్చాలి తల్లీ..తను నిజం తెలుసుకుని వసుధారా అంటూ నా దగ్గరకు రావాలి ఆపని నువ్వే చేయాలి అని వేడుకుంటుంది..ఇంతలో వసుధారా అని రిషి పిలుపు వినిపిస్తుంది...ఇద్దరూ కాసేపు ఒకర్నొకరు ప్రేమగా చూసుకుని హగ్ చేసుకుంటారు.
రిషి: ఓ నిజం తెలుసుకునేందుకు ఇన్నాళ్లు పట్టిందేంటి..ఇన్నాళ్లు ఎందుకు ఆగాలి..ఎందుకిలా చేశావ్
వసు: మీ కోసమే సార్
రిషి: నాకోసమే అయితే నాకెందుకు చెప్పలేదు..ఏంటీ దాగుడుమూతలు
వసు: నేను దాచలేదు..
రిషి: ఇన్ని రోజులు నా ఎమోషన్స్ తో, నా మనసుతో, నా ప్రేమతో ఆడుకున్నావు ..ఇలా ఎందుకు
వసు: అసలు ఆరోజు ఏమైందంటే..అంటూ..జరిగినదంతా చెబుతుంది
రిషి: అంతా విని షాక్ అయిన రిషి...మన మధ్య దాపరికాలు ఉండవు అనుకున్నాను. నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్ గానే చేసి నన్ను చేతగాని వాడివి చేశావు కాలేజీలో వసుధార పెళ్లి చేసుకుంది అని ప్రతి ఒక్కరు అన్నప్పుడల్లా రంపంతో నా గుండె కోసినట్టు అయింది అయినా నీ చేతులతో నువ్వు తాళి కట్టుకోవడం ఏంటి వసుధారా
వసు: నేనే వేసుకున్నాను కానీ ఇది మీరు వేసినట్టుగా భావించాను
రిషి: వసుపై కోప్పడిన రిషి..అన్నీ నీ అంతట నువ్వు చేశావు కానీ నేను నరకం అనుభవించాను
వసు: మెడలో తాళి చూపించి ఇది మీ చేతులతో మీరే ఇచ్చారు అనడంతో అప్పుడు రిషి ఆశ్చర్యపోతాడు
అప్పుడు రిషి నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు తప్పే అని అరుస్తుంటాడు..ఇంతలో వసు కళ్లు తిరిగిపడిపోతుంది.
Also Read: హమ్మయ్య మబ్బులు విడిపోయాయ్ - రిషిధారగా మారిన వసుధార
ధరణి లగ్నపత్రిక తీసుకొని వెళ్తుండగా ఏంటది అనడంతో తెలిసినవారు శుభలేఖ ఇచ్చారు అని అంటుంది. అప్పుడు దేవయాని జగతి మహేంద్ర వాళ్లు రావడం గమనించి అంతా బాగుంటే ఈపాటికి రిషి పెళ్లికి శుభలేఖలు చేయించే వాళ్ళం కదా అనడంతో జగతి,మహేంద్ర అక్కడికి వెళ్లి దేవయానికి సెటైర్స్ వేస్తుంటారు. త్వరలో శుభలేఖలు ప్రింట్ అయ్యేలా అందులో రిషి పేరు ఉండేలా చేయి దేవుడా అని మహేంద్ర అంటే..మరి రెండో పేరు అని ధరణి అనడంతో..అది దేవుడు డిసైడ్ చేస్తాడులే ధరణి అని సెటైర్స్ వేస్తుంటాడు. మీ ప్లానేంటో నాకు అర్థంకావడం లేదని దేవయాని అనడంతో.. ప్లాన్స్ వేయడాలు, మనుషులను పురమాయించడాలు నాకు అలవాటు లేదు ఏం జగతి అని మహేంద్ర అంటే...అవును మహేంద్ర అంటుంది జదతి. ఇప్పటివరకూ చేసింది చాలు..రిషి పెళ్లిగురించి ఆలోచించడం మానేయండి అంటుంది దేవయాని. తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది...
Also Read: తన భర్త అంటూ అద్దంలో చూపించినా అర్థం చేసుకోని రిషి, వసు మెడలో తాళినుంచి బయటపడిన 'VR' ఉంగరం
మరోవైపు రిషి కారులో వసుధారని తీసుకెళ్తూ.. ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎలా దాచావు వసుధార అనుకుంటూ ఉంటాడు. తర్వాత రిషి ఒక సైడ్ కి కారు ఆపి ఏంటి వసుధార పడిపోయావు అనడంతో టెన్షన్ లో పడిపోయాను సార్ అని అంటుంది. అప్పుడు పర్లేదు సార్ అని అనడంతో అప్పుడు రిషి బయలుదేరాలి అని చూస్తుండగా వెక్కిళ్లు రావడంతో వసుధార వాటర్ బాటిల్ ఇస్తుంది...వారి ప్రయాణం సాగుతుంది...
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!
Janaki Kalaganaledu March 20th: జానకి మీద పిచ్చికుక్కలా విరుచుకుపడిన మనోహర్- ఐపీఎస్ కల చేదిరిపోతుందా?
Gruhalakshmi March 20th: అందరి ముందు తులసిని క్షమాపణలు అడిగిన నందు- పంతం నెగ్గించుకున్న రాజ్యలక్ష్మి
Guppedanta Manasu March 20th: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్