అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 20th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: శైలేంద్రను చంపేస్తానన్న రాజీవ్ – మను కోసం కన్నీరు పెట్టుకున్న అనుపమ

Guppedanta Manasu Today Episode : నిన్ను చంపేస్తానంటూ మను.. శైలేంద్రకు గన్ ఎక్కిపెట్టినట్లు శైలేంద్ర కలగనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఫన్నీగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode : మనును తీసుకుని ఇంటికి వచ్చిన మహేంద్ర, వసుధారలను చూసి అనుపమ హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఎవరితోనూ అనుపమ మాట్లాడదు. దీంతో వసుదార ఇంకా మౌనంగా ఉంటారేంటి మేడమ్‌ అని అడుగుతుంది. దీంతో తను మాట్లాడకున్నా నా మనసుకు వినిపిస్తుందని మను అంటాడు. ఈ గుండెకు ఆవిడ ప్రేమ, కోపం, ఆవేశం, బాధ అన్ని ఎమోషన్స్ తెలుస్తాయి. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తప్పా అని మను అంటాడు.  అనుపమ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుండిపోతుంది.

మను: మేడమ్ మీరు నా గురించి వర్రీ కాకండి. నేను బాగానే ఉన్నాను. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు బాగానే ఉంటాను కూడా. వసుధార మేడమ్ నేను మీలాంటి మంచి మనిషిని చూడలేదు. మీ హెల్ఫ్ ఈ జన్మలో మర్చిపోను.

వసు: నేను చేసింది ఏం లేదు. మీకు సపోర్ట్‌ గా ఉన్నాను. ఈ విషయంలో ముందుండి నడిపించింది మీ నాన్నగారే మిమ్మల్ని దత్తత తీసుకుని మావయ్య గారు తండ్రి స్థానంలోకి రావాలనుకున్నారు కదా.

మహేంద్ర: అమ్మ వసుధార నువ్వేం తప్పు మాట్లాడలేదమ్మా. ఎందుకు తటపటాయిస్తున్నావ్. మనును నా కొడుకులాగే చూస్తున్నాను.

అని మహేంద్ర అంటాడు. మరోవైపు శైలేంద్రను సీరియస్‌గా చూస్తుంటాడు రాజీవ్‌.

శైలేంద్ర: ఏంటీ బ్రదర్ అలా సీరియస్‌గా చూస్తున్నావ్. నువ్వెలా జైలు నుంచి వచ్చావ్

రాజీవ్‌: రాలేననుకున్నావా. నాకు జైలు కొత్తేం కాదు. అందులో నుంచి తప్పించుకోవడం కూడా కొత్త కాదు.

శైలేంద్ర: అసలు అలా నువ్ పట్టుబడతావని అనుకోలేదు. షాక్ అయ్యాను. బయటకు తీసుకొద్దామనుకున్నాను

రాజీవ్‌: నాటకాలు ఆపు భయ్యా. నాకు అంతా తెలుసు. అయినా ఒక మోసగాడిని ఇంకో మోసగాడు మోసం చేయడం ఏంటీ భయ్యా

అంటూ రాజీవ్‌ గన్‌ తీసి శైలేంద్రకు గురిపెడతాడు. నన్ను ఇలా ఎవరు మోసం చేయలేదు. ఇక నిన్ను క్షమించేదే లేదు. ఇప్పుడే నిన్ను చంపేస్తానని రాజీవ్‌ అనడంతో శైలేంద్ర భయంతో ఎండీ సీటు కోసం అలా చేశానని.. తనను క్షమించమని రాజీవ్‌ కాళ్లపై పడతాడు. తీరా చూస్తూ శైలేంద్ర ధరణి కాళ్లపై పడి  ఈ ఒక్కసారి వదిలిపెట్టమని అడుక్కుంటుంటాడు. ఇంతలో ఫణీంద్ర రేయ్‌ శైలేంద్ర ఏం చేస్తున్నావు అనగానే తేరుకుని శైలేంద్ర షాక్‌ అవుతాడు.

ఫణీంద్ర: ఏం తప్పు చేశావురా. ఎందుకు తన కాళ్లు పట్టుకుని బతిమిలాడుతున్నావ్. ఎందుకు ప్రాణ భిక్ష పెట్టమంటున్నావ్

దేవయాని: ఛీ ఛీ.. అసలు నువ్ మనిషివేనా. నువ్ ఎంత పెద్ద తప్పు చేస్తే మాత్రం భార్య కాళ్లు పట్టుకోవడం ఏంట్రా.

ధరణి: మీరు చాలా మంచి వారండి. మీరు ఇలా చేయడం నాకు చాలా నచ్చింది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా కాళ్లు పట్టుకోవచ్చు

అని  చెప్పి అందరూ వెళ్లిపోతారు. మరోవైపు వసుధారకు అనుపమ థ్యాంక్స్ చెబుతుంది. మనును బయటకు తీసుకురావడం కోసం నీ ప్రాణాలు ఫణంగా పెట్టావ్ అని అనుపమ అంటుంది.

వసు: మనును బయటకు తీసుకురావడం నా బాధ్యత అని చెప్పాను కదా మేడమ్‌.

అనుపమ: నీ రుణం జన్మలో తీర్చుకోలేనిది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ, గుండెలవిసేలా బాధపడింది రెండే రెండే సార్లు. ఒకటి మనును అమ్మ అని పిలవకని చెప్పినప్పుడు. రెండోది తనను పోలీసులు తీసుకెళ్లినప్పుడు.

అని అనుపమ చెప్తుంటే పక్కనుంచి వింటున్న మను ఎమోషనల్‌గా ఫీలవుతాడు. నాబిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేని దౌర్భాగ్యురాలిని అని అనుపమ అంటుంది. మీ వేదన గురించి నాకు అర్థమవుతోంది మేడం.. మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో తను కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు. అని వసుధార అంటుంది. తర్వాత శైలేంద్ర, మనుకు కాల్ చేసి నిన్ను బయటకు తీసుకొచ్చాను కదా మన డీల్‌ గుర్తింది కదా? మర్చిపోయారేమో గుర్తు చేద్దామని కాల్ చేశాను. అని మనును ఎక్కడున్నావు అని అడుగుతాడు. మహేంద్ర వాళ్ల ఇంట్లో ఉన్నానని మను చెప్పగానే వీన్ని ఎలాగైనా అక్కడి  నుంచి వెళ్లిపోయేలా చేయాలని లేదంటే మను గాడి మనుసు మార్చేస్తారని శైలేంద్ర మనుసులో అనుకుని  మీరు అక్కడ ఉండకండి వెంటనే బయటకు వచ్చేయండి అని శైలేంద్ర అంటే.. ఎందుకు అని మను అడుగుతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget