Jr NTR Birthday Special: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
Happy Birthday Jr NTR: ఎన్టీఆర్ యాక్టింగ్ పవర్ హౌస్. ఆయన నటనకు ఎప్పుడో ప్రశంసలు దక్కాయి. అందరూ మాట్లాడారు. అయితే, ఎన్టీఆర్ స్టైల్ & లుక్స్‌పై డిస్కషన్ తక్కువ. ఆయన కెరీర్‌లో టాప్ 5 లుక్స్!
Young Tiger NTR Birthday Today: ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఇండస్ట్రీలో జనాలంతా చెబుతారు. ఆయన ఒక యాక్టింగ్ పవర్ హౌస్. తారక రాముడి నటన ప్రేక్షకుల లోకాన్ని ఎప్పుడో మెప్పించింది. చప్పట్లు కొట్టించింది. తన నటనతో సన్నివేశాలకు, ఆయా క్యారెక్టర్లకు, సినిమాలకు ప్రాణం పోయడం ఎన్టీఆర్ (Jr NTR)కు కొత్త కాదు. ఆయన నటన గురించి అందరూ మాట్లాడతారు. అయితే, ఎన్టీఆర్ స్టైల్ & లుక్స్ గురించి డిస్కషన్ తక్కువ. హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ ఫైవ్ లుక్స్ ఏమిటో చూద్దామా!
యంగ్ యమ... భలే బాగుందమ్మా!
ఎన్టీఆర్ యాక్టింగును ఒకానొక దశలో నటన డామినేట్ చేసింది. 'రాఖీ'లో ఆయన నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో బరువు మీద కొన్ని విమర్శలు వచ్చాయి. దర్శక ధీరుడు వంటి సన్నిహితులు ఆయనతో ఆ విషయం నేరుగా చెప్పారు. దాంతో 'రాఖీ' తర్వాత సినిమాకు ఎన్టీఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. యంగ్ యముడి లుక్ భలే ఉందన్నారంతా! అభిమానులే కాదు, మిగతా ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు.
This is Cinema Moment
— . (@AbhithNTRFan) March 7, 2024
This is Goosebumps Moment
|| #Yamadonga || || #JrNTR ||
|| #ManOfMassesNTR ||
.@tarak9999 🛐♥️😍❤️🔥🔥 https://t.co/8pP3oCvCGC pic.twitter.com/WMBhg68Tio
హలో చారి... నీ స్టైల్ వేరే మాదిరి!
'యమదొంగ' తర్వాత వచ్చిన 'కంత్రి' కోసం ఎన్టీఆర్ మరింత సన్నబడ్డాడు. ఆ లుక్ అభిమానుల్నీ అంతగా ఆకట్టుకోలేదు. అయితే, ఆ నెక్స్ట్ సినిమాకు ఎన్టీఆర్ మళ్లీ సర్‌ప్రైజ్ చేశారు. 'అదుర్స్'లో చారి లుక్ నిజంగా అదుర్స్ అంతే! ఆ కామెడీ క్లిక్ కావడం వెనుక పురోహితుడిగా ఆ లుక్ కూడా ఒక కారణం అని చెప్పాలి. నుదుట నామం, తెల్లపంచె కట్టులో ఎన్టీఆర్‌ను మళ్లీ అలా చూస్తామో? లేదో?! 'అదుర్స్'లో మరో పాత్రకు లుక్ పరంగా వేరియేషన్ చూపించారు. 'బృందావనం' కోసం మీసం కత్తిరించి ఇంకాస్త కొత్తగా కనిపించారు.
నాన్నకు ప్రేమతో... నెవ్వర్ బిఫోర్!
ఎన్టీఆర్ కెరీర్ మొత్తంలో స్టైలిష్ లుక్ అంటే 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనే! ఇలా కూడా యంగ్ టైగర్‌ను చూపించవచ్చా? అనేంతలా, చాలా కొత్తగా చూపించారు సుకుమార్. ఆ లుక్ గురించి చెప్పాలంటే... నెవ్వర్ బిఫోర్, ఎవ్వఆర్ ఆఫ్టర్. ఆ గడ్డం, హెయిర్ స్టైల్, సూటు బూటు... తారక రాముణ్ణి మళ్లీ అలా చూడటం కష్టం ఏమో!? ఎన్టీఆర్ లుక్ మారడంతో ఆ సినిమాలో ఆయన నటన కొత్తగా కనిపిస్తుంది.
View this post on Instagram
రావణ... 'జై లవ కుశ'లో ప్రతినాయక!
ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన తొలి సినిమా 'జై లవ కుశ'. ముందు మూడు క్యారెక్టర్లలో మూడు డిఫరెంట్ లుక్స్ చూపించారు. ఆ మూడింటిలో హైలైట్ అంటే 'జై' లుక్! ఓ విధంగా నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ అది. లుక్ అంటే కేవలం హెయిర్ స్టైల్ - బియర్డ్ మేకోవర్, స్టైలింగ్ మాత్రమే కాదు... ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కూడా ఎన్టీఆర్ చెప్పిన సినిమా. తన నటనతో మెప్పించిన సినిమా. జస్ట్ ఎక్స్‌ప్రెషన్‌తో విలనిజం చూపించారు.
వీర రాఘవ... సిక్స్ ప్యాక్ సూపర్ అంతే!
'టెంపర్' కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశారు. ఆ సినిమాలో స్టైలుగా కనిపించారు. ఆ తర్వాత 'అరవింద సమేత వీర రాఘవ'లోనూ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. మరి, రెండు సినిమాల్లో ఏ లుక్ బావుంటుంది? అని ఓటింగ్ పెడితే... వీర రాఘవకు కాస్త ఎక్కువ మెజారిటీ వస్తుంది. సిక్స్ ప్యాక్ అని కాదు గానీ... టోటల్ సినిమా అంతా ఎన్టీఆర్ స్టైలింగ్ మ్యాన్లీగా ఉంటుంది. లుక్స్, స్టైల్ పరంగా ఒకప్పుడు ఎన్టీఆర్‌ను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
Also Read: 'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలే!
View this post on Instagram
'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీం లుక్ సైతం అభిమానుల్లో చాలా మందికి ఫేవరెట్. ఆ సినిమా తర్వాత 'దేవర', 'వార్ 2' చేస్తున్నారు ఎన్టీఆర్. దేవర లుక్ మాసీగా ఉంది. స్పై థ్రిల్లర్ కనుక 'వార్ 2'లో స్టైలిష్ లుక్ ఉండవచ్చు. లుక్స్ పరంగా ఎన్టీఆర్ మరిన్ని ప్రయోగాలు చేయాలని కోరుకుంటూ... హ్యాపీ బర్త్ డే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం