అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 20th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: నోరు జారిన శైలేంద్ర – నిజం చెప్పినా పట్టించుకోని మను

Guppedanta Manasu Today Episode: నీ తండ్రి ఎవరో నాకు తెలుసు నేను చెప్తాను అని శైలేంద్ర చెప్పినా మను పట్టించుకోడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  అసలు నువ్వెందుకు నా పదవికి అడ్డం పడుతున్నావు. నువ్వు అనే వాడివి లేకపోతే ఈపాటికి కాలేజీ నా చేతుల్లోకి వచ్చేది అంటూ శైలైంద్ర, మనును అడుగుతాడు. అసలు నేను తలచుకుంటే నిన్ను ఎప్పుడో మట్టి కరిపించేవాడిని. నువ్వు నాకు గడ్డి పరకతో సమానం అంటాడు మను. నీకెప్పుడో చెప్పాను. ఎండీ పదవికి నీకు అర్హత లేదని అయినా వినవేం.. అనగానే తండ్రి ఎవరో తెలియని నువ్వు నాకు చెప్తున్నావా? అంటూ శైలేంద్ర అనగానే మను కోపంగా శైలేంద్రను తిడతాడు.

శైలేంద్ర: అయినా అదంతా ఎందుకు బ్రదర్‌. మనం ఒక డీల్‌ కుదుర్చుకుందామా?

మను: నీతో డీల్‌ కుదుర్చుకోవడానికి ఏముంది? ఏమీ లేదు.

శైలేంద్ర: అంతలా తీసిపాడేయకు బ్రదర్‌. నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది. అదే నీ కన్నతండ్రి ఎవరో నాకు తెలుసు.

మను: నా తండ్రి ఎవరో నీకు తెలుసా?

శైలేంద్ర: నీ తండ్రి పూర్తి బయోడేటా నా దగ్గర ఉంది.

అని శైలేంద్ర చెప్పగానే ఎగ్జైంటింగ్‌గా నా తండ్రి ఎవరో చెప్పు అని అడుగుతాడు మను. చెప్తాను కానీ నువ్వు నాకు ఒక పని చేస్తే నీ తండ్రి గురించి నీకు చెప్తాను. అనగానే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా? నా తండ్రి గురించి నీకు తెలియదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే కాలేజీలో నీకు స్మారక చిహ్నం కట్టిస్తానని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు మను. మరోవైపు రౌడీలు వసుధార కోసం వెతుకుతుంటారు. బుజ్జి వెళ్తుంటే పిలిచి వసుధార ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశావా అని అడగ్గానే  చూడలేదని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు దేవయాని లెటర్‌ పట్టుకుని మాట్లాడుతుంది.

దేవయాని: రేయ్‌ ఇంత పెద్ద విషయం డోర్స్‌ ఓపెన్‌ చేసి చెప్తావేంట్రా.. ఆ ధరణి విందంటే మహేద్రకు చెప్తుంది.

శైలేంద్ర: ఈ లెటర్‌ మన దగ్గర ఉన్నా ప్రయోజనం లేదు మమ్మీ..

దేవయాని: ప్రయోజనం లేదా?

శైలేంద్ర: అవును మామ్‌ నేను ఆ మను గాడి దగ్గరకు వెళ్లి మీ నాన్న ఎవరో చెప్తాను అంటే వాడు నమ్మడం లేదు మామ్‌.

దేవయాని: దరిద్రుడా? ఎంత పని చేశావురా? అయినా నీకు ముందే చెప్పానుగా ఏదైనా చేసే ముందు నాకు చెప్పమని..

 అంటూ శైలేంద్రను తిడుతుంది. నువ్వెన్ని చెప్పినా ఆ మను నమ్మడని చెప్తుంది. దీంతో ఇక నుంచి నువ్వు చెప్పినట్లే చేస్తానని శైలేంద్ర అంటాడు. అసలు చేయాల్సింది ఇది కాదు. మహేంద్రకు  అనుపమకు మధ్య చిచ్చు రేపాలి వాళ్లను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సింది అంటుంది దేవయాని. మరోవైపు సరోజ క్యారెజ్‌ తీసుకుని వస్తుంది.

రాధమ్మ: అబ్బా ఎందుకే అంతలా అరుస్తున్నావు.. వాడు ఇంట్లోనే ఉన్నాడుగా వచ్చేదాకా కూడా ఆగలేవా?

సరోజ: నేను ఆగలేను అమ్మమ్మ నేను ఇష్టంగా తీసుకొచ్చిన వంటలన్నీ బావకు దగ్గరుండి వడ్డించాలి కదా?

వసుధార: ఈ అమ్మాయి ఎందుకు రిషి సార్‌ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది.

( అని మనసులో అనుకుంటుంది.)

రాధమ్మ: సరిపోయింది మీ నాన్నేమో వాడితో వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటాడు. నువ్వేమో వడ్డించడానికి తొందరపడతావు.

   అనగానే సరోజ అయితే ఒక పని చేయమను నా మెడలో తాళి కట్టమను అప్పులు తీరిపోతాయి. పైగా నా ఆస్థికి వారసుడవుతాడు. మాకు పెళ్లైతే మా మధ్యలో ఎవరూ వచ్చే వాళ్లు ఉండరు. అనగానే సరోజ, వసుధార మధ్య వాదన జరుగుతుంది. తర్వాత భోజనానికి రమ్మని వసుధారను పిలిస్తే రానని బాధపడుతుంది. దీంతో సరోజ మాటలను నువ్వేం పట్టించుకోకు అని రంగ చెప్పినా వినకుండా లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత ఒంటరిగా కూర్చుని వసుధార, సరోజ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో రంగ భోజనం తీసుకుని వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ప్రభాస్‌ వల్లే నేను ఇలా అయ్యాను - బేబీ బంప్‌ చూపిస్తూ దీపికా ఆసక్తికర కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 7th: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
Nindu Noorella Saavasam Serial Today August 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ముందే కొట్టుకున్న భాగీ, మను – ప్రచండను గుర్తించిన అమర్‌   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ముందే కొట్టుకున్న భాగీ, మను – ప్రచండను గుర్తించిన అమర్‌   
Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మూడు లక్షల కోసం నాటకం ఆడిన ఐషు – వెంకీని ఓదార్చిన లక్ష్మీ  
‘బ్రహ్మముడి’ సీరియల్: మూడు లక్షల కోసం నాటకం ఆడిన ఐషు – వెంకీని ఓదార్చిన లక్ష్మీ  
Illu Illalu Pillalu Serial Today August 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ, ధీరజ్ విడిపోవడం వెనక అసలు కారణం తెలుసుకున్న వేదవతి! ప్రేమ, ధీరజ్ మధ్యలో ముగ్ధ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ, ధీరజ్ విడిపోవడం వెనక అసలు కారణం తెలుసుకున్న వేదవతి! ప్రేమ, ధీరజ్ మధ్యలో ముగ్ధ!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Embed widget