By: ABP Desam | Updated at : 22 Apr 2022 07:47 AM (IST)
Guppedantha Manasu 22th April 431 (Image Credit: Star Maa/Hot Star)
వసుధార, జగతి, మహేంద్ర కారులో రిషి తీసుకెళ్తాడు. ఎక్కడకు అని అడిగితే సమాధానం చెప్పడు. రిషిని ఏడిపించాలని చెప్పి ముగ్గురు కూడా వెనుక సీట్లో ఇరుగ్గా కూర్చొంటారు. దాన్ని చూసి రిషి కాస్త అసహనంతో ఉంటాడు. అతన్ని మరింత ఉడికించాలని వసుధార, మహేంద్ర పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు. ఇద్దర్నీ జగతి వారిస్తుంది. రిషి కోపంగా ఉన్నాడని సైలెంట్‌గా ఉండాలని సూచిస్తుంది. కానీ వాళ్లిద్దరు పట్టించుకోరు. అప్పటికే రెండుసార్లు సడెన్ బ్రేక్‌లు వేస్తాడు... మ్యూజిక్ సిస్టమ్ పెడతాడు. అయినా వాళ్లు ఆగరు. ఇంతలో వాళ్లు రావాల్సిన గమ్యం వచ్చేస్తుంది.
అంతా తెప్పి వసుధార పని చేసే రెస్టారెంట్ వద్దకు తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారని వసుధార రిషిని అడుగుతుంది. ఇవాళ నా బర్త్‌డే అని పార్టీ ఇద్దామని తీసుకొచ్చానంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అలా నలుగురూ కలిసి వసుధార రూమ్‌కు వెళ్తుంటారు. మెట్లు ఎక్కుతుంటే వసుధార స్లిప్ అయి పడిపోతుంది. ఇంతలో రిషి ఆమెను పడిపోకుండా పట్టుకుంటాడు. అక్కడో రొమాంటిక్ మ్యూజిక్‌తో కాసేపు నడిపిస్తారు. ఇది చూసిన మహేంద్ర, జగతికి కాస్త ఆనందంగానే ఉన్నా ఎక్కడో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. తర్వాత మహేంద్ర గట్టిగా దగ్గడంతో వాళ్లు తేరుకొని ముందుకు వెళ్లారు.
అంతా వసుధార రూమ్ వద్దకు చేరుకుని మాట్లాడుతుంటే.. వసుధార కూర్చొమని చెబుతుంది. తాను కూర్చోవడానికి రాలేదన్న రిషి... జగతితో మాట్లాడుతాడు. తనకో ఫేవర్ చేయాలని అడుగుతాడు. వసుధారకు ట్యూషన్ చెప్పాలని రిక్వస్ట్ చేస్తాడు. స్కాలర్ షిప్ టెస్టు కోసం వసుధారను రెడీ చేయాలని సూచిస్తాడు. ఆమె కూడా ఓకే చెబుతుంది. నిన్న మీరు చెప్పిన లెక్కలకు నేను ఇంప్రెస్ అయ్యానని అందుకే ఈ బాధ్యత అప్పగిస్తాననంటూ చెప్పుకొస్తాడు. ఆమె అంగీకరించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వసుధార, జగతి, మహేంద్ర మాట్లాడుతుంటారు. ఇంతలో రిషి కింద ఏదో మెసేజ్ టైప్ చేస్తుంటే వసుధార చూస్తుంది. పరుగెత్తుకొని వెళ్లి తన ఫోన్ చేక్ చేసుకుంటుంది. ట్యూషన్‌కు రెడీ అవ్వు అని ఉఁటుంది. ఓకే అని రిప్లై ఇస్తుంది. అప్పుడే జగతి, మహేంద్ర కూడా వీళ్లద్దరి గురించి మాట్లాడుకుంటారు. మనం మధ్యలో ఎందుకు వెళ్లిపోదామనుకుంటారు. అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వీళ్ల కోసం ఇంట్లో ఎదురు చూస్తుంది దేవయాని. ఇంత వరకు ఎక్కడ తిరుగుతున్నారో అంటో కోపంగా అనుకుంటుంది. అప్పుడే వచ్చిన ధరణీ...ఎందుకో అంత కోపంగా ఉన్నారని అనుకుంటుంది. అప్పుడే జగతి, రిషి మహేంద్ర వస్తారు. ముగ్గరిని అలా చూసిన దేవయానికి కడుపు మండిపోతుంది. ధరణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎక్కడికి వెళ్లారు రుషి అని అడుగుతుంది. పని ఉండి బయటకు వెళ్లామంటోంది. ఇప్పటి వరకు పడుకోకుండా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు పెద్దమ్మా అడిగి లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత మహేంద్రతో దేవయానికి వాదులాడుతుంది.
రేపటి ఎపిసోడ్
రిషి, వసుధారను కట్ చేయడానికి ఆమె బావను రంగంలోకి దించుతుంది దేవయానికి, వసుధార కనిపించకూడదని అతడితో ఫోన్‌లో చెబుతుంది. వచ్చిన ఆ వ్యక్తి వసుధారను ఫాలో అవతుంటాడు. తొందరపడక తప్పదని వసుధారకు వెనుక నుంచి వార్నింగ్ ఇస్తాడు.
Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య
Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!